Revanth Reddy: ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ కట్టుబడి ఉంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మైనార్టీ, బీసీలకు సెపరేట్ గా డిక్లరేషన్ ఇచ్చామని అన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. మైనార్టీ డిక్లరేషన్ రూపొందించింది సల్మాన్ ఖుర్షిద్ అని తెలిపారు. అయితే కేటీఆర్ మాత్రం.. మోకాలికి, బోడిగుండుకు ముడి పెట్టి మాట్లాడుతున్నాడని విమర్శించారు. మైనార్టీలను బీసీలలో కలుపుతారా.. బుర్ర ఉందా అని మండిపడ్డారు. బీసీలలో 136 కులాల్లో వర్గీకరణ చేసి చట్టం చేశారన్నారు. బేసిక్ సెన్స్ ఉన్నోడు ఎవడైనా ఇలాంటి అడ్డదిడ్డంగా మాట్లాడరని ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని రేవంత్ రెడ్డి అన్నారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు పెడితే సరిపోతుందని తెలిపారు. మాదిగలకు మోసం చేసే ప్రయత్నం మోడీ చేశారని అన్నారు. డిసెంబర్ 4 నుండి మొదలయ్యే పార్లమెంట్ సమావేశాల్లో వర్గీకరణ బిల్లు పెట్టండి.. మద్దతు ఇస్తామని రేవంత్ పేర్కొన్నారు. కండిషన్ లేకుండా రాహుల్ గాంధీ మద్దతు ఇస్తారని తెలిపారు.
Read Also: Revanth Reddy: ఎన్నికలు మొదలైనప్పటి నుండి బీఆర్ఎస్ డ్రామాలకు తెర లేపింది
Also Read
- OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
- LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్‌లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
- Pakistan: బ్రిక్స్‌లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
- New Smart Mobile: OLED డిస్‌ప్లే, 1TB స్టోరేజ్, 7,000mAh బ్యాటరీ.. పాస్‌పోర్ట్ లాంటి ఫోన్.. ఎగబడుతున్న జనాలు..
చట్టాలను తమ చేతిలోకి తీసుకుంటే కేసీఆర్.. కేటీఆర్ బయట తిరగలేరని రేవంత్ విమర్శించారు. రాజకీయ పార్టీలు చేసే పని.. పోలీసులు చేయకండని సూచించారు. మేము చేసే పనులు.. మీరు చేస్తే, డిసెంబర్ 9 తర్వాత.. మీరు చేసిన పనులపై విచారణ చేస్తామని రేవంత్ అన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు భయపడకండని తెలిపారు. వచ్చే అసెంబ్లీ మొదటి సమావేశంలోనే కేసులు ఎత్తివేసే బిల్లు పెడతామని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. వ్యవసాయంకు 24 గంటలు కరెంట్ ఇస్తున్నామని బీఆర్ఎస్ చెబుతుంది.. ఇవ్వడంలేదని నిరూపిస్తే అమర వీరుల స్థూపం దగ్గర ముక్కు నేలకు రాయడానికి హరీష్ రావు, కేటీఆర్ సిద్ధమా అని రేవంత్ సవాల్ చేశారు. 6 నెలల నుండి 24 గంటల కరెంట్ ఇచ్చారో చూద్దామన్నారు. రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనేనని.. ఉచిత విద్యుత్ పై మాది పేటెంట్ హక్కు అని రేవంత్ రెడ్డి అన్నారు.
Read Also: Etela Rajender: దిక్కులేక గజ్వేల్ రాలేదు, బాధతో వచ్చాను.. కేసీఆర్ బాధితులకు అధ్యక్షుడిని..
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్‌లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్‌లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?