టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ అభిమానులకు గుడ్ న్యూస్. విజయ్ రాబోయే సినిమా ‘VD14’పై అంచనాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘ది రైజ్ బిగిన్స్’ అంటూ క్యాప్షన్ ఇవ్వడంతో.. ఫ్యాన్స్‌లో ఉత్సాహం నెలకొంది. ప్రస్తుతం #VD14, #VijayDeverakonda హ్యాష్‌ట్యాగ్స్‌తో సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. విజయ్ కెరీర్‌లో ఈ సినిమా ఓ కీలక మలుపుగా నిలవబోతోందని అభిమానులు భావిస్తున్నారు. విజయ్ దేవరకొండ 14వ సినిమా షూట్ శరవేగంగా జరుగుతున్నట్లు ఈ పోస్టర్ ద్వారా తెలుస్తోంది.
విజయ్ దేవరకొండ చివరగా నటించిన లైగర్, ఖుషి, ఫామిలీ స్టార్, కింగ్‌డమ్ సినిమాలు నిరాశపరిచాయి. గత కొంతకాలంగా సరైన సక్సెస్ లేక విజయ్ అల్లాడిపోతున్నారు. VD14తో అయినా గట్టి కంబ్యాక్ ఇవ్వాలని చూస్తున్నారు. VD14కు టాక్సీవాలా, శ్యామ్ సింగ రాయ్ ఫేమ్ రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. సంకృత్యాన్ అంటే కథతో పాటు విజువల్ ప్రెజెంటేషన్, టెక్నికల్ ఎక్సలెన్స్‌కి పేరుగాంచారు. సంకృత్యాన్ ప్రతి సినిమాలో ఒక సోల్ ఉంటుంది. అలాంటి దర్శకుడు విజయ్ వంటి స్టార్‌తో పీరియడ్ యాక్షన్ డ్రామా చేస్తుండడం ఫ్యాన్స్‌కి పండుగే అని చెప్పాలి. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
Also Read: IND vs NZ 1st T20: ఓపెనర్‌గా శాంసన్, రింకూకు ఛాన్స్.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే!
‘ది రైజ్ బిగిన్స్’ అనే క్యాప్షన్ VD14 సినిమా స్థాయి, కథా నేపథ్యంపై భారీ అంచనాలను పెంచుతోంది. ఇది విజయ్ దేవరకొండకు కొత్త ఇమేజ్, కొత్త ఎనర్జీని తీసుకొచ్చే ప్రాజెక్ట్‌గా ఉండబోతోందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఇప్పటికే ఈ సినిమాపై అధికారిక వివరాలు పెద్దగా బయటకు రాకపోయినా.. ఒక్క ట్వీట్‌తోనే క్రేజ్‌ను పెంచడంలో మేకర్స్ సక్సెస్ అయ్యారని చెప్పాలి. మొత్తానికి VD14 చుట్టూ ఏర్పడుతున్న బజ్ చూస్తే.. విజయ్ దేవరకొండ అభిమానులకు ఇది ఒక ఎమోషనల్ కంబ్యాక్ మూవీగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మేకర్స్ నుంచి వచ్చే అధికారిక అప్డేట్స్‌తో ఈ హైప్ ఇంకెంత పెరుగుతుందో చూడాలి.
The rise begins!❤️🔥❤️🔥#VD14 #VijayDeverakonda pic.twitter.com/ZPoVi1M2Gp
— Suresh PRO (@SureshPRO_) January 20, 2026