జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ జిల్లాలో గురువారం భారీ ఆయుధాలతో ఉగ్రవాదులు రెండు ఆర్మీ వాహనాలపై మెరుపుదాడి చేయడంతో ఐదుగురు సైనికులు మరణించగా.. ఇద్దరు గాయపడినట్లు అధికారులు తెలిపారు. మధ్యాహ్నం 3:45 గంటలకు ధేరా కీ గలీ, బుఫ్లియాజ్ మధ్య ధాత్యార్ మోర్ వద్ద ఈ దాడి జరిగిందని అధికారులు తెలిపారు.
ఏపీలో ఎన్నికల ప్రక్రియ మొదలుపెట్టేందుకు కేంద్ర ఎన్నికల సంఘం శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో సీఈసీ అధికారుల బృందం రాష్ట్రానికి విచ్చేసింది. ఏపీలో ఎన్నికల సన్నద్ధత, ఓటర్ జాబితా సవరణ-2024తో పాటు రాబోయే శాసనసభ, లోక్సభ ఎన్నికల సన్నద్ధత తదితర అంశాలపై రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో నేడు, రేపు సమీక్ష నిర్వహించనుంది.
పార్లమెంట్ నుంచి 146 మంది పార్లమెంట్ సభ్యులను స్పీకర్ ఓంబిర్లా సస్పెండ్ చేశారు. దీంతో ఎంపీలను సస్పెండ్ చేయడాన్ని ఖండిస్తూ ఇండియా కూటమి పిలుపు మేరకు ఇవాళ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వామపక్షాలు, కాంగ్రెస్, ఆమ్ఆద్మీ పార్టీలు ప్రకటించాయి.
వైకుంఠ ఏకాదశి కోసం టీటీడీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రేపటి నుంచి జనవరి 1 వరకు వైకుంఠ ద్వార దర్శనం చేసుకునేందుకు భక్తులకు అనుమతిస్తారు. వైకుంఠ ద్వార దర్శనం కోసం నేటి మధ్యాహ్నం 2గంటల నుంచి వైకుంఠ ద్వార దర్శనం టోకెన్లు కేటాయించాలని టీటీడీ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడి వేడీగా కొనసాగుతున్నాయి. విద్యుత్ అప్పులపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ క్రమంలో కాంగ్రెస్, ఎంఐంఎం మధ్య రచ్చ జరుగుతోంది. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. మొదటిసారి వచ్చిన సభ్యుడు పొరపాటుగా మాట్లాడితే.. అలా కాదు అని చెప్పాలి.. కానీ అక్బరుద్దీన్.. వ్యాఖ్యలు సరికాదని భట్టి విక్రమార్క తెలిపారు. భాష, విషయం ఉందని సభానాయకుడిపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం సరికాదని అన్నారు.
రెండేళ్లకు ముందు ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా మహమ్మరి ఇప్పుడు కొత్త వేరియంట్ లతో భయపెడుతుంది. పలు రకాల వేరియంట్లతో తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. మొదటగా కేరళలలో మొదలైన కొత్త వేరియంట్ జేఎన్ 1.. ఇప్పుడు అన్ని రాష్ట్రాలకు వ్యాపిస్తుంది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అలర్ట్ అయ్యాయి. తప్పనిసరిగా కొవిడ్ ఆంక్షలు పాటించాలని ప్రభుత్వాలు పేర్కొంటున్నాయి. కొత్త వేరియంట్ పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచిస్తు్న్నాయి.
లోన్ యాప్ వేధింపులు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. తమ వద్ద నుంచి తీసుకున్న రుణాలు తిరిగి ఇవ్వడం లేదని.. వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకొని, మార్ఫింగ్ ఫోటోలతో బెదిరింపులకు పాల్పడుతూనే ఉన్నారు. దీంతో.. బాధితులు అవమానంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తాజాగా.. హైదరాబాద్ లో లోన్ యాప్ వేధింపులతో ఓ యువకుడు బలయ్యాడు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా విద్యుత్ పై స్వల్పకాలిక చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం సాగుతుంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఇరు పక్షాలకు సూచించారు. సభ హుందాతనం కాపాడండి అని తెలిపారు. కొత్త సభ్యులు నేర్చుకోవాలని అన్నారు. వ్యక్తిగత దూషణలు వద్దు.. మేము, వాళ్ళు ఇద్దరు వ్యక్తి గత దూషణలు వద్దని పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మరోవైపు.. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్…