Chennai Rains: చెన్నైలో మిచౌంగ్ తుఫాన్ బీభత్సం.. కొట్టుకుపోతున్న కార్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chennai: చెన్నైలో మిచౌంగ్ తుఫాన్ బీభత్సం సృష్టిస్తుంది. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలు జనజీవనాన్ని అతలాకుతంలం చేస్తున్నాయి. కురుస్తున్న భారీ వర్షాలకు పలు చోట్ల రోడ్ల పైన వరద నీరు చేరి ఉదృతంగా ప్రవహిస్తోంది. ఈ వరద నీటి ఉద్రిక్తతకు పలు చోట్ల పలు కార్లు కొట్టుకుపోయాయి. అలానే ఎయిర్‌పోర్టు రన్‌వేపైకి అధిక మొత్తంలో వరద చేరింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే 16 విమాన సర్వీసులను నిలిపివేశారు. ఈ విషయం పైన అధికారు మాట్లాడుతూ ఉద్రిక్తంగా మారిన తుఫాను కారణంగా ఎయిర్‌పోర్టులో విమానాల రాకపోకలను నిలిపివేసామని.. అలానే మరికొన్ని విమానాలను దారిమళ్లించామని అధికారులు తెలిపారు.
Read also:Telangana: తెలంగాణలో ప్రారంభమైన రాజీనామాల పర్వం..
Also Read
- Tamil Nadu: పొట్టి దుస్తుల వైరల్ వీడియోపై మహిళ ఆవేదన.. బాధ్యతగా ఉండాలని విజ్ఞప్తి
- Karnataka: ఆకస్మిక తనిఖీలో షాకింగ్ సీన్.. ఆస్పత్రి రూమ్‌లో ప్రియురాలితో అడ్డంగా బుక్కైన..!
- Arvind Kejriwal: ఆప్ గెలిస్తే 5 రోజుల్లో E20 పెట్రోల్ బ్యాన్.. కేజ్రీవాల్ హామీ..
- BJP: ‘‘మనుస్మృతి’’పై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు.. ‘‘హిజాబ్’’ వీడియోతో బీజేపీ కౌంటర్..
కాగా కురుస్తున్న భారీ వర్షాలకు కనతూరు ప్రాంతంలో ఓ గోడ కూలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు కూలిలు మృతిచెందారు. కాగా సోమవారం అర్ధరాత్రి వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. కాగా ప్రస్తుతం బీభత్సం సృష్టిస్తున్న వర్షాలకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా ఇప్పటికే కురుస్తున్న భారీ వర్షాలకు అప్రమత్తమైన చెన్నై ప్రభుత్వ యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా చర్యలను చేపట్టింది. పలు చోట్ల రైలు మార్గాలను మూసివేసింది. అలానే పలు రైళ్ల రాకపోకలను నిలిపివేసింది. అలానే ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలను ఏర్పాటు చేశారు. కాగా తాంబ్రం ప్రాంతంలో నీటిలో చిక్కుకొన్న 15 మందిని ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు రక్షించాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా చెన్నైలో పలు ప్రాంతాలు జలమయమైయ్యాయి. ఈ నేపధ్యంలో పాఠశాలలకు, నగరం లోని కోర్టులకు సెలవులు ఇచ్చినట్లు మద్రాస్ హైకోర్టు ప్రకటించింది.
తాజావార్తలు
-
Tamil Nadu: పొట్టి దుస్తుల వైరల్ వీడియోపై మహిళ ఆవేదన.. బాధ్యతగా ఉండాలని విజ్ఞప్తి
-
Healthy Snacks: నో జంక్.. ఓన్లీ హెల్తీ స్నాక్! ఒక్కసారి చేస్తే మళ్లీ మళ్లీ చేస్తారు..
-
Hyderabad Pan Masala Raid: హైదరాబాద్‌లో పాన్ మసాలా దందా.. రూ.160 కోట్ల స్కామ్..
-
Karnataka: ఆకస్మిక తనిఖీలో షాకింగ్ సీన్.. ఆస్పత్రి రూమ్‌లో ప్రియురాలితో అడ్డంగా బుక్కైన..!
-
Kishan Reddy: రేవంత్ అమెరికా టూర్ రద్దు.. కిషన్ రెడ్డి కౌంటర్..!
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్‌ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!