అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై చర్చ సాగింది. అధికార, ప్రతిపక్షాల మధ్య హాట్ హాట్ గా చర్చలు జరిగాయి. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మాజీ మంత్రి హరీష్ రావుపై నిప్పులు చెరిగారు. ఇంకా హరీష్ మంత్రి అనుకుంటున్నారు.. మంత్రిలాగా వివరాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం మీద వివరాలు చెప్పాల్సిన బాధ్యత తమపై ఉందని అన్నారు. 1.34 లక్షల కోట్లకు టెండర్లు పిలిచారు.. లక్ష కోట్లు ఖర్చు పెట్టినా లక్ష ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేదని సీఎం తెలిపారు. సత్యహరిచంద్రుడు లెక్క హరీష్ మట్లాడుతున్నారని విమర్శించారు. తప్పు ఒప్పుకుని.. క్షమించండి అని అంటే హుందాగా ఉండేదని సీఎం తెలిపారు. తాము కూడపెట్టిన సంపద అడ్డుపెట్టుకుని.. తనకా పెట్టారని సీఎం మండిపడ్డారు.
INDIA bloc: “ఇండియా కూటమి సమావేశంలో సమోసాలు కూడా లేవు”.. కాంగ్రెస్‌పై ఎంపీ విమర్శలు..
రూ.13 లక్షల 72 కోట్లు గత ప్రభుత్వం ఖర్చు చేసిందని సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇవ్వలేదు.. దళితులకు మూడు ఎకరాల ఇవ్వలేదు.. రాజీవ్ ఆరోగ్య శ్రీకి నిధులు ఇవ్వలేదని దుయ్యబట్టారు. హాస్టల్ లో వంట చేసే వాళ్లకు కూడా జీతభత్యాలు ఇవ్వలేదని అన్నారు. ఉద్యోగులకు మొదట రోజు జీతాలు వెయ్యలేదు ఎందుకని సీఎం ప్రశ్నించారు. పెన్షన్ ఇచ్చి పెద్ద కొడుకుని అన్నాడు కేసీఆర్.. కానీ వాళ్లకు కూడా నెల నెల పెన్షన్ ఇవ్వలేదని పేర్కొన్నారు.
CM YS Jagan: 8వ తరగతి విద్యార్థులకు గుడ్‌న్యూస్.. రేపే సీఎం చేతులమీదుగా ఉచితంగా ట్యాబ్‌లు
ఓఆర్ఆర్ మేము సృష్టిస్తే.. వీళ్ళు అమ్ముకున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. వైన్ షాప్ టెండర్ కూడా నాలుగు నెలల ముందు పిలిచాడని తెలిపారు. వచ్చేటోడు.. నిలబడే పరిస్థితి కూడా లేకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చెప్తే సిగ్గు పోతుంది అంటున్నారు.. ఊరుకుంటే ప్రాణాలు పోతాయని ముఖ్యమంత్రి తెలిపారు. వెట్టిచాకిరి నిషేదించాం.. బీఆర్ఎస్ వాళ్లకు కూడా స్వేచ్ఛ ఇస్తున్నామని ఈ సందర్భంగా సభలో అన్నారు.