CM YS Jagan: విజయవాడ నడిబొడ్డున ఏర్పాటు చేస్తున్న అంబేడ్కర్ స్మృతివనం, అంబేడ్కర్ విగ్రహ నిర్మాణ పనులపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. అంబేడ్కర్ స్మృతివనం నిర్మాణం చారిత్రాత్మకమైనదని.. ఇది అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు అని మంత్రులకు, అధికారులకు వివరించారు. సామాజిక న్యాయస్ఫూర్తికి ప్రతిబింబంగా నిలిచే ప్రాజెక్టు ఇది అంటూ ముఖ్యమంత్రి జగన్ చెప్పారు. రాజ్యాంగ ఔన్నత్యం, ప్రజాస్వామ్య విలువలకు ప్రేరణగా నిలిచే గొప్ప కట్టడం ఇది అంటూ సీఎం తెలిపారు. ప్రజల మధ్య ఐక్యత, సుహృద్భావ వాతావరణాన్ని, సామరస్యాన్ని పెంపొందించడంలో ఈ ప్రాజెక్టు కీలకపాత్ర పోషిస్తుందన్నారు.
Read Also: Bhupesh Baghel: కాంగ్రెస్తో కేసీఆర్కు భయం పట్టుకుంది…
నిర్ధేశించుకున్న గడువులోగా అంబేడ్కర్ విగ్రహం, స్మృతివనం పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. స్మృతివనం, విగ్రహం ప్రారంభించేనాటికి ఒక్క పని కూడా పెండింగ్‌లో ఉండకూడదన్నారు. ఈ నేపథ్యంలో జనవరి 15 నాటికి పనులు పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. జనవరి 24న ప్రారంభోత్సవానికి అంబేడ్కర్ విగ్రహం, స్మృతివనాన్ని సిద్ధం చేస్తామని అధికారులు వెల్లడించారు. స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ కాన్సెప్ట్‌గా అంబేడ్కర్ విగ్రహం, స్మృతివనం ఏర్పాటు చేస్తామన్నారు. అంబేడ్కర్ విగ్రహం పీఠం ఎత్తు 81 అడుగులు, విగ్రహం ఎత్తు 125 అడుగులుగా ఉండనుంది.