Allu Arjun: “ఇండియన్ సినిమా షేక్.. అల్లు అర్జున్ – అట్లీ ‘మెగా మేగ్నమ్ ఓపస్’!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో రాబోతున్న భారీ ప్రాజెక్ట్ (AA22/A6) ప్రస్తుతం ఇండియన్ సినీ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. కేవలం ఒక సినిమాగా మాత్రమే కాకుండా, ఒక సరికొత్త దృశ్య కావ్యంగా ఈ సినిమాను అట్లీ తీర్చిదిద్దుతున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన విశేషాలు ఇప్పుడు సినీ ప్రియుల్లో అంచనాలను ఆకాశానికి తీసుకెళ్తున్నాయి. సాధారణంగా అట్లీ సినిమాలు అంటే భారీ యాక్షన్, గుండెకు హత్తుకునే ఎమోషన్స్ సహా గ్రాండ్ విజువల్స్ ఉంటాయి. అయితే ఈసారి అల్లు అర్జున్ కోసం అట్లీ ఒక సైన్స్ ఫిక్షన్ (Sci-Fi) యాక్షన్ కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ‘ప్యారలల్ యూనివర్స్’ అనే కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ సినిమా ఇండియా స్క్రీన్ పై ఒక కొత్త ప్రయోగానికి నాంది పలకనుంది.
Also Read:Himaja : నా క్యారెక్టర్‌పై కామెంట్స్ ఆపండి.. మా పేరెంట్స్ వింటే తట్టుకోలేరు – హిమజ
Also Read
- Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
- Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
- Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
- Hanuman Ansh: ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘హనుమాన్ అంశ్’ వచ్చేస్తోంది.. తెలుగు రిలీజ్ ఎప్పుడంటే?
అల్లు అర్జున్ ఈ సినిమాలో ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా నాలుగు విభిన్న పాత్రలలో (తాత, తండ్రి మరియు ఇద్దరు కొడుకులుగా) కనిపిస్తారని సమాచారం. ఇది బన్నీ కెరీర్‌లోనే అతిపెద్ద సవాల్‌గా నిలవనుంది.ఒక పాత్రను పూర్తిస్థాయి యానిమేటెడ్ రూపంలో తీర్చిదిద్దబోతున్నారని, ఇది ఇండియన్ సినిమాలో ఇప్పటివరకు ఎవరూ చేయని సాహసమని టాక్. అంతేకాక విజువల్ ఎఫెక్ట్స్ కోసం ఈ చిత్ర బృందం ఇప్పటికే లాస్ ఏంజిల్స్‌లోని టాప్ VFX స్టూడియోలను సందర్శించింది. ‘అవతార్’ తరహా విజువల్ ఎక్స్‌పీరియన్స్‌ను ప్రేక్షకులకు అందించడమే అట్లీ లక్ష్యం అని అంటున్నారు.
Also Read:The Paradise : నాని ‘ప్యారడైజ్’ ఫస్ట్ లిరికల్ ‘ఆయా షేర్’ ప్రోమో రిలీజ్
ఇక ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పడుకోణ్ హీరోయిన్ గా నటిస్తుండగా, రష్మికా మందన్న మొదటిసారి నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వీరితో పాటు మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ వంటి స్టార్ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ అత్యంత భారీ వ్యయంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అల్లు అర్జున్ ఈ సినిమా కోసం భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం, ఇది ఇండియన్ సినీ చరిత్రలో ఒక రికార్డు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం 2027లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
తాజావార్తలు
-
ECIL Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఫీజు, ఎగ్జామ్ లేకుండానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం! వెంటనే అప్లై చేసుకోండి..
-
USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
-
Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
-
Vaishnavi Wushu : జాతీయ ఉషుకు తెలంగాణ విద్యార్థిని.. వైష్ణవికి కమిషనర్ అభినందనలు.!
-
Teacher Posts: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. స్కూల్ అసిస్టెంట్లు, హెచ్ఎం పోస్టుల కేడర్ ఫిక్స్.
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!