ఎల్బీనగర్ కాషాయమయంగా మారింది. భారీ జన సంద్రంతో ఎల్బీనగర్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సామ రంగారెడ్డి నామినేషన్ వేశారు. నామినేషన్ కు ముందు హయత్ నగర్ లోని శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి.. అనంతరం బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నామినేషన్ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రాజాసింగ్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. బీజేపీ శ్రేణులు, మిత్ర పక్షం జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి భారీ బైక్ ర్యాలీని నిర్వహించారు. దీంతో నియోజకవర్గం మొత్తం కాషాయపు జెండాలతో జన సంద్రోహంగా మారింది.
Read Also: MP Bharat Ram: ఆ రెండు పార్టీలకు సిగ్గుందా?.. రాజమండ్రి ఎంపీ భరత్ ఫైర్
గత 16 సంవత్సరాల నుంచి నియోజకవర్గంలో ప్రతి గడపని తట్టానని.. ప్రతి సమస్యను తెలుసుకున్నానని ప్రజల శ్రేయస్సు కొరకు నిరంతరం పోరాటం చేసిన తనకు ఒక్కసారి అవకాశం ఇవ్వాలని సామ రంగారెడ్డి వేడుకున్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గ ప్రాంత అభివృద్ధి కొరకు గత 16 సంవత్సరాలుగా గల్లీ గల్లీ తిరిగానని తెలిపారు. గత పాలకులు నియోజకవర్గంను దోచుకోవడం తప్ప అభివృద్ధికి నోచుకుంది లేదన్నారు. ప్రభుత్వ స్థలాలు అన్యాక్రాంతమవుతున్నాయని పేదలు వివక్షకు గురవుతున్నారని, మార్పు తీసుకురావాలని ఉద్దేశంతో నిరంతరం ప్రజల కొరకు పోరాటం చేస్తున్నానని అన్నారు. తన నామినేషన్ కొరకు వేలాది మంది స్వచ్ఛందంగా తరలి రావడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఇక్కడే పుట్టి పెరిగిన తనకు ఒక్కసారి అవకాశం ఇస్తే నియోజకవర్గం అభివృద్ధిలో మార్పు తీసుకొస్తానని హామీ ఇచ్చారు.
Read Also: MLA Shankar Rao: నా మీద పోటీకి టీడీపీ నాయకులను వెతుక్కుంటుంది