బీజేపీ ఎంపీ జివిఎల్ నరసింహారావు ప్రవేశపెట్టిన తీర్మానంపై ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా సస్పెన్షన్‌ను రాజ్యసభ ఛైర్మన్ జగ్‌దీప్ ధంకర్ సోమవారం ఉపసంహరించుకున్నారు. దీంతో ఆయన మళ్లీ రాజ్యసభలో కనిపించనున్నారు. ఇప్పటివరకు ఆప్ ఎంపీ సస్పెన్షన్‌కు గురైనందుకు తగిన శిక్షగా పరిగణించాలని, ఈరోజు నుంచి రాఘవ్ చద్దా సస్పెన్షన్‌ను నిలిపివేయడాన్ని సభ పరిశీలించవచ్చని రాజ్యసభలో బీజేపీ ఎంపీ తెలిపారు.
Read Also: BRS Meeting: తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ పార్టీ మీటింగ్.. మాల్లారెడ్డి డుమ్మా..!
పార్లమెంటు నుండి తన సస్పెన్షన్‌ను రద్దు చేయడంపై ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా స్పందించారు. ఈ నిర్ణయంపై సంతోషాన్ని వ్యక్తం చేశారు. అంతేకాకుండా.. సుప్రీంకోర్టు, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధంఖర్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. 115 రోజుల సస్పెన్షన్‌లో మీ నుండి చాలా ప్రేమ, ఆశీర్వాదాలను పొందానని.. అంతేకాకుండా మీరంతా నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చారని ఆప్ ఎంపీ అన్నారు.
Read Also: CM YS Jagan: గ్రేట్ డేంజర్ దిశగా మిచౌంగ్ తీవ్ర తుఫాన్.. కలెక్టర్లతో సీఎం వీడియో కాన్ఫరెన్స్
కాగా.. ఢిల్లీ గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ (సవరణ) బిల్లు 2023ని పరిశీలించడానికి ప్రతిపాదిత సెలెక్ట్ కమిటీలో వారిని చేర్చాలని నిర్ణయించే ముందు కొంతమంది ఎంపీల నుండి అనుమతి తీసుకోలేదని రాఘవ్ చద్దా ఆరోపణలు చేశారు. దీంతో ఆగస్టు 11న అతన్ని పార్లమెంట్ నుండి నిరవధికంగా సస్పెండ్ చేశారు. ఈ క్రమంలో చద్దా.. సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. కానీ, అతని సస్పెన్షన్ ఏకపక్షం, చట్టవిరుద్దం అని పేర్కొంది.