నిన్న వరల్డ్ కప్ ఫైనల్లో టీమిండియా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో పాకిస్థాన్ మాజీ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిది కీలక వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా బ్యాటింగ్ చూస్తుంటే.. తగిన మూల్యం చెల్లించుకునేలా కనిపిస్తోందని అభిప్రాయపడ్డాడు. వరుసగా మ్యాచ్ లు గెలుస్తున్నప్పుడు సహజంగానే కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉంటుందని, ఇప్పుడదే టీమిండియా కొంపముంచేలా ఉందని వ్యాఖ్యానించాడు.
జగిత్యాల జిల్లా మెట్పల్లిలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. బీసీలను కాంగ్రెస్, బీఆర్ఎస్లు మోసం చేశాయి..బీజేపీ ఎస్సీల వర్గీకరణకు కట్టుబడి ఉందన్నారు. breaking news, latest news, telugu news, amit shah, telangana elections 2023
మానవుడి శరీరంలో కొలెస్ట్రాల్ పెరగడానికి కారణం జీవనశైలి, ఆహారం. కొలెస్ట్రాల్‌లో రెండు రకాలున్నాయి.. ఒకటి చెడు కొలెస్ట్రాల్, ఇంకొకటి మంచి కొలెస్ట్రాల్. అయితే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు అనేక రకాల సమస్యలు వస్తాయి. ముఖ్యంగా స్ట్రోక్, గుండె సంబంధిత సమస్యలు వస్తాయి. అందుకోసం ఆహారపు అలవాట్లపై శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. ముఖ్యంగా ఉదయాన్నే అల్పాహారం తీసుకోకపోవడం వలన చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఇంఫాల్ విమానాశ్రయం సమీపంలో గుర్తుతెలియని ఎగిరే వస్తువు కలకలం సృష్టించింది. ఆదివారం మణిపూర్‌లోని ఇంఫాల్ విమానాశ్రయానికి సమీపంలో 'అజ్ఞాత ఎగిరే వస్తువు' (UFO) కనిపించిందని సమాచారం అందుకున్న భారత వైమానిక దళం రెండు రాఫెల్ ఫైటర్ జెట్లను రంగంలోకి దించింది.
అయ్యప్పస్వామిని దర్శించుకునేందుకు శబరిమల వెళ్లే భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. శబరిమలకు 22 ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే ఏర్పాటు చేసింది.
ఈ దీపావళిని అందరూ అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. చక్కగా ముస్తాబై, రంగురంగుల బట్టలు ధరించి ఇంటిముందు పటాకులను పేల్చి ఉంటారు. ఇంకేముంది.. ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడమే. దీపావళి రోజు అందరూ టపాకాయలు పేల్చుతూ ఎంజాయ్ చేసిన వీడియోలు పోస్ట్ చేస్తే, ఓ మహిళ వెరైటీగా.. జడలో పువ్వులకు బదులుగా టపాకాయలు పెట్టుకున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
భారత ఆర్థిక వ్యవస్థలో చరిత్రాత్మక వృద్ధి నమోదైంది. మొట్టమొదటిసారిగా, భారతదేశ ఆర్థిక వ్యవస్థ 4 ట్రిలియన్ డాలర్లను దాటింది. దీనితో ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశంగా అవతరించడానికి చాలా దగ్గరగా వచ్చింది. భారతదేశం 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించడానికి ఇది ఒక పెద్ద అడుగు.