Hyderabad: కుటుంబ కలహాల కారణంగా మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళ్తే.. హైదరాబాద్ లోని రాయదుర్గం లోని ఉట్లకుంట ప్రాంతానికి చెందిన మహబూబ్‌బీ (రేష్మ) (32) కోతిగుట్టకు చెందిన సుకుమార్ ప్రేమ పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లి జరిగి 10 ఏళ్ళు కావొస్తుంది. ఈ దంపతులకు ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి ఉన్నారు. కాగా మొదట్లో సుకుమార్ గార్మెంట్స్ పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. అయితే గత కొంత కాలంగా సుకుమార్ మద్యానికి బానిసయ్యాడు. ఏ పని చెయ్యకుండా ఆకతాయిల తిరిగేవాడు. దీనితో కుటుంబారం మహబూబ్‌బీ పైన పడింది. ఈ నేపథ్యంలో కుటుంభ పోషణ కోసం మహబూబ్‌బీ ఇంట్లోనే గార్మెంట్స్ పని చేస్తూ వస్తుంది.
Read also:Ramcharan : చాముండేశ్వరి అమ్మవారిని దర్శించుకున్నగ్లోబల్ స్టార్..
ఈ క్రమంలో ఆదివారం ఉదయం బాధ్యత లేకుండా గాలికి తిరుగుతున్న భర్త సుకుమార్ ను మహబూబ్‌బీ నిలదీసింది. ఈ నేపథ్యంలో మాట మాట పెరిగి దంపతుల మధ్య గొడవ జరిగింది. అనంతరం సుకుమార్ బయటికి వెళ్ళిపోయాడు. ఈ నేపథ్యంలో క్షణికావేశంతో మహబూబ్‌బీ ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య యత్నం చేసింది. కాసేపటికి ఇంటికి వచ్చిన సుకుమార్ తన భార్య ఉరి వేసుకున్నట్లు గమనించాడు. వెంటనే హుటాహుటీన ఆసుపత్రికి తరలించేలోగా మహిళ మృతి చెందింది. దీనితో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అలానే పరీక్షల నిమిత్తం మృత దేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. కాగా తల్లి మరణంతో ఆమె పిల్లలు గుండెలవిసేలా రోదిస్తున్నారు.