Tula Uma: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు సీట్ల వ్యవహారం వేడెక్కుతోంది. పార్టీలోని ప్రముఖ నేతలు తమ మద్దతుదారులకు టిక్కెట్లు ఇచ్చారు. కొందరికి ఆశించిన ఫలితాలు రాగా, మరికొందరికి బీజేపీ హైకమాండ్ మొండిచేయి చూపింది.
భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా విజయవాడలో మైనారిటీస్ వెల్ఫేర్ డే, నేషనల్ ఎడ్యుకేషన్ డే వేడుకల్లో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. దేశ చరిత్రలో తొలిసారిగా ముస్లింలకు రిజర్వేషన్లు అమలు చేసిన వ్యక్తి మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర్రెడ్డి అని సీఎం జగన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.
సీఎం వైఎస్ జగన్ రేపు విజయవాడలో పర్యటించనున్నారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించనున్న భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి ఉత్సవాలలో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు రేపు ఉదయం 10.20 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరుతారు. ఆ తర్వాత ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంకు చేరుకుంటారు. అజాద్ జయంతి సందర్భంగా మైనారిటీస్ వెల్పేర్ డే, నేషనల్ ఎడ్యుకేషన్ డే సందర్భంగా భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి ఉత్సవాలలో పాల్గొననున్నారు.
ప్రపంచ కప్ 2023లో భాగంగా.. ఆఫ్ఘనిస్తాన్పై దక్షిణాఫ్రికా 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 245 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా 47.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి టార్గెట్ ను ఛేదించింది. దీంతో వరల్డ్ కప్ నుంచి ఆఫ్ఘానిస్తాన్ నిష్క్రమించింది.ా
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో ఎన్టీవీ క్వశ్చన్ అవర్ నిర్వహించింది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజల ధీమానే నా ధీమా అని ఆయన అన్నారు. ఉద్యమ ఆకాంక్షలు ఇప్పటి వరకు నెరవేరలేదన్నారు. కేసీఆర్ తన సొంత ఆలోచనలను breaking news, latest news, telugu news, Revanth Reddy, Congress,
కాంగ్రెస్ అధిష్టానం విడుదల చేసిన తుది జాబితాలో సూర్యాపేట కాంగ్రెస్ అభ్యర్థిగా రామ్ రెడ్డి దామోదర్ రెడ్డిని ప్రకటించింది. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. సూర్యాపేట కాంగ్రెస్ టికెట్ ఆశించిన పటేల్ రమేష్ రెడ్డితో అధిష్టానం మాట్లాడుతుందని ఆయన తెలిపారు. ఇన్నాళ్లు కాంగ్రెస్ అభివృద్ధి కోసం రమేష్ రెడ్డి కష్టపడి పనిచేశారన్నారు. రమేష్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం సముచిత స్థానం ఇవ్వాలని కోరానని తెలిపారు. రమేష్ రెడ్డితో వివాదం లేకుండా ఇద్దరం కలిసి పనిచేస్తామని ఆయన పేర్కొన్నారు.
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం నల్లబెల్లి ఎన్నికల ప్రచారంలో అపశృతి చోటు చేసుకుంది. గ్రామ పంచాయతీ కూడలిలో ఒక్కసారిగా గణేష్ మండపం కుప్పకూలింది. దీంతో బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న 10 మంది మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని గ్రామంలోనే ప్రథమ చికిత్స అందించారు.