*కేసీఆర్ కలిసేందుకు వచ్చినా నేను కలవలేదు.. ఎందుకంటే..
కేసీఆర్ నన్ను బీజేపీతో కలిసి పని చేసేందుకు వచ్చాడు.. కానీ తెలంగాణా ప్రజల అభిస్తాం మేరకు నేను కేసీఆర్ తో కలవలేదని ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కార్తీక పౌర్ణమి శుభకాశాలు చెప్పి కురవి వీర భద్ర స్వామికి నమస్కారం చెప్పిన స్పీచ్ ప్రారంభించారు. తెలంగాణాను కాంగ్రెస్ బీఆర్ఎస్ లు నాశనం చేశాయన్నారు. తెలంగాణాలో మొదటి సారి బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందన్నా నమ్మకం ఉందన్నారు. దీంతో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పటు చేద్దామన్నారు. కేసీఆర్ నన్ను బీజేపీతో కలిసి పని చేసేందుకు వచ్చాడు.. కానీ తెలంగాణా ప్రజల అభిస్తాం మేరకు నేను కేసీఆర్ తో కలవలేదన్నారు. దీంతో మోడీని తిట్టే ప్రతి చిన్న అంశాన్ని వాడుకుంటున్నారని తెలిపారు. తెలంగాణా అంటే సంప్రదాయాలకు టెక్నలజీ ల తెలంగాణా అన్నారు. కానీ ముఖ్య మంత్రి సీఎం మూఢ నమ్మకలను పెంచేలా ప్రవర్తిసున్నారు సీఎం కేసీఆర్ అని మండిపడ్డారు. ఫామ్ సీఎం మనకు అవసరమా? అని ప్రశ్నించారు. స్కాములు చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం పైనా తెలంగాణా బీజేపీ సర్కార్ పంపుతోందన్నారు. కాంగ్రేస్.. బీఆర్ఎస్ రెండు పార్టీలు అవినీతి ప్రోత్సహించారని మండిపడ్డారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలు ఒక్కటే.. శాంతి వ్యవస్థను నష్టం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బలహీన వర్గాల.. బంజారా జాతులకు శ్రేయస్సు బీజేపీ కోరుకుంటుందని అన్నారు. ఆదివాసీల అది నేతల పరాక్రమాన్ని చెప్పే.. మ్యూజియం హైదరాబాద్ ఏర్పటు చేస్తున్నామని తెలిపారు. ములుగులో ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పటు చేశామన్నారు. ఆ యూనివర్సిటీ పేరును ఆదివాసీ ఆరాధ్య దైవం అయిన సమ్మక్క సరక్కల పేరు కూడా పెట్టామన్నారు. మాదిగల వర్గీకరణ బీజేపీ సకరిస్తుందన్నారు. సామాజిక న్యాయం బీజేపీ తోనే సాధ్యమన్నారు. పెట్రొల్ డీజిల్ ధరలు తగ్గాలా లేదా? అని ప్రశ్నించారు. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యాట్ తగించలేదు దీంతో కేంద్ర తాగించిన డీజిల్ పెట్రోల్ ధరలు తగ్గ లేదన్నారు. కేసీఆర్ నీళ్లు నిదులు ఇస్తా అన్నా కేసీఆర్ అవి ఇవ్వలేదు కానీ.. మోసాలు కన్నీళ్లు ఇచ్చారని ధ్వజమెత్తారు. తెలంగాణకు డబుల్ ఇంజన్ సర్కార్ కావాలని కోరుకుంటుందని తెలిపారు. డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే అభివృద్ధి జరుగుతుంది.. గ్రామాల అభివృద్ధి జరుగుతుందన్నారు.
*బీఆర్ఎస్-కాంగ్రెస్ మధ్య ఒప్పందం.. సీఎంగా కేసీఆర్.. పీఎంగా రాహుల్!
కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో బీజేపీ ఏర్పాటు చేసిన సకల జనుల విజయ సంకల్ప సభలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. బీఆర్ఎస్, కాంగ్రెస్ కు ఓటు వేస్తే కుటుంబ పార్టీలు సీఎం అవుతారు.. బీజేపీకి ఓటు వేస్తేనే బీసీ సీఎం అవుతాడని తెలిపారు. హుజూరాబాద్ నియోజక వర్గం నుండి ఈటల రాజేందర్ ను గెలిపించండి.. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారు అని ఆయన పేర్కొన్నారు. పేదల తరుపున మాట్లాడినందుకే.. కేసీఆర్ ఈటలపై కక్ష్య పెంచుకొని పార్టీ నుండి బయటకి పంపారు అంటూ అమిత్ షా సంచలన ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ఒప్పందం జరిగింది అని అమిత్ షా పేర్కొన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ ను ముఖ్యమంత్రిగా.. కేంద్రంలో రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిగా చేసేందుకు ఈ సంది చేసుకున్నారని ఆయన తెలిపారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు ఒక్కటే.. రాష్ట్రంలో ముస్లింలకు ఉన్న నాలుగు శాతం రిజర్వేషన్ తీసివేస్తామన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రధాన మంత్రి మోడీ అరవై లక్షలు కోట్ల రూపాయలు ఇచ్చింది అని చెప్పారు. రైతుల ధాన్యానికి మద్దతు ధర 3100 రూపాయలు ఇచ్చి ధాన్యం మొత్తం ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది అని అమిత్ షా వెల్లడించారు.
*అంబేడ్కర్ స్మృతివనం, అంబేడ్కర్ విగ్రహ నిర్మాణ పనులపై సీఎం జగన్ సమీక్ష
విజయవాడ నడిబొడ్డున ఏర్పాటు చేస్తున్న అంబేడ్కర్ స్మృతివనం, అంబేడ్కర్ విగ్రహ నిర్మాణ పనులపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. అంబేడ్కర్ స్మృతివనం నిర్మాణం చారిత్రాత్మకమైనదని.. ఇది అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు అని మంత్రులకు, అధికారులకు వివరించారు. సామాజిక న్యాయస్ఫూర్తికి ప్రతిబింబంగా నిలిచే ప్రాజెక్టు ఇది అంటూ ముఖ్యమంత్రి జగన్ చెప్పారు. రాజ్యాంగ ఔన్నత్యం, ప్రజాస్వామ్య విలువలకు ప్రేరణగా నిలిచే గొప్ప కట్టడం ఇది అంటూ సీఎం తెలిపారు. ప్రజల మధ్య ఐక్యత, సుహృద్భావ వాతావరణాన్ని, సామరస్యాన్ని పెంపొందించడంలో ఈ ప్రాజెక్టు కీలకపాత్ర పోషిస్తుందన్నారు. నిర్ధేశించుకున్న గడువులోగా అంబేడ్కర్ విగ్రహం, స్మృతివనం పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. స్మృతివనం, విగ్రహం ప్రారంభించేనాటికి ఒక్క పని కూడా పెండింగ్‌లో ఉండకూడదన్నారు. ఈ నేపథ్యంలో జనవరి 15 నాటికి పనులు పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. జనవరి 24న ప్రారంభోత్సవానికి అంబేడ్కర్ విగ్రహం, స్మృతివనాన్ని సిద్ధం చేస్తామని అధికారులు వెల్లడించారు. స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ కాన్సెప్ట్‌గా అంబేడ్కర్ విగ్రహం, స్మృతివనం ఏర్పాటు చేస్తామన్నారు. అంబేడ్కర్ విగ్రహం పీఠం ఎత్తు 81 అడుగులు, విగ్రహం ఎత్తు 125 అడుగులుగా ఉండనుంది.
