ఫ్రాన్స్‌లో ‘చిడో’ తుఫాను విధ్వంసం సృష్టించింది. మయోట్ ప్రాంతంలో తుఫాను కారణంగా వందలాది మంది మరణించారు. అణుదాడి తర్వాత జరిగిన విధ్వంసంలా చాలా ప్రాంతాల్లో విధ్వంస దృశ్యాలు నెలకొన్నాయి. తుఫాను దాటికి చాలా రోజులుగా తాగడానికి నీళ్లు, తినడానికి తిండి దొరకని దుస్థితి ఏర్పడింది. అలాగే.. కొన్ని ఇళ్లు కూలిపోయాయి. మృతుల సంఖ్య వేలకు చేరుకోవచ్చని స్థానిక అధికారులు చెబుతున్నారు. చిడో తుఫాను మయోట్ ప్రాంతంలో 225 km/h (140 mph) వేగంతో గాలులు వీచాయి. దీంతో నిరుపేద ప్రజల ఇళ్ల పైకప్పులు ధ్వంసమయ్యాయి. ఈ క్రమంలో.. వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Read Also: Robinhood : శివరాత్రికి రాబిన్ హుడ్ రిలీజ్..?
మరోవైపు.. శిథిలాల నుండి మృతదేహాలను బయటకు తీయడానికి చాలా రోజులు పడుతుంది. శిథిలాల మధ్య రెస్క్యూ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. మయోట్ ప్రాంతంలో విధ్వంసం చాలా తీవ్రంగా ఉందని.. శిథిలాల నుండి మృతదేహాలను బయటకు తీయడానికి చాలా రోజులు పట్టవచ్చని రెస్క్యూ సిబ్బంది అంటున్నారు. తుఫాను వల్ల విమానాశ్రయాలు, ధ్వంసమైన ప్రాంతాలు, విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడడంతో సహా ప్రజా మౌలిక సదుపాయాలకు భారీ నష్టం జరిగింది.
Read Also: Harish Rao: బీఏసీ అంటే బిస్కెట్ అండ్ చాయ్ లాగా చేశారు.. హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
ఫ్రెంచ్ టీవీ ఛానెల్ మయోట్ లోయిర్ నివేదిక ప్రకారం.. 90 ఏళ్ల తర్వాత ఫ్రాన్స్ అలాంటి విధ్వంసాన్ని చూసిందని పేర్కొన్నాయి. ఫ్రాన్స్ అంతర్గత మంత్రిత్వ శాఖ.. ఆదివారం కనీసం 11 మరణాలు, 250 మందికి పైగా గాయపడినట్లు ధృవీకరించింది. అయితే ఈ సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉందని చెప్పారు. ఆఫ్రికా తీరంలో ఆగ్నేయ హిందూ మహాసముద్రంలో ఉన్న మయోట్.. ఫ్రాన్స్‌లోని అత్యంత పేద ద్వీప భూభాగం. యూరోపియన్ యూనియన్‌లోని అత్యంత పేద ప్రాంతం.