సిద్దిపేట జిల్లా చేర్యాలలో నిర్వహించిన బీఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో బీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ఎన్నికలు వస్తే అన్ని అబద్ధాలు, అబండాలు, బట్ట కాల్చి మీద వేసుడు చూస్తున్నామన్నారు. అమెరికాలో ఇలా ఎన్నికల మీటింగ్ లు ఉండవని, ఎన్నికలు వస్తే నిలబడ్డ అభ్యర్థి గుణం, బలం అన్ని చూడాలన్నారు. దీనికంటే ముఖ్యంగా నిలబడ్డ అభ్యర్థి పార్టీ గురించి తెలుసుకోవాలన్నారు సీఎం కేసీఆర్. మన ఓటు మనకే వజ్రాయుధం.. ఎవడో మనకు చెప్పిండని ఓటు వేయొద్దన్నారు సీఎం కేసీఆర్. బీఆర్‌ఎస్ పార్టీ చరిత్ర మీ కళ్ళ ముందే ఉందని, తెలంగాణ సాధన కోసం బీఆర్‌ఎస్ పార్టీ పుట్టిందన్నారు కేసీఆర్. 50 ఏళ్ళు పాలించిన కాంగ్రెస్ ఎం చేసింది..పదేళ్ల తెలంగాణలో బీఆర్‌ఎస్ చేసింది అనేది చర్చ జరగాలన్నారు.
అంతేకాకుండా.. ‘బీఆర్‌ఎస్ పార్టీపై అనేక కుట్రలు చేశారు. మా ఎమ్మెల్యేలను కొనాలని చూశారు. తెలంగాణ రాక ముందు తెలంగాణ వచ్చిన తర్వాత ఎలా ఉందో గమనించండి. తెలంగాణ కోసం ఆనాడు పోరాడేటోడు ఎవ్వడు లేడు. ఈ రోజు ఎవడేవడో వచ్చి ఏదేదో మాట్లాడుతున్నాడు. ఎవడో జనగామ వచ్చి ఒర్రిపోయిండట. పిచ్చి కుక్కల గురించి ఎవడు పట్టించుకోడు. రేవంత్ రెడ్డి ఆనాడు ఆంధ్రోళ్ల చెప్పులు మోశాడు. ఉద్యమ సమయంలో రైఫైల్ పట్టుకుని తిరిగాడు. అందుకే ఆయనకి రైఫీల్ రెడ్డి అని పేరు పెట్టినం. వాళ్ళ పార్టీ వాళ్లే ఆయనకి రైఫీల్ రెడ్డి అని పిలిచారు. కాంగ్రెస్ పార్టీకి సవాల్ విసిరిన సీఎం కేసీఆర్. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా 2 వేల పెన్షన్ ఇస్తే ఇక్కడే ముక్కు నేలకు రాస్తా.
ఇక్కడ 4 వేలు పెన్షన్ ఇస్తాం అంటే ఎవరు నమ్ముతారు. కాంగ్రెస్ హయాంలో ఎన్ని తిప్పలు పడ్డాం. ఇప్పుడు వచ్చి నీతులు చెబితే నమ్ముతామా. మనం కరువు కాటకలతో అల్లాడినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎటు పోయింది. రైతు బంధు వెస్ట్ అని ఉత్తమ్ అంటున్నారు. మేముంటే రైతు బంధు ఉంటుంది… మేము రాకపోతే రైతు బంధు బంద్ అవుతుంది. మూడు గంటల కరెంట్ చాలని రేవంత్ రెడ్డి అంటున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ 20 గంటల కరెంట్ ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చింది. అక్కడ 3 గంటల కరెంట్ ఇస్తున్నారట. డీకే శివకుమార్ కర్ణాటకలో 5 గంటల కరెంట్ ఇస్తున్నామని గొప్పలు చెప్పాడు. ధరణి తీసి బంగాళాఖాతంలో వేస్తామని నిన్న ఓ టీవీలో భట్టి అన్నారు.
ధరణి తీసేస్తే మీకు రైతు బంధు ఎలా వస్తుంది. ధరణి తో ఎవరికైనా సమస్య ఉంటే చూసి పరిష్కరిస్తాం. కానీ ధరణి తీసేస్తా అంటే దళారి, పైరవికారుల రాజ్యం వస్తుంది. ప్రధాని మోడీ రాష్ట్రంలో కూడా 24 గంటల కరెంట్ లేదు. దేశంలో ఎక్కడ కూడా 24 గంటల కరెంట్ ఇవ్వట్లేదు..ఒక్క తెలంగాణలో తప్ప. నాకు బావుల కాడ మీటర్లు పెట్టమని మోడీ చెప్పారు. నేను మోటారు పెట్టను అని చెప్పాను..అట్లా చెబితే 25 వేల కోట్లు ఆపారు. పాలిచ్చే బర్రెను అమ్ముకొని దున్నపోతూని కొంటారా..?. ఈ ఎలక్షన్ లో తెలంగాణలో గెలిస్తే మహారాష్ట్రకి కేసీఆర్ వస్తాడని భయం పట్టుకుంది.
మహారాష్ట్రకి వచ్చి పుంగి బజాయిస్తాడు అని వాళ్ళకి తెలుసు. చీకట్లో ఇద్దరు ఒకటయ్యారు. వీడు బలంగా ఉంటే అక్కడ వాడు బలహీనమైన అభ్యర్థి వాడు బలంగా ఉంటే వీడు బలహీనమైన అభ్యర్థి పెడుతున్నారు. కేసీఆర్ మెడ ఇక్కడే పిసికితే బయటికి పోకుండా చేయొచ్చని ప్లాన్ చేస్తున్నారు.’ అని సీఎం కేసీఆర్ అన్నారు.