Koppula Eshwar: తెలంగాణలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ పార్టీ నాయకుల మధ్య విమర్శలు ఎక్కువవుతున్నాయి. ఒకరిపై ఒకరు పరస్పర విమర్శల దాడులకు దిగుతున్నారు. బీఆర్ఎస్ పై కాంగ్రెస్, కాంగ్రెస్ బీఆర్ఎస్ పై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ఈ సందర్భంగా.. ధర్మపురిలో సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ మీడియా సమావేశం నిర్వహించారు. నిన్న ధర్మపురిలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి కొప్పుల ఈశ్వర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
Read Also: Guvvala Balaraju: నా తల్లిదండ్రుల సాక్షిగా చెబుతున్నా.. వారే దాడి చేశారు
కాళేశ్వరం ప్రాజెక్ట్ లో లక్ష కోట్లు అవినీతి జరిగిందని ఆరోపించడం రేవంత్ రెడ్డి అజ్ఞానానికే తార్కాణమని మంత్రి కొప్పుల అన్నారు. 2018 ఎన్నికపై ఈవీఎంల ట్యాంపరింగ్ చేసాను అన్న రేవంత్ రెడ్డి మాటలు.. ఎన్నికల కమిషన్ కించపరచడమే అని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం వల్లనే తెలంగాణ ప్రాంతం సస్యశ్యామలం అవుతుందని తెలిపారు. ఇకనైనా బుడ్డర్ కాన్ వేషాలు మానుకోవాలని రేవంత్ పై విమర్శలు గుప్పించారు. మరోవైపు జీవన్ రెడ్డి హయాంలో జగిత్యాల అభివృద్ధికి నోచుకోలేదని అన్నారు. మళ్లీ గెలవడం కోసం బూటకపు ఆరోపణలు చేయడం తగదని తెలిపారు. కేవలం గెలుపు కోసమే జీవన్ రెడ్డి అసత్య ప్రచారాలు చేస్తున్నాడని.. రాజకీయాలు, పదవులు శాశ్వతం కాదు అంతిమంగా ఎవరు ఏమిటో ఎన్నికల ఫలితాలు నిర్దేశిస్తాయని మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు.
Read Also: Kaleru Venkatesh: ఎన్నికల ప్రచారంలో బ్రహ్మరథం పడుతున్న మహిళలు, యువకులు