* నేటి నుంచి కొత్త ఫీచర్లతో స్మార్ట్ ఆరోగ్య శ్రీ కార్డుల పంపిణీ.. ఇక నుంచి ఆరోగ్య శ్రీ కింద రూ. 25 లక్షల వరకు ఉచిత వైద్యం.. మధ్యాహ్నం 12 గంటలకు తాడేపల్లి క్యాంప్ కార్యాయలంలో లాంఛనంగా ప్రారంభం.. కార్డులో క్యూఆర్ కోడ్, లబ్దిదారుడి ఫోటో, ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డులో పొందుపరిచిన లబ్ధిదారుని ఆరోగ్యం వివరాలతో ఏబీహెచ్ఏ ఐడీ.. వైద్య, ఆరోగ్య సిబ్బందికి దిశానిర్థేశం చేయనున్న సీఎం జగన్..
* నేడు పీసీసీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ భేటీ.. నేటి ఉదయం 11 గంటలకు గాంధీ భవన్ లో ఎఫైర్స్ కమిటీ మీటింగ్.. సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర పార్టీ ఇంఛార్జ్ ఠాక్రేతో పాటు ముఖ్యనేతలంతా హాజరు.. ఎన్నికల ఫలితాలు, కొత్త ప్రభుత్వంలో నామినేటెడ్ పదవులు, ఎమ్మెల్సీ టికెట్లు, లోక్ సభ ఎన్నికలపై సమావేశం.. అసెంబ్లీ ఎన్నికల తర్వాత తొలి రాజకీయ భేటీ
* నేడు పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశంలో పాల్గొననున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఏఐసీసీ ఇంచార్జ్ మానిక్ రావ్ ఠాక్రే, కార్యదర్శులు రోహిత్ చౌదరి, విశ్వనాత్, మంత్రులు, ఎమ్మెల్యేలు..
* నేడు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సచివాలయంలో 5వ అంతస్తులో పదవి బాధ్యతలు స్వీకరణ..
* నేడు తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ డ్రాఫ్ట్ మల్టీ ఇయర్ టారిఫ్ రెగ్యులేషన్ పై ఉదయం 11.00 గంటలకు TSERC కోర్టు హాలులో పబ్లిక్ హియరింగ్.
* నేడు హైదరాబాద్ లో రాష్ట్రపతి పర్యటన.. రాష్ట్రపతి నిలయానికి రానున్న ద్రౌపది ముర్ము.. రాష్ట్రపతి రాకతో హైదరాబాద్ లో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు.. సా. 6.25 గంటలకు హకీంపేట వైమానిక దళ శిక్షణ కేంద్రానికి రాష్ట్రపతి.. అక్కడి నుంచి అల్వాల్, లోతుకుంట మీదుగా బొల్లారం నిలయానికి రాష్ట్రపతి..
* నేడు సింగరేణి ఎన్నికలపై ఉత్కంఠ.. ఎన్నికలను వాయిదా వేయాలని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో వేసిన పిటిషన్ పై విచారణ.. హైకోర్టు నిర్ణయంపై ఈ నెల 27న జరిగే ఎన్నిక ప్రక్రియపై ఉత్కంఠ..
* నేడు కళ్యాణదుర్గంలో పర్యటించనున్న మంత్రి ఉషశ్రీ చరణ్
* నేటి ఉదయం ఉదయం కృష్ణా జిల్లా మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకుని షష్టి మహోత్సవంలో పాల్గొననున్న మంత్రి కొట్టు సత్యనారాయణ.. ఇక, సాయంత్రం విశాఖపట్నంలోని శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని మార్గశిర మాసోత్సవాలకు హాజరు..
* నేడు చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్లపై హైకోర్టులో విచారణ.. ఇసుక పాలసీలో అక్రమాలు, ఐఆర్ఆర్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిసన్లు.. మధ్యాహ్నం లంచ్ బ్రేక్ తర్వాత విచారణ చేయనున్న ఏపీ హైకోర్టు..
* నేడు డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు ఉ.11.00 గం, అనకాపల్లి కలెక్టర్ లో జరగనున్న “అరోగ్య శ్రీ మెగా అవేర్నెస్” కార్యక్రమంలో పాల్గొంటారు..
* నేటితో ముగియనున్న యువగళం పాదయాత్ర.. గ్రేటర్ విశాఖ పరిధిలోని శివాజీనగర్ లో ముగింపు, పైలాన్ ఆవిష్కరణ..
* నేడు స్టీల్ ప్లాంట్ అడ్మిన్ బిల్డింగ్ ఎదుట కార్మిక సంఘాల ధర్నా.. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యాజమాన్యం జిందాల్ తో రహస్య ఒప్పందం బహిర్గతం చేయాలని డిమాండ్
* వారణాసిలో రెండో రోజు ప్రధాని నరేంవ్ర మోడీ పర్యటన.. పలు అభివృద్ది పనులకు మోడీ శంకుస్థాపన