*కాంగ్రెస్తో కేసీఆర్కు భయం పట్టుకుంది…
ఆదిలాబాద్ లో ఛత్తీస్ ఘడ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ పర్యటిస్తున్నారు. అందులో భాగంగా అక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. నిన్నటినుండి నేను తెలంగాణాలో పర్యటిస్తున్నాను.. ఇక్కడ కాంగ్రెస్ అనుకూల వాతావరణం కనిపిస్తోందని తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్రం ధరల పెంపుతో సామాన్య ప్రజల నడ్డి విరుస్తోందని ఆరోపించారు. అబద్దాలతో రెండుమార్లు అధికారంలోకొచ్చారని తెలిపారు. మరోవైపు తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం హామీలేవీ నెరవేర్చలేదని మండిపడ్డారు. 10 ఏళ్ళ తెలంగాణాలో కేవలం కేసీఆర్ కుటుంబమే బాగుపడిందని పేర్కొన్నారు. భూమి, నీరు, మద్యం, ఖనిజవనరులన్నీ కేసీఆర్ కుటుంబ దోపిడీకి గురయ్యాయని తెలిపారు. తెలంగాణా ప్రజలు చైతన్యవంతులు.. కాంగ్రెస్ తన హామీలను ఎల్లపుడూ నిలబెట్టుకుందని అన్నారు. కాంగ్రెస్ 6 గ్యారంటీలను ప్రజలు విశ్వసిస్తున్నారు.. వారు ఈ మారు మోసపోవటానికి సిద్ధంగా లేరని భూపేష్ బఘేల్ తెలిపారు. రుణమాఫీ, ఇందిరమ్మ ఇళ్ళు, రైతుబంధు, యువవికాసం, మహాలక్ష్మీ, పింఛన్ల పథకాలు జనానికి మేలు చేసేవని పేర్కొన్నారు. ఛత్తీస్ ఘడ్ లో ఒక కోటి ఎకరాల భూమిని ఆదివాసులకు పంపిణీచేశామని సీఎం భూపేష్ బఘేల్ తెలిపారు. ఇదిలా ఉంటే.. కాంగ్రెస్ పాలిత ప్రాంతాలపై కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. ఛత్తీస్ ఘడ్ అభివృద్దికి కేంద్రం నుండి ఆశించిన సహకారం లేదని తెలిపారు. రూ. 9.5 వేలకోట్ల నిధులను ఆదివాసీ ప్రాంతాల కొరకు ఖర్చు చేశామన్నారు. మోదీ, కేసీఆర్ లు ఇద్దరిదీ ఒకే విధానమని విమర్శించారు. ప్రజలకు కాంగ్రెస్ అంటే నమ్మకం అని అన్నారు. దళితులకు 3 ఎకరాలు, డబుల్ బెడ్రూం ఇళ్ళు, దళిత బంధు, విద్య, వైద్యం ఇలా అన్ని హామీలూ నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. కర్నాటక తరహా ఫలితాలే తెలంగాణాలో రానున్నాయని సీఎం భూపేష్ బఘేల్ తెలిపారు. తెలంగాణా ఆర్థిక పరిస్థితి తమ 6 గ్యారంటీల పై ప్రభావం చూపబోదన్నారు. కర్నాటకలో విజయరహస్యం ఇదేనని వివరించారు. రైతులు, మహిళలకు వెచ్చించే నిధులు తిరిగి సమాజంలోనే వినియోగమౌతాయని పేర్కొన్నారు. సాధారణ ప్రజలకు ఇచ్చే సంక్షేమ పథకాలతో ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. బడాబాబులకు వెసులుబాటే ఆర్థిక పరిస్థితికి చేటు అని తెలిపారు. కాంగ్రెస్ తో కేసీఆర్ కు భయం పట్టుకుందని.. ఎమ్మెల్సీ కవిత విషయంలో కేవలం ఈడీ నోటీసులతో సరిపెట్టడం బీజేపీ, బీఆర్ఎస్ మధ్య బంధానికి నిదర్శనమని అన్నారు. తెలంగాణలో కరెంటు తామే సప్లై చేస్తున్నామని.. దానికి సంబంధించిన డబ్బులు ఇంకా కేసీఆర్ సర్కార్ బకాయిపడి ఉందని భూపేష్ బఘేల్ తెలిపారు.
*మేం ఇచ్చిన హామీలు, గ్యారెంటీలు కచ్చితంగా అమలు చేస్తాం.
