Amit Shah : మిషన్ కాకతీయలో 22వేల కోట్ల కుంభకోణం జరిగింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆయా పార్టీలు ప్రచారంలో స్పీడ్ పెంచాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో బీజేపీని అధికారంలో తీసుకువచ్చేందుకు కాషాయనాథులు కష్టపడుతున్నారు. ఈ సందర్భంగా నేడు వరంగల్ లో బీజేపీ నిర్వహించిన బహిరంగ సభలో అమిత్ షా పాల్గొని మాట్లాడుతూ.. సర్వసంపన్న తెలంగాణ కేసీఆర్ అవినీతితో అప్పుల కుప్పగా మార్చారని విమర్శించారు. అవినీతి అడ్డగా మారారని, బీఆర్ఎస్ అంటే భారత్ బ్రాస్టాచార్ సమితి అని ఆయన విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అతిపెద్ద కుంభకోణం చేశారని, మద్యాన్ని ఏరులై పారిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. మిషన్ కాకతీయలో 22వేల కోట్ల కుంభకోణం జరిగిందని, కేసీఆర్ కుంభకోణాలు లెక్కబెట్టాలంటే వారం రోజులు పడుతుందన్నారు అమిత్ షా.
అంతేకాకుండా.. ‘రాజ్యాంగ విరుద్ధంగా 4శాతం ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తున్నారు… వాటిని రద్దు చేస్తాం. భద్రాచలం రాముడికి సీఎం హోదాలో కేసీఆర్ పట్టు వస్త్రాలు సమర్పించకుండా అవమానపరిచారు. కేసీఆర్ అవినీతిని కక్కిస్తాం. ఎంజీఎంలో ఎలుకలు కొరికి వ్యక్తి చనిపోయాడు. బీజేపీని గెలిపిస్తే ఎంజీఎం అభివృద్ధి కోసం వెయ్యికోట్ల రూపాయలు కేటాయిస్తాం. అయోద్యలో రాముడి దర్శనం కావాలంటే బీజేపీకి ఓటు వేయాలి. మిలుగు రాష్ట్రంగా ఏర్పాటు అయిన తెలంగాణ అప్పులపాలైంది. మిషన్ కాకతీయతో పాటు మియాపూర్ భూమి వేలంతో పాటు కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భారీ కుంభకోణం నెలకుంది. మిషన్ కాకతీయ పేరుతో 22 వేల కోట్ల కుంభకోణం జరిగింది. తెలంగాణ పాలన కుంభకోణంలో మునిగింది. తెలంగాణ విమోచన దినోత్సవంను జరపడం లేదు. తెలంగాణ రాష్ట్రం అధికారంలోకి రాగానే 17సెప్టెంబర్ అధికారికంగా జరుపుతాం. ఓవైసీ ఒత్తిడి లొంగి కేసీఆర్ కేటాయించిన 4శాతం రిజర్వేషన్ తొలగిస్తాం. సీతారాములు కల్యాణం పట్టువస్ర్తాలను సమిర్పించని నాయకుడు అవసరం లేదు.
Also Read
- Punjab: అమృత్‌సర్‌లో దారుణం.. డ్యూటీలో ఉన్న ఏఎస్సైను కాల్చి చంపిన దుండగులు
- Heart Attack: డోన్‌లో విషాదం.. వినాయక ఊరేగింపులో పాల్గొన్న యువకుడు మృతి..
- Abhishek Sharma: కోహ్లీ, రోహిత్ కాదు.. ‘అభిషేక్ శర్మను కిడ్నాప్ చేస్తా’.. ఆఫ్ఘనిస్థాన్ ఫ్యాన్ షాకింగ్ కామెంట్..
- Andhra Pradesh: స్థానిక ఎన్నికలకు ముందు కీలక పరిణామం.. జెడ్పీ, ఎంపీపీలకు ప్రత్యేక అధికారులు..
కేసీఆర్ కారు స్టీరింగ్ ఓవైసీ చేతిలో ఉంది. పేపర్ లిక్ తో నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు. తెలంగాణలో అధికారంలోకి రాగానే 5 సంవత్సరాల్లో 2లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం. మియాపూర్ భూమి కుంభకోణం 4వేల కోట్ల కుంభకోణం జరిగింది. తెలంగాణలో భాజపా అధికారంలోకి రాగానే అక్రమంగా సంపాదించిన సొమ్ము తీసుకుంటాం. రాహుల్ బాబా 10సంవత్సరాలు అధికారంలో ఉండి తెలంగాణకు ఏం చేశారు. కేంద్రంలో మోదీ తెలంగాణ రెండున్నర లక్షల కోట్ల ఇచ్చింది. 9 సంవత్సరాల లో ఎంజిఎం ఆసుపత్రిని పట్టించుకున్నదే లేదు. ఎంజీఎం ఆస్పత్రిలో ఎలుక కొరికి చిన్నారి మృతి చెందిన ఘటన కలిసివేసింది. అయోధ్యలో రామాలయం నిర్మాణం కు కాంగ్రెస్ అడ్డుపడింది. బీజేపీ అభ్యర్థులను తెలంగాణలో గెలిపించండి.’ అని అమిత్ షా వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Explainers: భూమి గుండెల్లో దాగిన నీటి రహస్యం.. ఏకంగా 660 కిలోమీటర్ల లోతులో..
-
మార్కులు, డిగ్రీలకు మించి: ‘హ్యూమన్ స్కిల్ పాస్‌పోర్ట్’ను పరిచయం చేస్తున్న HIPSA & Power Sportz
-
Punjab: అమృత్‌సర్‌లో దారుణం.. డ్యూటీలో ఉన్న ఏఎస్సైను కాల్చి చంపిన దుండగులు
-
Heart Attack: డోన్‌లో విషాదం.. వినాయక ఊరేగింపులో పాల్గొన్న యువకుడు మృతి..
-
America vs Iran: అమెరికా యుద్ధ నేరాలకు సాక్ష్యాలు.. పిల్లలను కూడా వ*దలలేదు..!
ట్రెండింగ్
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!