Fuel Exports: కేంద్రం సంచలన నిర్ణయం.. పెట్రోల్, డీజిల్‌పై విండ్‌ఫాల్ ట్యాక్స్ జీరో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Cuts Windfall Tax on Fuel Exports: ప్రపంచవ్యాప్తంగా ఇంధన మార్కెట్లో అనిశ్చితి కొనసాగుతున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం దేశీయ మార్కెట్లకు, ఎగుమతిదారులకు పెద్ద ఊరటనిచ్చింది. అంతర్జాతీయంగా ఎనర్జీ సంక్షోభ పరిస్థితుల్లో విధించిన విండ్‌ఫాల్ పన్ను (Windfall Tax)ను ప్రభుత్వం తగ్గించింది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ శుక్రవారం అర్థరాత్రి విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. ఈ సవరించిన కొత్త పన్ను రేట్లు శనివారం నుంచే అమల్లోకి వచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లో కరూడ్ ఆయిల్, పెట్రోల్, డీజిల్, విమాన ఇంధనం (ATF) ధరల ఆధారంగా ప్రతి 15 రోజులకు ఒకసారి ప్రభుత్వం ఈ పన్ను రేట్లను సమీక్షిస్తూ నిర్ణయాలు తీసుకుంటుంది.
ఈ కొత్త నిర్ణయం ప్రకారం విమాన ఇంధనం (ATF) ఎగుమతులపై లీటరుకు రూ. 2.5 చొప్పున పన్ను తగ్గించడంతో, ఇది రూ. 19.5కి చేరింది. డీజిల్ ఎగుమతులపై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు రూ. 24 వద్దే యథాతథంగా ఉంచినప్పటికీ, దానికి వర్తించే రోడ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెస్‌ను లీటరుకు రూ. 1.5 నుంచి సున్నాకి తగ్గించారు. అలాగే పెట్రోల్ ఎగుమతులపై ఉండే విండ్‌ఫాల్ పన్నును కూడా పూర్తిగా సున్నా చేశారు. వారం క్రితం అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఇంధన ఎగుమతి సుంకాలను పెంచిన కేంద్రం, రిఫైనింగ్ మార్జిన్లు, గ్లోబల్ ట్రెండ్స్‌ను బట్టి ఇప్పుడు ఈ సవరణలు చేసింది. అయితే ఎగుమతి పన్నుల్లో మార్పులు చేసినప్పటికీ, మన దేశంలో సాధారణ ప్రజలు వాడే పెట్రోల్, డీజిల్ ఎక్సైజ్ సుంకంలో ప్రభుత్వం ఎలాంటి మార్పూ చేయలేదు. దీంతో దేశీయ మార్కెట్లో ఇంధన ధరలు స్థిరంగానే కొనసాగుతున్నాయి. ఆగస్టు 15 నాటికి గ్లోబల్ మార్కెట్లో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ మన దేశంలో ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు పాత రేట్లలోనే ఉన్నాయి. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 102.12గా ఉండగా, ముంబైలో రూ. 111.2గా నమోదు కాగా, మెజారిటీ మెట్రో నగరాల్లో డీజిల్ ధర లీటరుకు రూ. 100 కంటే తక్కువగానే కొనసాగుతోంది.
Also Read
- Sajjala Ramakrishna Reddy: డీఎస్సీ వివాదంపై సజ్జల సంచలన ఆరోపణలు..
- Iran-Trump: ఇరాన్ ‘100’ కోడ్ జారీ.. క్యాంప్ నుంచి ఒక్కరోజు ముందే వచ్చేసిన ట్రంప్.. పశ్చిమాసియా మళ్లీ అట్టుడకనుందా?
- AP Heavy Rain Alert: భారీ నుంచి అతిభారీ వర్షాలు.. అధికారులకు హోంమంత్రి అనిత కీలక ఆదేశాలు
- Bihar: బీహార్‌లో దారుణం.. నడిరోడ్డుపై బాలికపై లైంగిక వేధింపులు.. ముగ్గురు అరెస్ట్
తాజావార్తలు
-
Sajjala Ramakrishna Reddy: డీఎస్సీ వివాదంపై సజ్జల సంచలన ఆరోపణలు..
-
Radha: 46 కోట్లు కొట్టేశారు.. సొంత అక్కపై పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన హీరోయిన్ రాధ!
-
Iran-Trump: ఇరాన్ ‘100’ కోడ్ జారీ.. క్యాంప్ నుంచి ఒక్కరోజు ముందే వచ్చేసిన ట్రంప్.. పశ్చిమాసియా మళ్లీ అట్టుడకనుందా?
-
The Paradise Censor Cuts: నాని ‘ది ప్యారడైజ్’ పై సెన్సార్ కత్తెర.. ఏకంగా 21 కట్స్!
-
AP Heavy Rain Alert: భారీ నుంచి అతిభారీ వర్షాలు.. అధికారులకు హోంమంత్రి అనిత కీలక ఆదేశాలు
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!