ప్రచారానికి రేపు ఒక్కరోజు సమయం ఉండటంతో రాజకీయ పార్టీల అగ్రనేతలు ప్రచారంలో జోరు పెంచుతున్నారు. అందులో భాగంగా.. ఖమ్మం జిల్లా ముష్టికుంట్లలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదేళ్లపాటు తెలంగాణ పేదలకు కేసీఆర్ చేసిందేమీ లేదని ఆరోపించారు. ఏం చేయలేని కేసీఆర్ ఎక్కడుంటే ఏం లాభమని ప్రశ్నించారు?. రాష్ట్రంలో పేదలకు ఇచ్చిన ఇళ్లన్నీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్లే అని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు జానెడు జాగా కూడా ఇవ్వలేదని విమర్శించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు.. గ్యారెంటీలు కచ్చితంగా అమలు చేస్తామని భట్టి విక్రమార్క తెలిపారు. ఉచిత కరెంట్ ఇచ్చిందే కాంగ్రెస్.. కరెంట్ కాంగ్రెస్ పేటెంట్ అని అన్నారు. కరెంటును పట్టుకుంటే ఏమవుతుందో.. కాంగ్రెస్ పార్టీతో పెట్టుకున్నా అదే అవుతుంది.. కేసీఆర్ మాడిపోతావ్ అని మండిపడ్డారు. మేం ఇచ్చిన హామీలను బరాబర్ అమలు చేసి చూపిస్తామని తెలిపారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్టేనని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే.. బీఆర్ఎస్ పార్టీ ఢిల్లీలో బీజేపీకి ఓటేస్తోందని భట్టి విక్రమార్క విమర్శించారు.
*రైతుబంధుపై నేను తప్పుగా మాట్లాడలేదు..
రైతుబంధు ఆగిపోవడంపై మంత్రి హరీశ్‌రావు కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ నేతల ఫిర్యాదు మేరకు ఎన్నికల సంఘం రైతుబంధుకు అనుమతి నిరాకరించిందని అన్నారు. రైతు సోదరుడిని ఎన్ని రోజులు ఆపుతారని ప్రశ్నించారు. డిసెంబర్ 3 వరకు ఆపగలరని, ఆ తర్వాత మళ్లీ కేసీఆర్ మాత్రమే వచ్చి ఇస్తారని అన్నారు. జహీరాబాద్‌లో నిర్వహించిన జన ఆశీర్వాద సభలో మంత్రి హరీశ్‌రావు ప్రసంగించారు. రైతుబంధుపై కాంగ్రెస్ నేత నిరంజన్ రెడ్డి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ రైతులకు ఇవ్వదని… ఇచ్చిన వారిని ఆపడమే తమ పని అని అన్నారు. తెలంగాణ రైతులతో కేసీఆర్ కు ఉన్న బంధం ఓట్ల బంధం కాదన్నారు. గతంలో ఎన్నికల మేనిఫెస్టోలో ప్రస్తావించకపోయినప్పటికీ రైతుబంధుకే ఇచ్చారని గుర్తు చేశారు. ఈ పదేళ్లలో ఇప్పటి వరకు కేసీఆర్ ప్రభుత్వం 11 సార్లు రైతు బంధు ఉత్సవాలను నిర్వహించిందని గుర్తు చేశారు. ఓట్ల కోసం కాదని, రైతులపై ప్రేమతో రైతుబంధు ఇస్తున్నారని అన్నారు. రైతుబంధు కింద ఎకరానికి ఏడాదికి రూ. 16వేలు కేసీఆర్ ఇస్తే… రైతుకు రూ. 15వేలు ఇస్తామని కాంగ్రెస్ చెబుతున్నారని, ఈ కుట్రలను తిప్పికొట్టాలన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే రైతుబంధు అంతం అవుతుందని కాంగ్రెస్ నేతలకు ఓట్లు వేయాలని అన్నారు. రైతుబంధుపై ఎన్నికల ప్రచార సభలో హరీశ్‌రావు చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదులు అందిన నేపథ్యంలో హరీశ్‌రావు స్పందించారు. ఇందులో ఏమైనా పొరపాట్లు వుందా అని ప్రశ్నించారు. సోమవారం ఉదయం టీ తాగితే రైతుబంధు నిధులు అందినట్లు ఫోన్‌లో నోటిఫికేషన్ వస్తుందని హరీశ్‌రావు తెలిపారు. ఆయన వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకున్న ఎన్నికల సంఘం రైతుబంధును తిరస్కరించింది. దీనిపై హరీష్ రావు మాట్లాడుతూ తాను మాట్లాడిన దాంట్లో తప్పు ఉందన్నారు. రైతన్న నోటికాడి ముద్దను కాంగ్రెస్ అడ్డుకుంటుందన్నారు. తాను తప్పేం మాట్లాడలేదని.. ఎలాంటి నిబంధనలు ఉల్లంఘించలేదని హరీష్ రావ్ క్లారిటీ ఇచ్చారు.
*కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ ఉద్యమ ఉవ్వెత్తున ఎగిసిన సమయంలో.. మీ అమ్మగారైన శ్రీమతి సోనియాగాంధీ యూపీఏ చైర్‌పర్సన్‌గా ఉండి కూడా.. దాదాపు 1200మంది ఆత్మహత్య చేసుకున్నాక గానీ.. తెలంగాణ ఇవ్వలేదు. ఇది కాకుండా.. నాడు విద్యార్థి లోకం, ఉద్యోగ, ఉపాధ్యాయసంఘాలు, తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషిస్తుంటే.. వారికి మద్దతు తెలపాల్సింది పోయి, రాష్ట్ర ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించిన సీపీఎం, మజ్లిస్ పార్టీలతో మీరు జతకట్టారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. 1969లో జరిగిన తొలిదశ తెలంగాణ ఉద్యమంలో 369 మంది యువకిశోరాలను అత్యంత కిరాతకంగా తుపాకులతో కాల్చిచంపిన పార్టీ కాంగ్రెస్ కాదా? కిషన్ రెడ్డి ప్రశ్నించారు. తర్వాత 2009లోనూ తెలంగాణకు అనుకూలంగా డిసెంబర్ 9న ప్రకటన చేసి, ఆ తర్వాత 23వ తేదీన దీన్ని వెనక్కు తీసుకున్న సమయంలో ఇక్కడ రగిలిన మనసుల గురించి, ఆగిన గుండెల గురించి మీరు ఏనాడైనా ఆలోచించారా అని అన్నారు. అసలు డిసెంబర్ 23 నాటి మీ నిర్ణయంలో ఏదైనా శాస్త్రీయత కనిపించిందా..? లేక మజ్లిస్, సీపీఎం వంటి రాజకీయ మిత్రుల ఒత్తిడికి తలొగ్గారా? అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ విషయంలో మొదట్నుంచీ బీజేపీ ఓ స్పష్టమైన ఆలోచనతో ఉందని కిషన్ రెడ్డి అన్నారు. కాకినాడలో చేసిన ఒక ఓటు, రెండు రాష్ట్రాల తీర్మానం మొదలుకుని.. పార్లమెంటులో స్వర్గీయ సుష్మాస్వరాజ్ పలుమార్లు పార్లమెంటులో గొంతెత్తడంతో.. తెలంగాణ విషయంలో మీ మొద్దునిద్ర వదిలిందని దుయ్యబట్టారు. నాడు లోక్‌సభ వేదికగా సుష్మాస్వరాజ్ చేసిన చారిత్రక ప్రసంగం ఇంకా ప్రజల కళ్లముందు కదలాడుతోందని తెలిపారు. తెలంగాణకు అండగా ఉండాలన్న సుష్మాస్వరాజ్ నిర్ణయం, పార్లమెంటు లోపల, బయట బీజేపీ చేసిన ఉద్యమం, తెలంగాణలో వందలాది మంది విద్యార్థుల బలిదానానికి తలొగ్గి మీరు ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన బిల్లు’ను