గువ్వల బాలరాజు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తనపై దాడి చేసిన వారి గురించి బయటపెట్టారు. తెలంగాణలో ఎన్నడూ లేని ఆనవాయితీని కాంగ్రెస్ పార్టీ తీసుకువస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మధ్యనే కొత్త ప్రభాకర్ రెడ్డి మీద దాడి చేశారు.. నిన్న నామీద దాడిచేశారన్నారు. నిన్న ప్రచారం ముగించుకొని వెళ్తుండగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తన కాన్వాయ్ ని వెంబడిస్తూ అచ్చంపేట రాగానే ఆపి తన మీద దాడికి దిగారని తెలిపారు.…
హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో మంత్రి హరీశ్ రావు సమక్షంలో ఓదెల జడ్పీటీసీ రాములు యాదవ్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో ఆయనకు మంత్రి హరీశ్ బీఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ మాట్లాడారు. ఉచిత కరెంట్ను ఉత్త కరెంట్ చేసింది కాంగ్రెస్ కాదా అంటూ ఆయన ప్రశ్నించారు.
అంబర్పేట ఎమ్మెల్యే బీఆర్ఎస్ అభ్యర్థి కాలేరు వెంకటేష్.. బాగ్ అంబర్పేట డివిజన్లోని తురాభ్ నగర్, ఎరుకల బస్తీలో ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా.. డివిజన్ ప్రెసిడెంట్ చంద్రమోహన్, మహిళా నాయకులు, ముఖ్య నేతలు, కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచార పాదయాత్ర నిర్వహించారు. ఈ ప్రచారంలో బస్తీ వాసులు కాలేరు వెంకటేష్ కు గులాబీ పూలతో పూలవర్షం కురిపిస్తూ స్వాగతం పలికారు.
నంద్యాల జిల్లా నూనెపల్లె వద్ద రైలు కిందపడి బాల నరసింహులు అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. బాల నరసింహులు స్వగ్రామం గోస్పాడు మండలంలోని చింతకుంట గ్రామం. ఏడాది క్రితం ఓ యువతీని వేధించాడని బాల నరసింహులుపై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదైంది.
కాంగ్రెస్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డి పేరు కాస్త రేటెంత రెడ్డి అని పిలిచే కాడికి వచ్చిందని విమర్శించారు. బీఆర్ఎస్ పై అహంకారంతో, బలుపెక్కి మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. అంతేకాకుండా.. రాజకీయాలను కలుషితం చేసిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని వ్యాఖ్యానించారు.
మెదక్ జిల్లాలో పండగ పూట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. జిల్లా కేంద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇద్దరు పిల్లలతో స్కూటీపై వెళ్తున్న తల్లిని టిప్పర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఇద్దరు కుమారులు మృతి చెందారు. తల్లి స్వల్ప గాయాలతో బయటపడింది.
తెలంగాణలో ఎన్నికల జోరు పెరిగింది. ఆయా పార్టీలు ప్రజలును ఆకర్షించేందుకు వారి పార్టీలు ప్రకటించిన మేనిఫేస్టోతో పాటు.. మరిన్ని వరాలు గుప్పిస్తున్నారు. అయితే.. ఈ నేపథ్యంలోనే ప్రచారం నిర్వహించిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. breaking news, latest news, telugu news, ponguleti srinivas reddy, congress
కరీంనగర్ నగరంలో బీజేపీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని బీజేపీ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ర్యాలీని ఉద్దేశించి బండి సంజయ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీజేపీని గెలిపించాలని ధర్మం కోసం దేశం కోసం breaking news, latest news, telugu news, big news, bandi sanjay
దీపావళి టపాసులు అమ్మకాలు రాజమండ్రిలో జోరుగా సాగుతున్నాయి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కొనుగోలుదారులతో బాణాసంచా దుకాణాలు కలకలాడుతున్నాయి గత ఏడాది కంటే ఈ ఏడాది 20% అధికంగా ధరలు పెరుగుతున్నప్పటికీ అమ్మకాలు మాత్రం Diwali crackers full sale, breaking news, latest news, telugu news, diwali crackers, big news,