శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి సెప్టెంబర్ 2న విజయవంతంగా ప్రయోగించిన ఆదిత్య ఎల్1 మిషన్పై ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ కీలక అప్డేట్ ఇచ్చారు. భారతదేశపు తొలి సోలార్ మిషన్ ఆదిత్య-ఎల్1 జనవరి 6న భూమికి 1.5 మిలియన్ కిమీ దూరంలో ఉన్న లాగ్రాంజియన్ పాయింట్ (ఎల్1) గమ్యస్థానానికి చేరుకుంటుందని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చైర్మన్ ఎస్ సోమనాథ్ తెలిపారు.
ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు సీఎం జగన్ కడప జిల్లాలో పర్యటించనున్నారు. పలు అభివృద్ది పనుల ప్రారంభోత్సవం, శంకుస్ధాపనలు చేయనున్నారు. క్రిస్మస్ వేడుకల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాల్గొననున్నారు.
తిరుమలలో ముక్కోటి ఏకాదశి నేపథ్యంలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. శ్రీవారి వైకుంఠ ద్వారాలు తెరచుకున్నాయి. శనివారం వేకువజామున 1.30 గంటలకు ఆలయ అర్చకులు శాస్త్రోక్తం శ్రీవారి ఆలయానికి ప్రక్కనే ఉన్న వైకుంఠ ద్వారాన్ని తెరిచారు. ముందుగా శ్రీనివాసుడికి నిత్య కైంకర్యాలు, తిరుప్పావై పఠనం చేసిన తర్వాత భక్తులను వైకుంఠ ద్వారం గుండా శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనానికి టీటీడీ అధికారులు అనుమతించారు.
అనంతపురం జిల్లా గార్లదిన్నే మండలం కల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు, ట్రాక్టర్ ఢీకొన్న ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. శనివారం తెల్లవారుజామున బియ్యం లోడుతో వెళ్తు ట్రాక్టర్ను ప్రైవేట్ బస్సు ఢీకొట్టగా.. ట్రాక్టర్లో ఉన్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు.
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ 'జై భారత్ నేషనల్ పార్టీ' పేరిట కొత్త పార్టీని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది ఒక చీకటి రోజుగా గుర్తిస్తున్నానని ఆయన వ్యాఖ్యానించారు.
Terrorists Attack: జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ జిల్లాలో గురువారం భారీ ఆయుధాలతో ఉగ్రవాదులు రెండు ఆర్మీ వాహనాలపై మెరుపుదాడి చేయడంతో ఐదుగురు సైనికులు మరణించగా.. ఇద్దరు గాయపడినట్లు అధికారులు తెలిపారు. మధ్యాహ్నం 3:45 గంటలకు ధేరా కీ గలీ, బుఫ్లియాజ్ మధ్య ధాత్యార్ మోర్ వద్ద ఈ దాడి జరిగిందని అధికారులు తెలిపారు.