ప్రవేశపెట్టారన్నారు. ఇది వాస్తవం కాదని చెప్పే ధైర్యం మీకుందా అని ప్రశ్నించారు. రాజకీయ స్వలాభం లేకుండా ఏ నిర్ణయాన్ని తీసుకోని మీరు, మీ పార్టీ.. తెలంగాణ ఏర్పడగానే కేసీఆర్ కుటుంబాన్ని మీ ఇంటిని ఇంటికి పిలిపించుకొని ఆశీర్వచనాలిచ్చి, ఫొటోలకు ఫోజులు ఇవ్వడం వెనక జరిగిన వాస్తవ కథనాలకు వాస్తవరూపం ఇవాళ తెలంగాణ ప్రజలకు అర్థమవుతోందని కిషన్ రెడ్డి ఆరోపించారు. తెరముందు రాజకీయంగా వైరుధ్యాన్ని పాటిస్తూనే.. తెరవెనుక కలిసిపనిచేయాలనే మీ దోస్తీ బట్టబయలైందని తెలిపారు. అందుకే 2014, 2018ల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్‌లో చేరినా.. మీరు ప్రజాప్రాతినిధ్య చట్టం ఆధారంగా ‘గీత దాటిన’వారిపై చర్యలు తీసుకోలేదన్నారు. మీ ప్రతి నిర్ణయం వంచనేనని ఆరోపించారు. చీకటి ఒప్పందాలు చేసుకుంటూ.. పదేళ్లుగా తెలంగాణ ప్రజలకు మీరు చేస్తున్న మోసం బట్టబయలైంది. తెలంగాణ ఎన్నికల్లో మీ అపవిత్ర దోస్తీని పసిగట్టిన జనం.. ఇరుపార్టీలకు సరైన బుద్ధి చెప్పనున్నారని తెలిపారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల సమయంలో, పార్లమెంటులో బిల్లుకు సహకరించుకోవడంలో మీ స్నేహాన్ని యావత్ తెలంగాణ సమాజం చూసిందని.. అవన్నీ గుర్తుంచుకుంది కూడా అని కిషన్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా విభజన సమస్యలన్నీ ఎక్కడ వేసిన గొంగడిలా అలాగే ఉన్నాయి. దీనికి కారణం.. మీ స్వార్థ బుద్ధి, రాజకీయ కుట్ర అని స్పష్టంగా అర్థమవుతూనే ఉంది. కర్ణాటకలో మీ పార్టీ గెలిచేందుకే కేసీఆర్ డబ్బు పంపించాడంటూ అనేకరోపణలు వచ్చాయి. ఇప్పుడు తెలంగాణలో మీ ఎమ్మెల్యేలను గెలిపించడానికి కేసీఆర్ ఆర్థిక సహాయం చేస్తున్నాడని తెలంగాణ ప్రజలు తెలుసుకున్నారు. అందుకే రాష్ట్రంలో అమరవీరుల ఆకాంక్షలను, సొంతరాష్ట్రంలో బతుకులు బాగుపడతాయనుకున్న ప్రజల ఆశలను కాలరాస్తూ.. మీ రెండు కుటుంబ, అవినీతి పార్టీలు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నందుకు తెలగాణ ప్రజలు మీ ఇద్దరికీ సరైన బుద్ధి చెబుతారు.
