ఈ వరల్డ్ కప్లో రన్ మిషన్ విరాట్ కోహ్లీ రికార్డుల పరంపర కొనసాగిస్తున్నాడు. న్యూజిలాండ్ పై సెంచరీ సాధించి 49వ శతకాన్ని ఖాతాలో వేసుకున్నాడు. అంతేకాకుండా.. సచిన్ రికార్డును కూడా సమం చేశాడు. తాజాగా.. నెదర్లాండ్స్ తో ఆడిన మ్యాచ్ లో కోహ్లీ మరో రికార్డును సాధించాడు. ఈ మ్యాచ్ లో 51 పరుగులు చేసిన కోహ్లీ ప్రస్తుత ప్రపంచ కప్లో.. ఏకంగా 7 హాఫ్ సెంచరీలు పూర్తి చేశాడు. దీంతో ఒక ప్రపంచ కప్లో అత్యధిక…
ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని రేవంత్ రెడ్డి అన్నారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు పెడితే సరిపోతుందని తెలిపారు. మాదిగలకు మోసం చేసే ప్రయత్నం మోడీ చేశారని అన్నారు. డిసెంబర్ 4 నుండి మొదలయ్యే పార్లమెంట్ సమావేశాల్లో వర్గీకరణ బిల్లు పెట్టండి.. మద్దతు ఇస్తామని రేవంత్ పేర్కొన్నారు. కండిషన్ లేకుండా రాహుల్ గాంధీ మద్దతు ఇస్తారని తెలిపారు.
బీఆర్ఎస్ పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. డ్రామారావు కుట్రల గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. కొత్త ప్రభాకర్ మీద దాడి జరిగితే.. గాయపడ్డ ప్రభాకర్ కంటే.. ముందే హరీష్ ఆసుపత్రికి వెళ్ళాడని రేవంత్ రెడ్డి అన్నారు. కత్తి పోట్లకు గురైన ప్రభాకర్ రెడ్డి నడుస్తూ కారెక్కాడు.. హరీష్ మాత్రం పరుగు పరుగున పరిగెత్తాడని విమర్శించారు. ఈ దాడి వెనక పీసీసీ బాద్యుడు అని కేసీఆర్ అన్నాడన్నారు. కానీ…
ఇవాళ సాయంత్రం 7 గంటల నుంచి ఇంద్రకీలాద్రి ఆలయం మూసివేయనున్నారు. ఈరోజు దీపావళి సందర్భంగా అమ్మవారి ప్రధానాలయము నందు సాయంత్రం 5 గంటలకు ధనలక్శ్మి పూజను నిర్వహించారు. సాయంత్రం 06 గంటలకు అమ్మవారికి పంచహారతులు సేవను నిర్వహించారు.
విశాఖపట్నం జిల్లా మధురవాడ కొమ్మాది ప్రభుత్వ మద్యం దుకాణం వద్ద ఓ వ్యక్తి వీరంగం సృష్టించాడు. మద్యం దుకాణంలో పెట్రోల్ పోసి నిప్పంటించాడు. తనకు నచ్చిన బ్రాండ్ ఇవ్వలేదని మనస్థాపంతో ఈ విధంగా వీరంగం సృష్టించినట్లు తెలిసింది.
వరల్డ్ కప్ 2023లో భాగంగా ఇండియా-నెదర్లాండ్స్ మధ్య లీగ్ దశలో చివరి మ్యాచ్ జరుగుతుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో ముందుగా భారత్ బ్యాటింగ్ కు దిగింది. దీంతో టీమిండియా నెదర్లాండ్ ముందు ఓ భారీ లక్ష్యాన్ని ముందుంచింది. నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 410 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ సెంచరీలతో చెలరేగారు.
సిద్ధిపేట జిల్లా గజ్వేల్ (మం) దాతారుపల్లి గ్రామంలో ఓ వృద్ధురాలిని దుండుగులు దారుణంగా హత్య చేశారు. రాజవ్వ (80) అనే వృద్ధురాలి నోట్లో యాసిడ్ పోసి, గుడ్డలు కుక్కి హత్యకు పాల్పడ్డారు. అనంతరం రాజవ్వ ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు, కాళ్ళ పట్టీలను ఎత్తుకెళ్లారు గుర్తుతెలియని వ్యక్తులు. ఈ ఘటన గురించి వివరాలు తెలుసుకున్న పోలీసులు.. ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.
రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి కొప్పుల ఈశ్వర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో లక్ష కోట్లు అవినీతి జరిగిందని ఆరోపించడం రేవంత్ రెడ్డి అజ్ఞానానికే తార్కాణమని మంత్రి కొప్పుల అన్నారు. 2018 ఎన్నికపై ఈవీఎంల ట్యాంపరింగ్ చేసాను అన్న రేవంత్ రెడ్డి మాటలు.. ఎన్నికల కమిషన్ కించపరచడమే అని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం వల్లనే తెలంగాణ ప్రాంతం సస్యశ్యామలం అవుతుందని తెలిపారు. ఇకనైనా బుడ్డర్ కాన్ వేషాలు మానుకోవాలని రేవంత్…