Aus vs Ban Test: గెలుపు ముంగిట బంగ్లాదేశ్.. ఆసీస్‌కు ఓటమి తప్పదా?
- బంగ్లాదేశ్ మ్యాచ్‌పై పట్టు..
- తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 198 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్..
- బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 426 పరుగులు..
- రెండో ఇన్నింగ్స్‌లోనూ ఆస్ట్రేలియా తడబాటు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Aus vs Ban Test: డార్విన్ వేదికగా ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టులో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మూడో రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ జట్టు మ్యాచ్‌పై పట్టు బిగించింది. తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ 426 పరుగులు చేయగా, ఆస్ట్రేలియా కేవలం 198 పరుగులకే ఆలౌటైంది. దీంతో బంగ్లాదేశ్‌కు తొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా 228 పరుగుల భారీ ఆధిక్యం లభించింది.
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో స్టీవ్ స్మిత్ 71 పరుగులతో టాప్ స్కోరర్‌గా కాగా.. ట్రావిస్ హెడ్ 22, జేక్ వెదరాల్డ్ 23, అలెక్స్ క్యారీ 19 పరుగులు చేశారు. బంగ్లాదేశ్ బౌలర్లలో హసన్ మహ్ముద్ 6 వికెట్లు, టాస్కిన్ అహ్మద్, ఎబాడత్ హొస్సేన్ చెరో రెండు వికెట్లు తీశారు. ఇక బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 426 పరుగులు చేసింది. ఓపెనర్ తంజిద్ హసన్ 101 పరుగులతో అదరగొట్టాడు చేశాడు. కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ శాంటో 84 పరుగులు, మోమినుల్ హక్ 49, మెహిదీ హసన్ మిరాజ్ 65 పరుగులు చేశారు. ఈ దెబ్బతో బంగ్లాదేశ్‌కు 228 పరుగుల భారీ ఆధిక్యం దక్కింది.
Also Read
- Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
- iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
- Rahul Gandhi: ఢిల్లీ ఎందుకు నిర్బంధంలో ఉంది.. శాంతియుత నిరసనను ఎందుకు అడ్డుకుంటున్నారు?
- Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
రెండో ఇన్నింగ్స్‌లోనూ ఆస్ట్రేలియాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. జేక్ వెదరాల్డ్ డకౌట్ కాగా, ట్రావిస్ హెడ్ 17 పరుగులకే వెనుదిరిగాడు. మర్నస్ లబుషేన్ 31 పరుగులు చేశాడు. స్టీవ్ స్మిత్ 44 పరుగులు చేసి నాలుగో వికెట్‌గా ఔటయ్యాడు. అయితే కామెరాన్ గ్రీన్ 43 పరుగులతో, అలెక్స్ క్యారీ 19 పరుగులతో నాటౌట్‌గా క్రీజులో ఉన్నారు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 53 ఓవర్లలో 161/4తో ఉంది.
ప్రస్తుతం ఆస్ట్రేలియా బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఇంకా 67 పరుగులు వెనుకబడి ఉంది. ఆస్ట్రేలియా ఇంకా ఆరు వికెట్లను చేతిలో ఉంచుకుంది. కాబట్టి మ్యాచ్ పూర్తిగా బంగ్లాదేశ్ చేతుల్లోకి వెళ్లిందని చెప్పలేము. ఆస్ట్రేలియా ముందుగా 67 పరుగుల లోటును అధిగమించి, బంగ్లాదేశ్‌పై ఆధిక్యం సాధించాలి. ఆ తర్వాత బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్‌లో త్వరగా వికెట్లు పడగొట్టగలిగితేనే ఆస్ట్రేలియాను ఓడించే అవకాశం మరింత బలపడుతుంది.
తాజావార్తలు
-
Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Rahul Gandhi: ఢిల్లీ ఎందుకు నిర్బంధంలో ఉంది.. శాంతియుత నిరసనను ఎందుకు అడ్డుకుంటున్నారు?
-
Sanju Samson: 3 పరుగులకే సంజు శాంసన్ అవుట్.. ఆశ్చర్యం ఏముంది.. కామెంటేటర్ సంచలన వ్యాఖ్యలు!
-
Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ఆమె’ కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
ట్రెండింగ్
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!