ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం ఇప్పుడు 45వ రోజుకు చేరుకుంది. అయితే అక్టోబర్ 7 దాడుల సూత్రధారి యాహ్యా సిన్వార్‌ను ఇజ్రాయెల్ సైన్యం ఇంకా కనుగొనలేకపోయింది. గత వారం ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు యాహ్యా సిన్వార్‌ను దూషించారు. అతనిని జర్మన్ నియంత హిట్లర్‌తో పోల్చారు. యాహ్యా సిన్వార్ హిట్లర్‌లా దాక్కుంటున్నాడని, గాజా ప్రజలు నిరంతరం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నెతన్యాహు ఆరోపించారు.
విశాఖ వేదికగా తొలి టీ20 మ్యాచ్ ఈనెల 23న ఇండియా-ఆస్ట్రేలియా మధ్య జరగనుంది. ఆస్ట్రేలియాతో టీమిండియా 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ కోసం పలువురు టీమిండియా ఆటగాళ్లు విశాఖకు చేరుకున్నారు.
ప్రకృతి వైపరీత్యాలకు జపాన్ పెట్టింది పేరు. ఒకవైపు భూకంపాలు, మరోవైపు తుపానులు ఆ దేశాన్నిఅతలాకుతలం చేస్తూ ఉంటాయి. తాజాగా జపాన్ కు నాలుగువేల కిలోమీటర్ల దూరంలో ఉన్న పపువా న్యూ గినియా దీవుల్లో పేలిన ఓ అగ్ని పర్వతం కారణంగా జపాన్ కు సునామీ ముంపు తప్పేటట్లు కనిపించడం లేదు.
ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధానికి పరిష్కారం కనుగొనడానికి చైనా మిడిల్ ఈస్ట్ దేశాల సమావేశానికి పిలుపునిచ్చింది. ఈ సమావేశంలో పాల్గొన్న మధ్యప్రాచ్య దేశాలు ఇజ్రాయెల్‌పై నిందలు మోపాయి. ఇజ్రాయెల్ పాలస్తీనియన్ల ఉనికిని తొలగించాలని కోరుకుంటోందని చెప్పారు. సమావేశంలో అన్ని ఇబ్బందులకు ఇజ్రాయెల్‌ను నిందించడం ఎటువంటి పరిష్కారాన్ని ఇవ్వదు.
ప్రపంచకప్ ఫైనల్లో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. ఈ ఓటమి కోట్లాది మంది భారత క్రికెట్ అభిమానుల హృదయాలను కొల్ల గొట్టింది. అంతేకాకుండా ఆటగాళ్ల ముఖాల్లో ఇప్పటివరకు ఓటమి బాధ పోవడంలేదు. అయితే టీమిండియా ఓపెనర్ శుభ్‌మన్ గిల్.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్‌లో ఓటమి బాధను వ్యక్తం చేశాడు. ఈ పోస్ట్‌లో భారత ఆటగాళ్లందరూ ఉన్నారు.
బీజేపీ మేనిఫెస్టో సంక్షేమం కోసం అయితే బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మేనిఫెస్టోలు సంక్షోభాన్ని సృష్టించేవన్నారు బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. ఉచిత విద్య, వైద్యం అందరికీ లభించేలా మా ప్రణాళిక రూపొందించామని, ప్రతి వ్యక్తి తన కాళ్ల మీద నిలబడి నలుగురికి ఉపాధి కల్పించేలా ఉండాలన్నారు లక్ష్మణ్. ప్రభుత్వం మీద ఆధారపడి ప్రజలు బతికేలా ఉండకూడదని, ఉచితాల…
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఓ బాలికను బహిరంగంగా కిడ్నాప్ చేశారు. ఈ ఘటన మొత్తం సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. ఉదయం 9.30 గంటలకు ఝాన్సీ రోడ్డులోని బస్టాండ్‌లో ఒక అమ్మాయి తన కుటుంబంతో సహా దిగింది. అయితే ఆ సమయంలో.. తన తమ్ముడిని టాయిలెట్‌కు తీసుకెళ్దామని సమీపంలోని పెట్రోల్ పంపు వద్దకు వెళ్లింది. ఇంతలోనే బైక్‌పై అక్కడికి వచ్చిన ఇద్దరు అగంతకులు.. బలవంతంగా యువతిని బైక్‌పై కూర్చోబెట్టుకుని తీసుకెళ్లారు.
ఉత్తరకాశీలో రెస్క్యూ ఆపరేషన్‌లో పెద్ద పురోగతి చోటుచేసుకుంది. దాదాపు రోజుల క్రితం సొరంగం కూలిపోవడంతో చిక్కుకున్న 41 మంది కార్మికులకు 6 అంగుళాల వెడల్పు గల ప్రత్యామ్నాయ పైపు చేరుకోగలిగింది. చిక్కుకుపోయిన కార్మికులకు ప్లాస్టిక్ బాటిళ్లలో పౌష్టికాహారం పంపాలని అధికారులు యోచిస్తున్నారు.