ఆ తల్లికి ఏం కష్టమొచ్చిందో ఏమో తెలియదు గాని అప్పుడే పుట్టిన బిడ్డను చెత్తకుప్పల్లో పడేసి వెళ్ళిపోయింది. కనీస మానవత్వంతో ఆలోచించని ఆ తల్లి ప్రేగు తెంచుకొని పుట్టిన బిడ్డను చెత్తలో పడేసింది. మరో విధంగా ఆలోచిస్తే అమ్మ జాతికి మాయని మచ్చ తెచ్చే ఘటన విజయవాడలో వెలుగులోకి వచ్చింది.
విశాఖలోని గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలో అక్కిరెడ్డిపాలెంలో ఓ జంట ఆత్మహత్య చేసుకుంది. వెంకటేశ్వర కాలనీలో అపార్ట్మెంట్ పైనుంచి దూకి జంట ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా చెప్తున్నారు. మృతులు పిల్లి దుర్గారావు, సాయి సుష్మితలుగా గుర్తించారు.
మాజీ డిప్యూటీ సీఎం, ఏలూరు మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని టీడీపీలో చేరేందుకు లైన్ క్లియర్ అయ్యింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కీలకంగా వ్యవహరించిన ఆళ్ల నాని మూడు నెలల క్రితమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. అప్పటినుంచి ఎవరికీ అందుబాటులో లేని ఆళ్ల నాని టీడీపీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.
ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల చిన్న వెంకన్న ఆలయ పరిసరాలలో డ్రోన్ ఎగరవేసిన యూట్యూబర్‌పై కేసు నమోదైంది. ఇటీవల ఓ యూట్యూబర్ చిన్న వెంకన్న ఆలయ పరిసరాలను డ్రోన్ కెమెరాలో చిత్రీకరించారు. వీడియోలను తన యూట్యూబ్ ఛానల్, సోషల్ మీడియాలో యూట్యూబర్ పోస్ట్ చేశాడు.
ఇవాళ ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఉదయం 11 గంటలకు జరగనుంది. ఏపీ సచివాలయంలో ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. ఏపీ సీఆర్డీఏ అథారిటీ ఆమోదించిన 23 అంశాలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది.
పసుపులో ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. పసుపు సహజ యాంటీబయాటిక్.. ఇది గాయాలను నయం చేయడంలో, సంక్రమణను నివారించడంలో సహాయపడుతుంది. పసుపులో ఉండే యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు మంటను తగ్గించడంలో సహాయపడతాయి.
వెస్టిండీస్ క్రికెట్ జట్టు ప్రస్తుతం బంగ్లాదేశ్‌కు ఆతిథ్యం ఇస్తోంది. కింగ్‌స్టన్‌లో ఇరు జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ జరుగుతుంది. ఈ క్రమంలో ఈరోజు రెండో రోజు మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ బౌలర్ చరిత్ర సృష్టించాడు. వెస్టిండీస్ బౌలర్ జాడెన్ సీల్స్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. బంగ్లాదేశ్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 164 పరుగులకు ఆలౌట్ చేయడంలో సీల్స్ కీలక పాత్ర పోషించాడు. అతను 15.5 ఓవర్లు బౌలింగ్ చేయగా.. అందులో 10 మెయిడిన్ ఓవర్లు…
కొబ్బరి నీరు ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. కొబ్బరి నీరు శరీరాన్ని హైడ్రేట్ చేయడానికి.. అనేక వ్యాధుల నుండి రక్షించడానికి సహాయపడుతుంది. కొబ్బరి నీళ్లలో ఎలక్ట్రోలైట్స్, హైడ్రేషన్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి చాలా మేలు చేస్తాయి. అయితే.. చలికాలంలో కొబ్బరినీళ్లు తాగడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని కొందరు అనుకుంటారు. కానీ కొబ్బరి నీళ్ల వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
జీలకర్రను వంటకాల్లో ఎక్కువగా వాడుతాం. ఇది వంటకాల్లో రుచిని అందిస్తుంది. అంతేకాకుండా.. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. జీలకర్రతో తయారు చేసిన నీరు తాగితే బరువు తగ్గుతారు. జీలకర్రలో అనేక గుణాలు ఉంటాయి. ఇవి శరీర జీవక్రియను పెంచి.. జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. ఈ క్రమంలో బరువు తగ్గడంలో సహాయపడతాయి.
రిషబ్ పంత్, నికోలస్ పురాన్‌లలో లక్నో జట్టు తదుపరి కెప్టెన్‌గా ఎవరు ఉండాలనే దానిపై జట్టు యజమాని సంజీవ్ గోయెంకా తన అభిప్రాయాన్ని తెలిపారు. లక్నో సూపర్ జెయింట్స్ యజమాని సంజీవ్ గోయెంకా.. 2025 ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్‌కు కెప్టెన్‌ని మరికొద్ది రోజుల్లో ప్రకటించనున్నట్లు వెల్లడించారు.