ఈ వరల్డ్ కప్లో రన్ మిషన్ విరాట్ కోహ్లీ రికార్డుల పరంపర కొనసాగిస్తున్నాడు. న్యూజిలాండ్ పై సెంచరీ సాధించి 49వ శతకాన్ని ఖాతాలో వేసుకున్నాడు. అంతేకాకుండా.. సచిన్ రికార్డును కూడా సమం చేశాడు. తాజాగా.. నెదర్లాండ్స్ తో ఆడిన మ్యాచ్ లో కోహ్లీ మరో రికార్డును సాధించాడు. ఈ మ్యాచ్ లో 51 పరుగులు చేసిన కోహ్లీ ప్రస్తుత ప్రపంచ కప్‌లో.. ఏకంగా 7 హాఫ్ సెంచరీలు పూర్తి చేశాడు. దీంతో ఒక ప్రపంచ కప్‌లో అత్యధిక హాఫ్ సెంచరీలు సాధించిన బ్యాట్స్‌మెన్ల జాబితాలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సరసన కోహ్లీ చేరాడు. 2003 వరల్డ్ కప్‌లో సచిన్ టెండూల్కర్ మొత్తం 7 అర్ధ సెంచరీలు నమోదు చేయగా.. తాజాగా విరాట్ కూడా ఆ జాబితాలో చేరాడు. ఇదిలా ఉంటే.. ఈ టోర్నీలో విరాట్ మరో హాఫ్ సెంచరీ సాధిస్తే.. ఒక ప్రపంచ కప్‌లో అత్యధిక హాఫ్ సెంచరీలు కొట్టిన ఆటగాడిగా రికార్డ్ క్రియేట్ చేయనున్నాడు. మరోవైపు ఈ జాబితాలో.. 2019 వరల్డ్‌కప్‌లో బంగ్లాదేశ్ స్టార్ ఆటగాడు షకీబ్ అల్ హసన్ కూడా 7 సార్లు హాఫ్ సెంచరీలు చేశాడు.
Revanth Reddy: ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ కట్టుబడి ఉంది
ఈ వరల్డ్ కప్‌లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో ఉన్నాడు. నెదర్లాండ్స్‌పై జరిగిన మ్యాచ్ లో 51 పరుగులతో మొత్తం 9 మ్యాచ్‌లు ఆడి 594 పరుగులు చేశాడు. అందులో 4 హాఫ్ సెంచరీలు, 2 సెంచరీలు ఉన్నాయి. ఇక కోహ్లీ తర్వాత.. ఈ జాబితాలో సౌతాఫ్రికా బ్యాట్స్ మెన్ క్వింటన్ డికాక్(591) ఉన్నాడు. ఈ ఇద్దరు ఆటగాళ్లు సెమీస్ మ్యాచ్‌లు ఆడనుండడంతో వీరిద్దరిలో ఎవరు టాప్ స్కోరరుగా నిలవనున్నారో చూడాలి. ఇక సెమీస్ ఫైనల్ మ్యాచ్ లు ఈనెల 15న భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగనుంది. 16న సౌతాఫ్రికా-ఆస్ట్రేలియా మధ్య జరుగనుంది.
Revanth Reddy: ఎన్నికలు మొదలైనప్పటి నుండి బీఆర్ఎస్ డ్రామాలకు తెర లేపింది