Voter Slip: అసెంబ్లీ ఎన్నికలకు మరో నాలుగు రోజులే టైం ఉంది. పోలింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో ఓటర్లకు స్లిప్పుల పంపిణీ జోరుగా కొనసాగుతోంది. ఇప్పటికే దాదాపు సగం మంది ఓటర్లకు స్లిప్పులు ఇచ్చినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ రెండు రోజుల క్రితం మీడియాకు వెల్లడించారు. ఈరోజు వరకు మొత్తం 3.26 కోట్ల మందికి పంపిణీ చేస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతి ఇంటికి వెళ్లి భౌతికంగా ఓటరు స్లిప్పులు అందించే బాధ్యతను బూత్ లెవల్ ఆఫీసర్లకు అప్పగించామన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సంబంధిత బీఎల్‌వో మొబైల్ నంబర్ తెలిస్తే ఫోన్ చేసి వారి నుంచి నేరుగా పొందే అవకాశం ఉంది.
ఎన్నికల సిబ్బంది నుంచి ఓటరు స్లిప్పులు అందకపోతే ఆన్‌లైన్‌లో, మొబైల్ యాప్ ద్వారా, హెల్ప్ లైన్ నంబర్ ద్వారా, మొబైల్ ఎస్ఎంఎస్ ద్వారా ఓటరు స్లిప్పులను పొందే వీలును ఎన్నికల సంఘం కల్పించింది. ఫిజికల్ లేదా డిజిటల్ ఓటరు స్లిప్ లేకుంటే, మీరు నేరుగా పోలింగ్ బూత్‌కు వెళ్లి తనిఖీ చేసుకోవచ్చు. లేకపోతే ఈ పద్ధతుల్లో ఓటరు స్లిప్ లేదా వివరాలను పొందే సౌకర్యం ఉంటుంది.
Read Also:Mohammed Shami: ఓ వ్యక్తిని కాపాడిన భారత పేసర్ షమీ.. వీడియో వైరల్!
* ఓటరు గుర్తింపు కార్డు నంబర్‌ను టైప్ చేసి, వివరాలను పొందడానికి 1950 లేదా 9211728082కు SMS పంపండి.
* www.ceotelangana.nic.in వెబ్‌సైట్‌లో మీ పేరు-అసెంబ్లీ-ఓటర్స్ సర్వీస్ పోర్టల్ మెనూని సెర్చ్ చేయడం ద్వారా ఓటరు గుర్తింపు కార్డు లేదా మొబైల్ నంబర్ లేదా పేరు ఇవ్వడం ద్వారా ఏ నంబర్ పోలింగ్ స్టేషన్‌లో ఓటు వేయవచ్చో తెలుసుకోవడంతో పాటు డిజిటల్ స్లిప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
* ఇవే వివరాలను www.electoralsearch.eci.gov.in వెబ్‌సైట్ ద్వారా యాక్సెస్ చేయవచ్చు. ఓటరు డిజిటల్ స్లిప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
* www.voters.eci.gov.in వెబ్‌సైట్‌లో సెర్చ్ ఇన్ ఎలక్టోరల్ రోల్ అనే ఆప్షన్‌ని ఎంచుకుని వ్యక్తుల వివరాలను నమోదు చేయడం ద్వారా కూడా తెలుసుకోవచ్చు.
* www.ceotelangana.nic.in వెబ్‌సైట్‌లో మీరు జిల్లా, నియోజకవర్గాలు, పోలింగ్ కేంద్రాల వారీగా బిఎల్‌ఓల ఫోన్ నంబర్‌లను “ అధికారుల వివరాలు – బూత్ స్థాయి అధికారుల వివరాలు.” లేదా *www.ceotserms2.telangana.gov ఎంపిక ద్వారా తెలుసుకోవచ్చు. వెబ్‌సైట్ ./TS_ERODETAILS/BLO_Details.aspx ద్వారా జిల్లా, నియోజకవర్గ వివరాలను పొందడం ద్వారా BLOల ఫోన్ నంబర్‌లను పొందవచ్చు.
Read Also:Sri Lankan Bowler: 9 ఓవర్లు, 9 మెయిడిన్లు, 0 పరుగులు, 8 వికెట్లు.. మ్యాజిక్ చేసిన శ్రీలంక బౌలర్
* కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలోని 24 గంటల హెల్ప్‌లైన్ (టోల్ ఫ్రీ) నంబర్ 1950కి కాల్ చేసి, ఓటరు వివరాలు లేదా ఓటరు గుర్తింపు కార్డు నంబర్‌ను అందించడం ద్వారా పోలింగ్ స్టేషన్, బూత్, నంబర్ మొదలైనవాటిని కూడా పొందవచ్చు.
* ఎన్నికల కమిషన్‌కు మెయిల్ (complaints@eci.gov.in) ద్వారా ఫిర్యాదును అందించవచ్చు, మెయిల్ ద్వారా పోలింగ్ బూత్ వివరాలను తిరిగి పొందవచ్చు.
*ఆండ్రాయిడ్ ఫోన్ వినియోగదారులు గూగుల్ ప్లే స్టోర్ నుండి ఓటర్ హెల్ప్ లైన్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఐఓఎస్ వినియోగదారులు యాప్ స్టోర్ నుండి ఓటర్ హెల్ప్ లైన్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వివరాలను అందించడం ద్వారా వారు ఏ నంబర్ పోలింగ్ బూత్‌లో ఓటు వేయవచ్చో తెలుసుకోవచ్చు.