Karnataka: పసుపు చేనులో గంజాయి సాగు.. తండ్రీ, కొడుకు అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka: బిడ్డ బలహీనంగా ఉన్నాడు పండ్లు పెట్టమని వైద్యుడు చెప్తే బలానికి రేగిపళ్ళుపెట్టిందని.. ఏదైనా పంటేగా అనుకున్నారేమో గాని ఓ తండ్రీ కొడుకులు గంజాయి పంట పండించారు. పట్టుబడితే శిక్ష తప్పదని తెలిసీ ఈ అక్రమానికి పాల్పడ్డారు. పసుపు పంటను సాగు చేస్తున్నట్లు అందరిని నమ్మించారు. అయితే నిజం నిప్పులాంటిదని.. గుప్పెట్లో దాగదు అన్నట్లు సమాచారం పోలీసులకు తెలిసింది. విషయం తెలుసుకున్న పోలీసులు తండ్రీ కొడుకులను అరెస్ట్ చేశారు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రం లో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళ్తే.. కర్ణాటక రాష్ట్రం లోని హనూర్ తాలూకా ఆనెగుండి గ్రామం లో ఎస్ బాలు (65), మహాలింగ (35) అనే తండ్రీ కొడుకులు నివసిస్తున్నారు.
Read also:Delhi Airport: ఢిల్లీలో పొగమంచు ఎఫెక్ట్.. విమానాల దారి మళ్లీంపు
Also Read
కాగా వారికి ఉన్న పొలంలో పసు పంటను సాగు చేస్తున్నారు. అయితే ఆ పసుపు చేను పేరుకు మాత్రమే పసుపు చేను. పసుపు ముసుగులో మాధకద్రవ్యాల పరిధి లోకి వచ్చే గంజాయి పంటను అక్రమంగా సాగు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అపరిచితులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. అనంతరం ఆ పొలం లోపల చూడగా పసుపు పంట మధ్యలో గంజాయి పంటను సాగు చేస్తున్నట్లు గుర్తించారు. దీనితో పోలీసులు ఆ తండ్రీ కొడుకులను అరెస్ట్ చేసి జ్యుడీషియల్ కస్టడీకి అప్పగించారు. కాగా పసుపు పంట మధ్యలో అక్రమంగా పెంచిన సుమారు 2 లక్షల విలువైన 95 గంజాయి మొక్కలను (34 కిలోలు) స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?