US Video: తప్పిన విమాన ప్రమాదం.. ల్యాండింగ్ అవుతుండగా ఊడిపోయిన ముందు చక్రం
- అమెరికాలో తప్పిన ఘోర విమాన ప్రమాదం
- ల్యాండింగ్ అవుతుండగా ఊడిపోయిన ముందు చక్రం
- ప్రయాణికులంతా క్షేమం
- ఓర్లాండో అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికాలో ఘోర విమాన ప్రమాదం తప్పింది. ఓర్లాండో అంతర్జాతీయ విమానాశ్రయంలో యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం ల్యాండింగ్ అవుతుండగా ముందు చక్రం ఒక్కసారిగా ఊడిపోయింది. దీంతో విమానం కొద్దిదూరం నేలకు రాసుకుంటూ వెళ్లి ఆగిపోయింది. ఈ క్రమంలో పొగలు కమ్ముకున్నాయి. వెంటనే అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆపి ప్రయాణికులను సురక్షితంగా రక్షించారు.
ఇది కూడా చదవండి: Vijay: మరోసారి సీబీఐ ముందు హాజరైన విజయ్.. ఎన్నికల వేళ ఏం జరుగుతోంది?
Also Read
- Pakistan: పాకిస్థాన్లో ఘోర విషాదం.. పాఠశాల పైకప్పు కూలి 21 మంది విద్యార్థులు, టీచర్ మృతి
- US News: అమెరికాలో హిందూ దేవాలయంపై దాడికి కుట్ర.. 19 ఏళ్ల యువకుడి అరెస్ట్..!
- Germany: జర్మనీలో ముగ్గురు భారతీయులు అనుమానాస్పద మృతి.. రొమేనియా జాతీయుడు అరెస్ట్
- Breaking Bad Actor: ‘బ్రేకింగ్ బ్యాడ్’ నటుడు ఆర్జే మిట్టే మృతి కేసులో బిగ్ ట్విస్ట్!
చికాగోలోని అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఓర్లాండోకు 200 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో విమానం బయల్దేరింది. అయితే ఓర్లాండోలో విమానం ల్యాండింగ్ అవుతుండగా గేరింగ్ నుంచి ముందు చక్కం ఊడిపోయింది. అయితే విమానం ముందుకు వెళ్లి ఆగిపోయింది. అనంతరం ఎమర్జెన్సీ ద్వారాల నుంచి ప్రయాణికులు దిగిపోయారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని.. ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నారని అధికారులు తెలిపారు. అనంతరం ప్రయాణికులను బస్సులోకి ఎక్కించుకుని బయటకు తీసుకెళ్లారు. ఇక ప్రమాదానికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
ఇది కూడా చదవండి: Trump-Iran: ఖమేనీపై దాడి చేస్తే ఖబడ్దార్.. పూర్తి స్థాయి యుద్ధానికి దిగుతామని ఇరాన్ వార్నింగ్
అయితే చక్రం ఊడిపోవడం వెనుక గాలులతో కూడిన వాతావరణమే కారణమై ఉండొచ్చని అంచనాకు వస్తున్నారు. ఇక ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో ఓర్లాండో అంతర్జాతీయ విమానాశ్రయంలో గంటకు 54 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. సమీపంలోని ఓర్లాండో ఎగ్జిక్యూటివ్ విమానాశ్రయంలో గంటకు 56 కి.మీ వేగంతో గాలులు వీచినట్లుగా నివేదికలు అందుతున్నాయి. ఫ్లోరిడా తూర్పు తీరం వెంబడి బ్రెవార్డ్ కౌంటీలోని అనేక ప్రాంతాలకు జాతీయ వాతావరణ శాఖ తీవ్ర గాలి హెచ్చరికలు జారీ చేసింది.
🚨WATCH: United Airlines flight nearly crashes during landing at Orlando International Airport (MCO) as nose wheel appears to roll off landing gearpic.twitter.com/bzjY6uQFmT
— Derrick Evans (@DerrickEvans4WV) January 19, 2026
తాజావార్తలు
-
Supreme Court: ‘న్యాయవ్యవస్థను ఎవరూ బెదిరించలేరు’ రాహుల్గాంధీ యాత్రపై సీజేఐ కీలక వ్యాఖ్యలు
-
Yuvraj Singh: ఇప్పుడు కాదు.. 25 ఏళ్లుగా అయనకు అసిస్టెంట్నే!
-
Sanju Samson: తిలక్ వర్మ వల్లనే మ్యాచ్ ఓడిపోయాం.. గెలిచే మ్యాచ్ అక్కడే చెడింది..
-
Anupama: ‘పెళ్లి కాకున్నా బిడ్డ కావాలనుంది!’.. అనుపమ పరమేశ్వరన్ సంచలన వ్యాఖలు
-
Pakistan: పాకిస్థాన్లో ఘోర విషాదం.. పాఠశాల పైకప్పు కూలి 21 మంది విద్యార్థులు, టీచర్ మృతి
ట్రెండింగ్
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!