టీమిండియా ఈ వరల్డ్ కప్ లో విజయాల పరంపర కొనసాగిస్తుంది. ఇప్పటివరకు ఆడిన లీగ్ మ్యాచ్ ల్లో అన్నింటిలోనూ గెలిచింది. ఈరోజు జరిగిన టోర్నీ చివరి లీగ్ మ్యాచ్ లో నెదర్లాండ్స్ ను 160 పరుగుల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్ లోనూ భారత్ ఫైనల్ టచ్ ఇచ్చి.. విక్టరీ సాధించింది. ఈ మ్యాచ్ లో హైలెట్ ఏంటంటే.. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ బౌలింగ్ వేసి తలో వికెట్ తీశారు. ఫ్యాన్స్ వీరిద్దరు బౌలింగ్ చేయాలన్న…
దీపావళి పండుగ వేళ కోనసీమలో అపశృతి చోటుచేసుకుంది. అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం ఆవిడి కట్లమ్మ అమ్మవారి ఆలయం వద్ద పూరింటిపై తారాజువ్వ పడి అగ్ని ప్రమాదం సంభవించింది.
సీఎం కేసీఆర్ రెండో విడత ఎన్నికల ప్రచారం రేపటి నుంచి ప్రారంభం కానుంది. మూడు రోజుల బ్రేక్ తర్వాత మళ్ళీ కేసీఅర్ ఎన్నికల ప్రచారం స్టార్ట్ కానుంది. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలకు హాజరై.. అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. నవంబర్ 9న నామినేషన్లు వేసి కామారెడ్డిలో సభతో ఆ విడత షెడ్యూల్ పూర్తి చేశారు. తాజాగా మళ్లీ రేపటి నుంచి ప్రచారానికి రెడీ కానున్నారు.
ఈరోజు దీపావళి ముహూర్తం ట్రేడింగ్ సందర్భంగా స్టాక్ మార్కెట్లో అద్భుతమైన ప్రారంభం కనిపించింది. సెన్సెక్స్ 500 పాయింట్లకు పైగా లాభంతో ప్రారంభమైంది. ఆ తర్వాత బీఎస్ఈ ప్రధాన సూచీ 65,418.98 పాయింట్లకు చేరుకుంది. దీని వల్ల ఇన్వెస్టర్లు రూ. 3 లక్షల కోట్లకు పైగా ఆర్జించారు. అయితే మార్కెట్ ప్రారంభమైన 6 నిమిషాల్లోనే 345.26 పాయింట్ల లాభంతో 65,235.78 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. బీఎస్ఈలో టాప్ 30 షేర్లు గ్రీన్ మార్క్‌లో ట్రేడవుతున్నాయి.
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో భారత్-నెదర్లాండ్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో ముందుగా బౌలింగ్ చేసిన భారత్ 410 పరుగులు చేసింది. ఈ క్రమంలో లక్ష్యాన్ని ఛేదించేందుకు నెదర్లాండ్స్ బరిలోకి దిగింది. అయితే స్టేడియంలో ఉన్న ఫ్యాన్స్ ఉన్నట్టుండి.. కోహ్లీ, రోహిత్ శర్మ బౌలింగ్ చేయాలని కోరారు.
దేశం మొత్తం దీపావళి సంబరాలు ఘనంగా జరుపుకుంటుంది. అందులో భాగంగానే దీపావళి సంబరాలను టీమిండియా ఆటగాళ్లు కూడా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈరోజు జరిగే నెదర్లాండ్స్ తో మ్యాచ్ కు ముందే బెంగళూరులోని ఐటీసీ గార్డెనియా హోటల్ లో జరుపుకున్నారు. ఈ వేడుకలో టీమిండియా సభ్యులతో పాటు, వారి కుటుంబ సభ్యులు కూడా పాల్గొని ఆనందంగా గడిపారు. సాంప్రదాయ దుస్తులు ధరించి వారి ఫ్యామిలీలతో హాజరయ్యారు. టీమిండియా దివాళీ సెలబ్రేషన్ వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో…