Minister Adimulapu Suresh: నాలుగున్నరేళ్లలో రాష్ట్రంలో అన్నీ రంగాల్లో సాధికారత సాధించామని మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. రాజకీయంగా అన్నీ వర్గాలను చెయ్యి పట్టుకుని నడిపించామని ఆయన వెల్లడించారు. గతంలో టీడీపీ హయాంలో ఎన్నికల సమయంలో మాత్రమే అణగారిన వర్గాలు గుర్తుకు వచ్చేవని మంత్రి పేర్కొన్నారు. అన్నీ కులాల ఆర్థిక స్వావలంభన కోసం సీఎం జగన్ కృషి చేస్తున్నారన్నారు. సీఎం జగన్ చేపడుతున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకే సాధికారిక యాత్ర అంటూ మంత్రి చెప్పారు. ఏపీ పథకాలు పొరుగు రాష్ట్రాలకు ఆదర్శంగా మారాయన్నారు.
Also Read: Asaduddin Owaisi: కేసీఆర్ మూడో సారి సీఎం అవ్వడం పక్కా.. అసదుద్దీన్ ఓవైసీ
చిట్ట చివరి కుటుంబానికి కూడా లబ్ది చేకూరే వరకు పథకాలు కొనసాగిస్తామన్నారు. గతంలో కుట్ర పూరిత హామీలు గుప్పించిన చంద్రబాబు.. కులాల మధ్య చిచ్చుపెట్టాడంటూ మంత్రి మండిపడ్డారు. రాబోయే రోజుల్లో సరైన నిర్ణయం తీసుకుని జగన్ మరోసారి సీఎంను చేసుకోవాలని ప్రజలకు సూచించారు. నిజాయితీ, నిబద్ధతకు కేరాఫ్ అడ్రస్ సీఎం జగన్ అంటూ ఆయన కొనియాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలు ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించే స్థాయికి వెళ్ళారంటే అది సీఎం జగన్ ఘనత అంటూ పేర్కొన్నారు.