ఉత్తరప్రదేశ్ లోని ఝాన్సీలో జరిగిన ఎన్ కౌంటర్ లో క్రిమినల్ రషీద్ కాలియాను హతమార్చారు. ఓ కాంట్రాక్టర్ ను చంపేందుకు వచ్చిన సమయంలో యూపీ ఎస్టీఎఫ్ బలగాలు దాడి చేశారు. ఘటనా స్థలంలో అతని వద్ద నుంచి రెండు పిస్టల్స్, ఓ బైక్ ను స్వాధీనం చేసుకున్నారు. తీవ్రగాయాలైన రషీద్ కాలియాను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతను చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు విలువను వివరించేందుకు విజయవాడలో జరిగిన యువ ఓటర్ చైతన్య వేదిక కార్యక్రమానికి సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉత్తమ కాలేజీ పీఎస్సీఎంఆర్ కాలేజ్.. అందుకే ఇక్కడి నుండే ఈ పోగ్రాం మెదలుపెట్టానని జేడీ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు.
తెలంగాణలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆయా పార్టీలు ప్రచారంలో స్పీడ్ పెంచాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో బీజేపీని అధికారంలో తీసుకువచ్చేందుకు కాషాయనాథులు కష్టపడుతున్నారు. breaking news, latest news, telugu news, big news, amit shah, telangana elections 2023
భారత వైమానిక దళానికి చెందిన గరుడ్ కమాండో సూసైడ్ చేసుకున్నాడు. తన సర్వీస్ పిస్టల్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గుజరాత్‌లోని కచ్ జిల్లా భుజ్ సమీపంలోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో ఆయన విధులు నిర్వహిస్తున్నాడు. ఈ ఘటనపై పోలీసులు సమాచారం అందించారు. నవంబర్ 16న తెల్లవారుజామున ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు.
ఈ వరల్డ్ కప్ లో సెమీ ఫైనల్స్ మ్యాచ్ లకు, ఫైనల్ మ్యాచ్ కు వాతావరణ మార్పుల వల్ల మ్యాచ్ జరగని పరిస్థితి ఏర్పడితే రిజర్వ్ డే ఉంటుందని ఐసీసీ ప్రకటించింది. ఒకవేళ రేపు అహ్మదాబాద్ లో వర్షం పడి మ్యాచ్ జరగకుండ ఉంటే.. మ్యాచ్ ను తర్వాత రోజుకు కేటాయించనున్నారు. ఆరోజు కూడా.. మ్యాచ్ జరగడం సాధ్యం కాకపోతే ఇరు జట్లను సంయుక్తంగా విజేతలుగా ప్రకటిస్తారు.
పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో జరిగిన సామాజిక సాధికార బస్సు యాత్ర బహిరంగ సభకు మంత్రులు జోగి రమేష్, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, మేరుగ నాగార్జున, కారుమూరి నాగేశ్వరరావు, ఎంపీలు నందిగాం సురేష్, సినీ నటుడు ఆలీ, శాసన మండలి చైర్మన్ కోయ్యే మోషెన్ రాజు, తదితరులు పాల్గొన్నారు.
ఫైనల్ మ్యాచ్ కోసం టీమిండియాలో మార్పులు చోటుచేసుకుంటున్నట్లు సమాచారం. ఒక మార్పుతో రంగంలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. పేసర్ మహ్మద్ సిరాజ్ స్ధానంలో వెటరన్ రవిచంద్రన్ అశ్విన్‌కు అవకాశమివ్వాలని టీమిండియా మెనెజ్‌మెంట్ భావిస్తున్నట్లు సమాచారం.