RBI: వ్యక్తిగత రుణాలపై ఆర్ బిఐ కొత్త రూల్స్.. ఇక అప్పు పుట్టుడు కష్టమే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ధనం మూలం ఇదం జగత్. ఈ లోకంలో మనిషిని నడిపిస్తున్నది.. నవ్విస్తున్నది.. నటింపచేస్తుంది ధనమే. నిద్ర లేచింది మొదలు పడుకునే వరకు మనిషి జీవితం డబ్బు పైనే ఆధార పడి ఉంది. కొన్నిసార్లు అత్యవసర పరిస్థితులు మనిషని చుట్టుముడుతాయి. అలాంటి సందర్భాల్లో మనకి గుర్తొచ్చేంది వ్యక్తిగత రుణం. క్రెడిట్ స్కోరును మంచిగా మెయింటైన్ చేయగలిగితే బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు సులువుగా వ్యక్తిగత రుణం ఇస్తాయి. అయితే ఇక పైన అలా వ్యక్తిగత రుణం సులువుగా రాకపోవచ్చు అంటున్నారు విశ్లేషకులు. వివరాల్లోకి వెళ్తే.. గతంలో క్రెడిట్ స్కోరు మంచిగా ఉంటె బ్యాంకులు రుణాలను మంజూరు చేసాయి.
Read also:Mohammed Shami: ఓ వ్యక్తిని కాపాడిన భారత పేసర్ షమీ.. వీడియో వైరల్!
Also Read
- Petrol-Diesel Price: హార్ముజ్‌లో భారీ దాడులు.. వాహనదారులకు ధరలు షాకిచ్చే ఛాన్స్!
- Flipkart Minutes App: Flipkart Minutes ప్రత్యేక యాప్ లాంచ్.. ఇక 10 నిమిషాల్లోనే డెలివరీ, Blinkit- Zeptoకు గట్టి పోటీ!
- PM Surya Ghar Yojana: సామాన్య ప్రజలకు సూపర్ బెనిఫిట్.. 56 లక్షల కుటుంబాలకు జీరో కరెంట్ బిల్ .. ఇదే ఆ స్కీమ్ ! ఒక లుక్ వేయండి..
- Trade War: అమెరికాపై యుద్ధం ప్రకటించిన పొరుగుదేశం! అగ్రరాజ్యం వస్తువులపై 50% టారిఫ్..
ఆ రుణాలకు ఏడాది పాటు సక్రమంగా డబ్బును చెల్లిస్తే ఆపై ఎక్కువ మొత్తంలో రుణాలను అందించాయి. దీనితో రుణాలు తీసుకున్న చాలామంది తిరిగి రుణాన్ని చెల్లించడం లేదు. ఈ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) వ్యక్తిగత రుణాలపై కఠిన నిబంధనలు తీసుకువచ్చింది. ఈ నేపథ్యంలో అప్పులు దొరకడం కష్టంగా మారనుంది. ఒకప్పుడు తీసుకున్న లోన్ అమౌంట్ ను సక్రమంగా ఏడాది చెలించగానే, టాపప్ రుణం ఇస్తామని, అదనంగా వ్యక్తిగత రుణం ఇస్తామంటూ ముందుకు వచ్చే బ్యాంకులు.. ఇకపైన అధిక వడ్డీ తో వ్యక్తిగత, టాపప్ రుణాలను అందించడం ప్రారంభించాయి. దీనితో గతంతో పోలిస్తే కొత్తగా వ్యక్తిగత రుణాలను పొందడం కష్టంగా మారింది.
Read also:Sri Lankan Bowler: 9 ఓవర్లు, 9 మెయిడిన్లు, 0 పరుగులు, 8 వికెట్లు.. మ్యాజిక్ చేసిన శ్రీలంక బౌలర్
దీనికి కారణం రుణాలను అందించేందుకు బ్యాంకులకు అదనపు మూలధనం కావాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో వడ్డీ రేట్లను పెంచడం మినహా బ్యాంకులకు ప్రత్యామ్నాయం లేదు. అయితే ఇప్పుడు కొన్ని బ్యాంకులు 10-26 శాతం వడ్డీకి గరిష్ఠంగా రూ.20 లక్షల వరకు రుణాలను అందిస్తున్నాయి. ఇందుకు రుణం తీసుకునే వ్యక్తికి నెలకు రూ.30 వేలు ఆదాయం ఉన్న సరిపోతుంది. అయితే ఇదంతా ఒకపుడు. ఇప్పుడున్నా పరిస్థితుల నేపథ్యంలో ఇవన్నీ మారేందుకు ఆస్కారం ఉంది. క్రెడిట్ లేదా డెబిట్ కార్డు విషయంలోనూ కొన్ని మార్పులు రానున్నాయి.
తాజావార్తలు
-
OTR : గీత దాటిన గులాబీ ఎమ్మెల్సీలపై వేటేనా?
-
TSLPRB: తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. వయోపరిమితి మరో 3 ఏళ్లు పెంపు..
-
TGTET: ముగిసిన తెలంగాణ టెట్ పరీక్ష.. 89.96 శాతం మంది హాజరు..
-
Bombay High Court: జైల్లో 21 కిలోల బరువు తగ్గిన ఖైదీ.. బెయిల్ మంజూరు
-
Health Tips: మంచం ఎక్కిన వెంటనే నిద్ర పట్టాలా.. సింపుల్‌గా ఇలా చేయండి!
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!