తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ మేనిఫెస్టోను అమిత్ షా విడుదల చేశారు. సకల జనుల సౌభాగ్య తెలంగాణ పేరిట మేనిఫెస్టోను విడుదల చేశారు. మన మోడీ గ్యారెంటీ.. బీజేపీ భరోసా ట్యాగ్ లైన్ తో మేనిఫెస్టోను అమిత్ షా వివరించారు. breaking news, latest news, telugu news, amit shah, bjp manifesto.
విశాఖపట్నంలో జరిగిన వైఎస్సార్సీపీ సామాజిక సాధికార బస్సు యాత్రలో మంత్రి సీదిరి అప్పలరాజు, మాజీ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ పాల్గొన్నారు. దశాబ్దాలుగా బడుగు బలహీనర్గాల వారు సంక్షేమం, అభివృద్ధికి దూరంగా ఉన్నారని మంత్రి సీదిరి అప్పలరాజు చెప్పారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలు మైనార్టీలను టీడీపీ కూరలో కరివేపాకులా వాడిందని ఆయన మండిపడ్డారు.
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఇండియా-ఆస్ట్రేలియా ఫైనల్లో తలపడనున్నాయి. ఈ క్రమంలో ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ ఇయాన్ మోర్గాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఫైనల్ లో భారత్ నిర్దేశించిన పరుగులను ఛేదించే సామర్థ్యం ఆస్ట్రేలియాకు ఉందని ఇయాన్ మోర్గాన్ తెలిపాడు. అంతేకాకుండా.. ఆస్ట్రేలియా జట్టు ఆరో వన్డే ప్రపంచకప్ టైటిల్‌ను కైవసం చేసుకోవాలని చూస్తోందని పేర్కొన్నాడు.
నంద్యాల జిల్లా బనగానపల్లెలో నాపరాతి గనుల యజమానులతో ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి, కలెక్టర్ మున్జీర్ సామూన్ జిలానీ, ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డిలు పాల్గొన్నారు.
రోహిత్ శర్మ మీడియాతో మాట్లాడుతుండగా.. మధ్యలో ఓ వ్యక్తి ఫోన్ రింగ్ అయింది. దీనిపై రోహిత్ శర్మ కోపంగా.. "ఏంటీ, ఫోన్ ఆఫ్ చెయ్యి మ్యాన్" అని అన్నాడు. ఆ తర్వాత పిచ్ పరిస్థితి గురించి మాట్లాడు. ఇంతకుముందు కూడా.. రోహిత్ శర్మ తన ఫన్నీ స్టైల్స్, కామెంట్స్ తో చాలా సార్లు వైరల్ అయ్యాడు.
బీసీలను నిర్లక్ష్యం చేస్తూ, వారికి అన్యాయం చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పతనం తప్పదని వివిధ పార్టీలకు చెందిన బీసీ నాయకులు వ్యాఖ్యానించారు. రాజమండ్రి ఆనంద్ రీజెన్సీ పందిరి హాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ నాయకుల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని కొన్ని ప్రాంతాల్లో శనివారం భారీ వర్షం కురిసింది. దీంతో అక్కడి జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భారీ వర్షం దాటికి రోడ్లు చెరువులను తలపించాయి. రోడ్లపై భారీగా నీరు చేరడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
తూర్పు గోదావరి జిల్లా పరిసర ప్రాంతాల్లో బ్యాంకుల వద్ద అమాయక మహిళలను టార్గెట్ చేస్తూ పలు మోసాలకు పాల్పడుతున్న నిందితుడిని పోలీసులు గుర్తించి పట్టుకున్నారు.
భారత్-ఆస్ట్రేలియా మధ్య జరగనున్న వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్‌కు ముందు.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మీడియా కాన్ఫరెన్స్ లో కీలక విషయాలు వెల్లడించాడు. ఆస్ట్రేలియా చివరి ఎనిమిది మ్యాచ్‌లలో విజయం సాధించినందుకు తనకు ఎటువంటి ఇబ్బంది లేదని రోహిత్ శర్మ చెప్పాడు. అంతేకాకుండా.. ఈ ప్రపంచకప్ కోసం రెండేళ్ల కిందటే సన్నాహాలు ప్రారంభించినట్లు తెలిపాడు.