హైదరాబాద్ కులుసుంపుర పోలీస్ స్టేషన్ పరిధిలో అనిల్ కుమార్ (35) అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. వ్యక్తిని గుర్తుపట్టకుండా పెట్రోల్ పోసి తగలబెట్టాడు నిందితుడు గోపి. హత్య చేసిన అనంతరం ఓ డస్ట్ బిన్ లో మృతదేహాన్ని నిప్పు పెట్టి తగలబెట్టాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీమ్ తో పరిశీలించి నిందితుడిని గుర్తించారు. ఈ హత్య కేసులో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
2024 సార్వత్రిక ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో.. పార్టీని సంస్థగతంగా బలోపేతం చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తుంది. ఎన్నికల సమాయత్తంపై ఈరోజు సమావేశం నిర్వహించనుంది కాంగ్రెస్ పార్టీ. ఈ క్రమంలో.. నేడు ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా.. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు, కీలక నాయకులు హాజరుకానున్నారు. పార్లమెంట్ ఎన్నికలు, అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ జరగనుంది.
మహబూబాబాద్ జిల్లా పొనుగోడులోని స్టోన్స్ క్రస్సర్లో అర్ధరాత్రి బాంబు బ్లాస్టింగ్ చేశారు. దీంతో.. గూడూరు మండలం పొనుగోడు గ్రామ శివారులోని రేణుక స్టోన్స్ క్రస్సర్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బ్లాస్టింగ్ తో తమ గ్రామానికి ప్రమాదం జరుగుతుందని రేణుక క్రస్సర్ యాజమాన్యాన్ని గాజులగట్టు గ్రామస్తులు అడ్డగించారు. బాంబు పేలుళ్ళకు ఒక్కసారిగా భయంతో ఇళ్లలో నుంచి గ్రామస్తులు రోడ్లపైకి పరుగులు తీశారు. అంతేకాకుండా.. భారీ పేలుళ్ళకు ఇళ్ల గోడలకు బీటలు, ప్రమాదకరంగా నెర్రలు పడ్డాయని ఆరోపిస్తున్నారు.
సింగరేణి సంస్థలో కాంట్రాక్టర్లు చేపట్టే పనుల్లో స్థానికులకే 80 శాతం కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు కల్పించాలని సింగరేణి డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం.. సింగరేణిలో స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో సింగరేణి డైరెక్టర్ బలరాం సర్క్యులర్ జారీ చేశారు. దీంతో.. ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కృషి ఫలించినట్లైంది.
మంత్రి కొండా సురేఖపై మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మంత్రి కొండా సురేఖ సెంట్రల్ జైలును ఎందుకు కూల్చారని అన్నారు.. జైలు శిథిలావస్థలో ఉన్నా తీరును గుర్తించి, దాన్ని కూల్చడం జరిగిందని వినయ్ భాస్కర్ తెలిపారు. ప్రాథమిక హక్కులైనటువంటి విద్య వైద్యాన్ని మెరుగుపరిచేందుకు గత ప్రభుత్వం పాఠశాలను, వైద్యశాలలను మెరుగుపరిచేందుకు అన్ని చర్యలు తీసుకుందని వినయ్ భాస్కర్ తెలిపారు. అందరికీ వైద్య సదుపాయం అందుబాటులో ఉండాలని సంకల్పంతో…
దేశ వ్యాప్తంగా కోవిడ్ కేసులు కలవరపెడుతున్నాయి. కరోనా సబ్ వెరియంట్ JN-1 ప్రపంచాన్ని వణికిస్తోంది. కేరళలో తిష్ట వేసిన వెరియంట్ అన్ని రాష్ట్రాల్లో వ్యాపిస్తుంది. తెలంగాణలోనూ కరోనా మహమ్మారి మళ్లీ ప్రవేశించింది. గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 6 కరోనా కేసులు నమోదయ్యాయి. 538 మందికి పరీక్షలు చేయగా ఆరుగురికి కరోనా వచ్చినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ఇంకా 42 మంది రిపోర్ట్స్ పెండింగ్ లో ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ కరోనా కేసులు హైదరాబాద్ లోనే వెలుగుచూశాయని…
అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై చర్చ సాగింది. అధికార, ప్రతిపక్షాల మధ్య హాట్ హాట్ గా చర్చలు జరిగాయి. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మాజీ మంత్రి హరీష్ రావుపై నిప్పులు చెరిగారు. ఇంకా హరీష్ మంత్రి అనుకుంటున్నారు.. మంత్రిలాగా వివరాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం మీద వివరాలు చెప్పాల్సిన బాధ్యత తమపై ఉందని అన్నారు. 1.34 లక్షల కోట్లకు టెండర్లు పిలిచారు.. లక్ష కోట్లు ఖర్చు పెట్టినా…
దేశంలో వేగంగా విస్తరిస్తున్న కరోనా కొత్త వేరియంట్ JN -1 మహమ్మారి కట్టడిపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్ సుఖ్ మాండవీయ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని రాష్ట్రాల వైద్య, ఆరోగ్య శాఖ మంత్రులతో ఉన్నత స్థాయి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్లో తెలంగాణ వైద్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కరోనా కొత్త వేరియంట్ JN - 1 మహమ్మారి కట్టడి పై తీసుకుంటున్న ముందస్తు చర్యలను మంత్రి…
2024 జనవరిలో శ్రీరామ జన్మభూమి అయోధ్య రామమందిరం విగ్రహప్రతిష్టాపన కార్యక్రమం జరగనుంది. ఈ వేడుకను కళ్లారా చూడటం కోసం ఎంతో మంది భక్తులు ఎదురుచూస్తున్నారు. ఇదిలాఉంటే.. అయోధ్యకు తెలంగాణ నుండి బీజేపీ ప్రత్యేక రైళ్లను నడపాలని చూస్తోంది. ప్రతి లోక్ సభ నియోజక వర్గం నుండి ఒక ట్రైన్ నడపనున్నట్లు తెలుస్తోంది. అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం తర్వాత ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం నుండి ఒక రైలులో భక్తులను పంపించాలని బీజేపీ నిర్ణయం తీసుకోనుంది. అందుకు రాష్ట్ర బీజేపీ…
రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం మత సామరస్యాన్ని కాపాడుతుందని మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు. సచివాలయంలో క్రిష్టియన్ ఎంప్లాయిస్ అసోసియన్ ఆధ్వర్యంలో బుధవారం క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. లోక రక్షకుడైన ఏసుక్రీస్తు జన్మదినాన్ని క్రిస్మస్ పండుగను ప్రపంచవ్యాప్తంగా ఎంతో సంతోషంగా, ఆనందంగా జరుపుకునే పండుగని అన్నారు. విద్య, వైద్య రంగాలలో కొనియాడదగిన సేవలను క్రైస్తవులు…