ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో మత మార్పిడి ఘటనలో 42 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటి వరకు 9 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పేద, గిరిజన ప్రజల్ని క్రైస్తవ మతంలోకి మార్పిడి చేస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో యూపీలోని సోన్ భద్ర జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే, మతపరమైన గ్రంధాలు, ప్రచార వస్తువులు, ల్యాప్‌టాప్‌లను పోలీసులు అదుపులోకి తీసుకుని నిందితులను అరెస్ట్ చేశారు. ఇక, జిల్లాలోని చొప్పన్ పోలీసు స్టేషన్‌లో మతమార్పిడికి సంబంధించిన కేసు నమోదు అయింది. తప్పుడు పద్ధతిలో క్రిస్టియన్ మతంలోకి మార్పుడులు కొనసాగుతున్నాయని ఆ ఫిర్యాదులో వెల్లడించారు.
Read Also: Aditya L1 Mission: సౌర గాలులను పరిశీలిస్తున్న ఆదిత్య ఎల్1 మిషన్.. ఫోటో రిలీజ్ చేసిన ఇస్రో
అయితే, మత మార్పిడులను నిషేధిస్తూ ఇటీవల ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకంగా చట్టాన్ని రూపొందించింది. తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైకి చెందిన జైప్రభు, ఉత్తరప్రదేశ్ లోని రాబర్ట్‌గంజ్‌కు చెందిన అజయ్ కుమార్, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడకు చెందిన చెక్క ఎమ్మాన్యువల్‌ను యూపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు అయిన మిగితావారిలో రాజేంద్ర కోల్, రంజన్, పరమానంద్, సోహన్, ప్రేమ్‌నాథ్ ప్రజాపతి, రామ్ ప్రతాప్ లు ఉన్నారు.