ఈనెల 6 నుంచి అడిలైడ్‌లో పింక్ బాల్ టెస్ట్ మొదలు కానుంది. తొలి టెస్టులో గెలిచిన టీమిండియా.. ఈ టెస్టులోనూ విక్టరీ సాధించాలని చూస్తోంది. అయితే.. ఈ టెస్ట్ మ్యాచ్‌కు ముందు టీమిండియాకు షాక్ తగిలింది. స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ మోకాలికి గాయమైంది.
దీర్ఘకాల నొప్పి, ఎముకల సమస్యలు చలికాలంలో ఎక్కువగా వస్తుంటాయి. చలి కాలంలో ఎండలో తక్కువగా గడుపుతాం. ఈ క్రమంలో.. శీతాకాలంలో విటమిన్ డి లోపం సర్వసాధారణం అవుతుంది. శరీరంలో విటమిన్ డి సరఫరా చేయడానికి సూర్యకాంతి చాలా అవసరం.
గత కొన్ని సంవత్సరాలుగా భారతీయ కస్టమర్లలో ఎలక్ట్రిక్ కార్ల (EV) డిమాండ్ పెరుగుతూనే ఉంది. ఈ క్రమంలో.. ప్రముఖ కార్ల తయారీ సంస్థ JSW MG మోటార్ ఇండియా.. కొత్త ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారును మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సన్నద్ధం అవుతుంది. 2025లో ఈ కారు విడుదల కానుంది. ఈ కారు లాంచ్‌కు సంబంధించి.. కంపెనీ సమాచారం ఇచ్చింది. 2025 జనవరిలో ఇండియాలో MG సైబర్‌స్టర్‌ను ప్రారంభించనుంది.
అబుదాబి T10 లీగ్ ఫైనల్ మ్యాచ్ మోరిస్విల్లే సాంప్ ఆర్మీ-డెక్కన్ గ్లాడియేటర్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో 2 వికెట్లు కోల్పోయి డెక్కన్ గ్లాడియేటర్స్ విజయం సాధించింది. డెక్కన్ గ్లాడియేటర్స్ జట్టు 6.5 ఓవర్లలో 105 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో.. డెక్కన్ గ్లాడియేటర్స్ విజయం సాధించి చరిత్ర సృష్టించింది. అబుదాబి టీ-10 లీగ్ టైటిల్‌ను మూడోసారి గెలుచుకున్న తొలి జట్టుగా నిలిచింది.
గుజరాత్ బ్యాట్స్‌మెన్ ఉర్విల్ పటేల్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీలో వారం వ్యవధిలోనే మరో సెంచరీ సాధించాడు. మంగళవారం ఉత్తరాఖండ్‌పై కేవలం 36 బంతుల్లోనే శతకం బాదాడు. ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో పటేల్ 41 బంతుల్లో అజేయంగా 115 పరుగులు చేశాడు.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పలు కీలక అంశాలకు ఆమోదం లభించింది. జలవనరుల శాఖలో జీవో 62 అమలుపై కేబినెట్లో చర్చ జరిగింది. గిరిజన ప్రాంతాల్లో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గిరిజన గృహ పథకం అమలుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
అన్నమయ్య జిల్లా రాయచోటి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో క్వశ్చన్ పేపర్ లీక్ కలకలం సృష్టించింది. పరీక్ష ప్రారంభం కాకముందే సంస్కృతం క్వశ్చన్ పేపర్ వాట్సాప్‌లో హల్చల్ చేసింది. వర్షం కారణంగా నిన్న జరగాల్సిన పరీక్షలను రద్దు చేసి వైవీ యూనివర్సిటీ అధికారులు నేడు నిర్వహిస్తున్నారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తనిఖీల తర్వాత అధికార యంత్రాంగం కదిలింది. కాకినాడ పోర్టులో స్టెల్లా షిప్‌ను అధికార యంత్రాంగం సీజ్ చేసింది. ఐదు శాఖల అధికారులతో కలిపి మల్టీ డిసిప్లినరీ కమిటీని జిల్లా కలెక్టర్ షన్మోహన్ ఏర్పాటు చేశారు.
ఇటీవల కాలంలో చిన్న చిన్న విషయాలకే పిల్లలు మనస్తాపానికి గురవుతున్నారు. తల్లిదండ్రులు ఏదో అన్నారని బాధతో కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. కన్నవారికి కడుపుకోతను మిగిల్చి కానరాని లోకాలకు వెళ్లిపోతున్నారు. తాజాగా అలాంటి విషాద ఘటన కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం లక్ష్మీనగరంలో చోటుచేసుకుంది.
ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం దేవస్థానం ఈవో కీలక నిర్ణయం తీసుకున్నారు. రద్దీ రోజుల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ సెలవులు, శని, ఆది, సోమ వారాల్లో అలంకార దర్శనం మాత్రమేనని ఆయన వెల్లడించారు.