Malaysia Visa-Free Entry: భారతీయులకు బంపర్ ఆఫర్.. వీసా లేకుండా మలేషియా టూర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతీయులకు మలేషియా ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఇచ్చింది. భారతీయులు ఇప్పటికే థాయ్‌లాండ్, శ్రీలంకలో వీసా ఫ్రీ ఎంట్రీని పొందుతున్నారు. ఇక నుంచి మలేషియాలో వెళ్లేందుకు వీసా అవసరం లేదని ఆ దేశ ప్రధాన మంత్రి అన్వర్ ఇబ్రహీం ప్రకటన చేశారు. గతంలో కువైట్, సౌదీ అరేబియా, బహ్రెయిన్, యూఏఈ, టర్కీ, జోర్డాన్, ఇరాన్ దేశాలకు మలేషియా ఈ మినహాయింపు ఇచ్చింది. ఇప్పుడు భారతదేశానికి ఈ అవకాశం దక్కింది. అయితే, మలేషియా ప్రధాన మంత్రి అన్వర్ ఇబ్రహీం నిన్న (ఆదివారం) అర్థరాత్రి తన పీపుల్స్ జస్టిస్ పార్టీ కాంగ్రెస్‌లో చేసిన ప్రసంగంలో ఈ ప్రకటన చేశారు. డిసెంబర్ 1 నుండి 30 రోజుల పాటు చైనా, భారతదేశ పౌరులకు వీసా రహిత ప్రవేశాన్ని ఇస్తుందన్నారు. అయితే, వీసా మినహాయింపు ఎంతకాలం వర్తిస్తుందో ఆయన వెల్లడించలేదు.
Read Also: Indian Railway: రైలులో ప్రయాణిస్తున్నారా? ఈ రూల్స్ గురించి తప్పక తెలుసుకోవాలి..
Also Read
- KTR : రేవంత్ ఒక నిజాయితీ గల మోసగాడు.. ప్రశ్నిస్తున్నామని ఆయనకు కోపం
- Flydubai Heroes: పైలట్, ప్లంబర్, డెంటిస్ట్, బిజినెస్ మ్యాన్, బ్యాంకర్.. ఫ్లైదుబాయ్ ఘటనలో హీరోలు వీరే..
- CM Chandrababu: బటన్ నొక్కడం నా విధానం కాదు.. కామన్ మ్యాన్‌లా ప్రజల్లో ఉంటా.. ప్రజలే మాకు ప్రతిపక్షం..
- CM Chandrababu: బీసీ రిజర్వేషన్లను వైసీపీ అడ్డుకుంది..! సుప్రీంకోర్టుకు వెళ్తాం.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
ఇక, మలేషియాకు వెళ్లే అత్యధిక పర్యాటకులలో చైనా ప్రజలు నాల్గవ స్థానంలో భారతీయులు ఐదవ స్థానంలో ఉన్నారు. మలేషియాకు ఈ రెండు దేశాలు పెద్ద మార్కెట్లు కావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ మధ్య మలేషియాకు 9.16 మిలియన్ల మంది పర్యాటకులు వచ్చారు.. ఇందులో చైనా నుండి 4 లక్షల 98 వేల 540 మంది పర్యాటకులు ఉండగా.. భారతదేశం నుండి 2 లక్షల 83 వేల 885 మంది పర్యాటకులు ఉన్నారు. కరోనాకు ముందు 2019 ఇదే కాలంలో చైనా నుండి 15 లక్షల మంది.. భారతదేశం నుండి 3 లక్షల 54 వేల 486 మంది మలేషియాకు వెళ్లారు.
Read Also: Basara IIIT: బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య.. క్లారిటీ ఇచ్చిన అధికారులు
దీంతో పర్యటకులను ఆకర్షించేందుకు మలేషియా ఈ నిర్ణయం తీసుకుంది. ఆ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థను మెరుగు పరుచుకునేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది మినహాయింపు పొందిన వారిలో చైనా, భారతీయ పౌరులు కూడా ఉన్నారు. ప్రస్తుతం, చైనా- భారతీయ పౌరులు మలేషియాలోకి ప్రవేశించడానికి వీసా కోసం దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు.
తాజావార్తలు
-
Nani: ‘నానిని చూస్తుంటే ఆ స్టార్ హీరో గుర్తొచ్చాడు’.. మోహన్ బాబు
-
KTR : రేవంత్ ఒక నిజాయితీ గల మోసగాడు.. ప్రశ్నిస్తున్నామని ఆయనకు కోపం
-
The Paradise: బ్రేక్ అనుకుని యాక్సిలరేటర్ తొక్కేశా.. ఆ క్యారెక్టర్ అని తెలిస్తే ఒప్పుకునేవాడినే కాదు: మోహన్ బాబు
-
Mohan Babu: డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల నన్ను దారుణంగా మోసం చేశాడు.. నాని ముందే బాంబ్ పేల్చిన మోహన్ బాబు!
-
Flydubai Heroes: పైలట్, ప్లంబర్, డెంటిస్ట్, బిజినెస్ మ్యాన్, బ్యాంకర్.. ఫ్లైదుబాయ్ ఘటనలో హీరోలు వీరే..
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?