బెంగళూరులో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తున్న 26 ఏళ్ల మహిళపై తన స్నేహితుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అంతేకాకుండా.. తనకు మత్తు మందు ఇచ్చి.. అత్యాచారం చేసిన ప్రైవేట్ వీడియోలతో బ్లాక్ మెయిల్ చేస్తుున్నాడని బాధితురాలు సోమవారం పోలీసులకు తెలిపింది. కులపరమైన దూషణలతో తనను కించపరిచారని ఆమె ఆరోపించింది. బాధిత యువతి శుక్రవారం హైగ్రౌండ్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆమె వాంగ్మూలం ఆధారంగా నిందితుడిపై అత్యాచారం, లైంగిక వేధింపులు, క్రిమినల్ బెదిరింపులు, మహిళ పట్ల అసభ్యతను కించపరిచే సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
Read Also: Manchu Manoj: మనోజ్ కోసం మోహన్ బాబు నివాసానికి ఆళ్లగడ్డ బ్యాచ్?
బాధితురాలు ఫిర్యాదు ప్రకారం.. 2019లో క్రెడిట్ కార్డ్ కంపెనీలో పనిచేస్తున్నప్పుడు నిందితుడిని కలిశానని ఆ మహిళ పేర్కొంది. ఆ తర్వాత తమ మధ్య స్నేహం బలమవ్వడంతో నిందితుడు ఆమెను ఒక ఫంక్షన్‌కు ఆహ్వానించాడు. అక్కడ అతను యువతికి మత్తుమందు కలిపిన పానీయం ఇచ్చాడు. పానీయం తాగిన తర్వాత బాధితురాలు అపస్మారక స్థితికి చేరుకుంది. ఈ క్రమంలో యువతిని ఒక గదికి తీసుకెళ్లి లైంగికంగా వేధించి ఆ చర్యను రికార్డ్ చేశాడని బాధిత యువతి పేర్కొంది.
Read Also: Noida Airport: జెవార్ ఎయిర్‌పోర్టులో తొలి విమానం ల్యాండింగ్.. త్వరలో పూర్తి సేవలు
లైంగిక ప్రయోజనాల కోసం తనను బ్లాక్ మెయిల్ చేసేందుకు అతడు వీడియోను ఉపయోగిస్తున్నాడని ఆమె ఆరోపించింది. నిందితుడి వేధింపుల నుండి తప్పించుకోవడానికి ఆమె ఉద్యోగం కూడా మానేసింది. అయితే.. తన కోరికలకు ఆమె అంగీకరించకపోతే వీడియోను పబ్లిక్ చేస్తానని ఆమెను బెదిరిస్తూనే ఉన్నాడని బాధితురాలు పోలీసులకు తెలిపింది. తన డిమాండ్‌లను ఒప్పుకోకపోతే.. అతను తనను కుల దురభిమానాలతో అవమానించేవాడని పేర్కొంది. అంతేకాకుండా.. తనను పెళ్లి చేసుకోవాలని అడిగాడని మహిళ ఆరోపించింది. కాగా.. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనలో నిందితుడిని పోలీసులు ఇంకా అరెస్టు చేయలేదు.