ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్ లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా.. బటిండాలో పంజాబ్ ప్రభుత్వం రూ.1125 కోట్ల విలువైన పథకాల శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. లోక్‌సభ ఎన్నికల్లో పంజాబ్‌లోని మొత్తం 13 సీట్లను ఆప్ కు ఇవ్వాలని అక్కడి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ పనిని చూసి పంజాబ్‌లో తమకు ఓటేశారని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. వచ్చేసారి 117 సీట్లలో 110కి పైగా ఆమ్ ఆది పార్టీకి సీట్లు వస్తాయని తన…
రేపు (సోమవారం) ఉదయం 11 గంటలకు టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం నిర్వహించానున్నారు. మానిక్ రావ్ ఠాక్రే అధ్యక్షతన గాంధీ భవన్ లో ఈ మీటింగ్ జరుగనుంది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు పాల్గొననున్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలకు అభినందన సభ పై చర్చ జరుగనున్నట్లు సమాచారం.. అంతేకాకుండా, పార్టీ సంస్థాగత నిర్మాణం పై చర్చించనున్నట్లు తెలుస్తోంది.
హైదరాబాద్ పాతబస్తీలో కెమికల్ బ్లాస్ట్ అయింది. ఈ ఘటనలో 60 సంవత్సరాల వృద్దుడు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే బండ్లగూడ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని.. వృద్ధుడి పరిస్థితి విషమంగా ఉండటంతో ఉస్మానియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ కార్యదర్శి నారా లోకేష్‌లపై తీవ్రంగా మండిపడ్డారు మంత్రి చెల్లుబోయిన వేణు. లోకేష్ పాదయాత్ర లావు తగ్గడానికేననని ఆయన విమర్శించారు. లోకేష్‌ది క్యాట్ వాక్ అని, లోకేష్ పాదయాత్ర వద్దని ఆ పార్టీ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడే చెప్పాడన్నారు. పాదయాత్రకే విలువలేదు, లోకేష్ రాసుకున్న ఎర్ర బుక్కు ఏం చేసుకుంటాడంటూ ఎద్దేవా చేశారు.
తనకు గెలుపు ఓటమి రెండు సమానమే అని సంగారెడ్డి మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. ఆయన ఎన్టీవీతో మాట్లాడుతూ.. గెలుపు కంటే ఓటమిని ఎక్కువ ఎంజాయ్ చేస్తానని తెలిపారు. చివరి రెండు రోజులే కాంగ్రెస్ సీట్లు తగ్గడానికి కారణమని అన్నారు. సంగారెడ్డి ప్రజల తీర్పు స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన బాగుందని చెప్పారు. అంతేకాకుండా.. కేబినెట్ లో సీనియర్లు అంతా సమర్థులేనని అన్నారు.
శబరిమలకు అయ్యప్ప దర్శనానికి వెళ్తూ.. అనంత లోకాలకు వెళ్లారు. స్వామి దర్శనం చేసుకోకుండానే.. మధ్యలోనే వారిని మృత్యువు వెంటాడింది. తమిళనాడులో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన అయ్యప్ప స్వాములు ముగ్గురు మృతి చెందారు.
రాష్ట్రంలో పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. 11 మందిని బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా.. విద్యాశాఖ, మున్సిపల్ శాఖ, హైదరాబాద్ వాటర్ వర్క్స్, మహిళా శిశుసంక్షేమం, ఆరోగ్యవాఖ, అటవీశాఖ, రోడ్లుభవనాల, రవాణాశాఖకు కొత్త కార్యదర్శులు వచ్చారు. విపత్తుల నిర్వహణశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్‌ను నియమించారు.
మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి సొంత నియోజకవర్గం మంథనికి వచ్చారు మంత్రి శ్రీధర్ బాబు. ఈ నేపథ్యంలో.. మంత్రికి కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ఆరు గ్యారంటీలపై అనుమానాలు వద్దు, ఆరు గ్యారంటీలని ఆరు నూరైనా అమలు చేస్తామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో రూపాయి లేకున్నా.. ఎక్కడికైనా పోయి తిరిగి రావచ్చు ఇది కదా మహిళ సాధికారత అని ఆయన అన్నారు
తన పార్ట్నర్కు మైనింగ్ లైసెన్స్ రెన్యువల్ కాకపోవడంతో ఆయనకు అండగా ఉండాలని భావించి సోమిరెడ్డి నిరసన చేస్తున్నారని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఎన్నికల సమయంలో ఫండ్ అవసరమని భావించే భాగస్థుడి కోసం హడావిడి చేస్తున్నారని ఆయన విమర్శించారు.
బీహార్ పోలీస్ సబార్డినేట్ సర్వీసెస్ కమీషన్ (BPSSC) 1,275 సబ్ ఇన్స్పెక్టర్ల పోస్టుల కోసం రిక్రూట్మెంట్ నిర్వహిస్తుంది. అందుకోసం ప్రిలిమినరీ పరీక్ష సమయంలో మోసాలను నిరోధించడానికి కృత్రిమ మేధస్సు (AI)-ఆధారిత వ్యవస్థను ఉపయోగిస్తుంది. ఆదివారం జరిగిన ప్రిలిమినరీ పరీక్షకు దాదాపు 6.60 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ పరీక్ష రెండు షిఫ్టుల్లో అంటే.. ఉదయం, మధ్యాహ్నం జరుగుతుంది.