*బెంగాల్‌లో ఘోర ప్రమాదం.. రైలు ఢీకొని 3 ఏనుగులు మృత్యువాత
పశ్చిమ బెంగాల్‌లోని బక్సా టైగర్ రిజర్వ్ అటవీప్రాంతంలో ఈరోజు పార్శిల్ రైలు ఢీకొన్న ప్రమాదంలో మూడు ఏనుగులు చనిపోయాయి. రాజభట్‌ఖావా, కాల్చిని రైల్వే స్టేషన్‌ల మధ్య శిఖరి గేట్ సమీపంలో ఉదయం 7 గంటలకు ఈ సంఘటన జరిగింది. పార్శిల్ రైలు ఢీకొనడంతో ఒక పిల్ల ఏనుగు, రెండు పెద్ద ఏనుగులు మృతి చెందాయి. వీడియో ఫుటేజీలో.. రైలు కింద ఉన్న మూడు ఏనుగులలో ఒకదాని శరీరంపై అనేక కోత గుర్తులు ఉన్నాయి. అలీపుర్‌దువార్ జిల్లాలోని టైగర్ రిజర్వ్‌లోని వెస్ట్ రాజభట్‌ఖావా పరిధిలో జరిగిన విషాద సంఘటన భారతదేశంలో రైలు ఢీకొనడం వల్ల ఏనుగుల మరణాలకు సంబంధించిన అనేక సాధారణ సంఘటనలలో ఒకటి. ఈ ఏడాది ప్రారంభంలో, పశ్చిమ బెంగాల్‌లోని అలీపుర్‌దూర్ జిల్లాలోని చప్రమరి రిజర్వ్ ఫారెస్ట్‌లో రైలు ట్రాక్‌ను దాటడానికి ప్రయత్నిస్తుండగా గర్భిణీ ఏనుగును గూడ్స్ రైలు ఢీకొట్టింది. భారతదేశంలో ప్రతి సంవత్సరం సగటున 20 ఏనుగులు రైలు ఢీకొనడం వల్ల మరణిస్తున్నాయని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. దేశంలోని ఏనుగుల జనాభాలో దాదాపు 2 శాతం మంది నివసిస్తున్నారు, పశ్చిమ బెంగాల్‌లో అసహజ ఏనుగుల మరణాలకు రైల్వే ప్రమాదాలు ఒక కారణమవుతున్నాయి. దీనిని నిరోధించడానికి ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తున్న సమస్యగా మిగిలిపోయింది.
*మమ్ముట్టి సినిమాపై ప్రశంసలు కురిపించిన సూర్య..
మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి నటించిన లేటెస్ట్ మూవీ “కాథల్ ది కోర్”. మలయాళ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ముంబై భామ జ్యోతిక హీరోయిన్ గా నటించింది. జియో బేబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మమ్ముట్టి కంపెనీ, వేఫరెర్ ఫిలిమ్స్ బ్యానర్లపై సంయుక్తం గా నిర్మించింది. ఈ మూవీకి మాథ్యూస్ పులికన్ సంగీతం అందించాడు. ఈ మూవీ నవంబర్ 23న ప్రపంచ వ్యాప్తం గా థియేటర్ల లో గ్రాండ్ గా విడుదలైంది. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వస్తుంది. అలాగే క్రిటిక్స్ నుంచి మంచి రివ్యూస్ కూడా వస్తున్నాయి.కాగా ఈ సినిమా పై ప్రేక్షకులతో పాటు సెలబ్రిటీలు ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా ఈ సినిమా చూసిన సమంత ఈ ఏడాది లో నేను చూసిన ఉత్తమ చిత్రం ఇదే. తప్పకుండా అందరు కలిసి చూడాల్సిన చిత్రమిది. మమ్ముట్టి సార్ నా అభిమాన హీరో. ఆయన నటన ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఈ మూవీ ఫీల్ నుంచి ఇంకా నేను బయటకు రాలేకపోతున్నా. మంచి సినిమాలు చూస్తే మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. లవ్ యూ జ్యోతిక’ అంటూ పోస్ట్ చేసింది.తాజాగా స్టార్ హీరో, జ్యోతిక భర్త సూర్య ఈ చిత్రం పై ప్రశంసలు కురిపించాడు.అందమైన ఆలోచనలు కలిసి వస్తే మనకు కాథల్ ది కోర్ లాంటి సినిమాలు వస్తాయి. మంచి సినిమా పట్ల మమ్ముట్టి సార్ చూపించే ప్రేమ ఆయనిచ్చే స్ఫూర్తి ఎంతో అద్భుతం. అందమైన సినిమా అందించిన మమ్ముట్టి సార్ టీంకు నా హ్యాట్సాఫ్. నిశ్శబ్ద సన్నివేశాలు కూడా విలువల గురించి మాట్లాడతాయి. మాకు ఈ ప్రపంచాన్ని చూపించిన రైటర్స్ ఆదర్శ్ సుకుమార మరియు పౌల్సన్ స్కేరియాకు అభినందనలు. నా ప్రియమైన జ్యోతిక తన ప్రేమ తో అందరి హృదయాలను గెలుచుకుంది.. అని సూర్య ఇన్‌స్ట్రాగ్రామ్ లో రాసుకొచ్చారు సూర్య.