సింగరేణి సంస్థలో కాంట్రాక్టర్లు చేపట్టే పనుల్లో స్థానికులకే 80 శాతం కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు కల్పించాలని సింగరేణి డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం.. సింగరేణిలో స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో సింగరేణి డైరెక్టర్ బలరాం సర్క్యులర్ జారీ చేశారు. దీంతో.. ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కృషి ఫలించినట్లైంది.
Read Also: Swiggy Trends 2023 : 2023లో స్విగ్గిలో రూ. 12 లక్షల ఆర్డర్స్ చేసిన ఢిల్లీ వ్యక్తి.. ఏం కొన్నాడంటే?
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివేక్ మాట్లాడుతూ.. సీఎం ఆదేశాల మేరకు మైనింగ్ మరియు పవర్ ప్లాంట్‌లో ఔట్ సోర్సింగ్ కాంట్రాక్టులన్నింటిలో 80 శాతం స్థానికులకే ఉద్యోగాలివ్వాలని సింగరేణి ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో నేను చేసిన వాగ్దానాలలో ఇది ఒకటి అన్నారు. తగు సూచనలు ఇచ్చినందుకు సీఎంకు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు వివేక్ వెంకట స్వామి పేర్కొన్నారు.
Read Also: Akkineni Naga Chaitanya: ఓర్నీ.. సడెన్ గా చూసి పుష్ప గాడు అనుకున్నామే