Siddipet: ఈ రోజుల్లో డబ్బుల కోసం దేనికైనా తెగించేస్తున్నారు దుండగులు.. దొంగతనాలు, హత్యలు, అత్యాచారాలు ఇలా డబ్బుల ఆశ కోసం క్షణాల్లో పని కానించేస్తున్నారు. ఎంత టెక్నాలజీ మారినా.. ఎన్ని సీసీ టీవీలు వచ్చినా పట్టువదలని విక్రమార్కుల్లా తయారవుతున్నారు. అమాయకంగా రోడ్లపై నడుచుకుంటూ వెళ్లే వారిని సైతం వదలడం లేదు. డబ్బుల కోసం వారి మెడలో బంగారు గొలుసును కొట్టేసేందుకు కొందరు దుండగులు బైక్ లపై వచ్చి ప్రాణాలను పోగొట్టే పరిస్థితికి తీసుకొస్తున్నారు. తాజాగా.. సిద్ధిపేట జిల్లా గజ్వేల్ (మం) దాతారుపల్లి గ్రామంలో ఓ వృద్ధురాలిని దుండుగులు దారుణంగా హత్య చేశారు. రాజవ్వ (80) అనే వృద్ధురాలి నోట్లో యాసిడ్ పోసి, గుడ్డలు కుక్కి హత్యకు పాల్పడ్డారు. అనంతరం రాజవ్వ ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు, కాళ్ళ పట్టీలను ఎత్తుకెళ్లారు గుర్తుతెలియని వ్యక్తులు. ఈ ఘటన గురించి వివరాలు తెలుసుకున్న పోలీసులు.. ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.
Read Also: Koppula Eshwar: గెలుపు కోసమే అసత్య ప్రచారాలు చేస్తున్నారు
ఈ ఘటనపై మృతురాలి కొడుకు మాట్లాడుతూ.. రాత్రి అన్నం తర్వాత తనకు సంబంధించిన ఇంటిలో పడుకుందని.. ఉదయం ఇంకా లేవకపోవడంతో అనుమానం వచ్చి ఇంటికి వెళ్లి చూశామని తెలిపాడు. దీంతో.. మృతురాలి ముఖాన్ని గుడ్డలతో కట్టారని, అంతేకాకుండా నోట్లో టవల్ ను కుక్కారు. అంతేకాకుండా.. నోట్లో యాసిడ్ పోశారని చెప్పాడు. ఇదంతా తన ఒంటిపై ఉన్న బంగారం కోసం చేశారని మృతురాలి కొడుకు చెప్పాడు.
Read Also: Harish Rao: ఉచిత కరెంట్‌ను ఉత్త కరెంట్ చేసింది కాంగ్రెస్ కాదా?