Mukkoti Ekadasi: నేడు ముక్కోటి ఏకాదశి.. ఉత్తర ద్వార దర్శనం రహస్యం గురించి తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mukkoti Ekadasi: మార్గశిర మాసం ఆ శ్రీ మహా విష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది. ఈ నెల మధ్యలోనే ధనుర్మాసం ప్రారంభమవుతుంది. శ్రీరంగనాథునిగా అవతరించిన శ్రీహరిని గోదాదేవి ధనుర్మాసంలో భక్తితో పూజించి తన భర్తగా పొందింది. రోజు ఆ శ్రీనివాసుడిని గోదాదేవి స్తుతించి ఆయనను ప్రసన్నంగా చేసుకుంది. ఇక, పుష్యమాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు. ఈ రోజున ఉత్తర ద్వారంలో శ్రీవారిని దర్శించుకోవాలని భక్తులు ఆరాటపడతారు. ఏడాదికి వచ్చే ఇరవైనాలుగు ఏకాదశుల్లో ప్రతిదీ పవిత్రమైందే. కానీ, వీటిలో వైకుంఠ ఏకాదశి మాత్రం లేదు. ఎందుకంటే మిగతా ఏకాదశులు చంద్రమానం ప్రకారం లెక్కిస్తే.. వాటికి భిన్నంగా సౌరమానం ప్రకారం దీన్ని లెక్కిస్తారు. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు.
Read Also: Vaikunta Ekadasi: తెలుగు రాష్ట్రాల్లో ముక్కోటి ఏకాదశి శోభ.. వైష్ణవ ఆలయాల్లో భక్తుల రద్దీ
Also Read
- IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
- Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
ఇక, వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు. ఈ పేర్ల వెనుక వేర్వేరు కథలు పురాణాల్లో వినిపిస్తాయి. అయితే, శ్రీమహావిష్ణువునకు నెల వైన వైకుంఠంలోని వాకిళ్లు ఈరోజు తెరుచుకుంటాయి.. కాబట్టి దీన్ని వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు.. దక్షిణాయనం ప్రారంభం ఆషాడ శుద్ధ ఏకాదశి నాడు పాల కడలిలో యోగనిద్రపోయి.. కార్తీక శుద్ధ ఏకాదశి రోజు మేల్కొంటారు.. దీంతో ఇలా మేల్కొన్న స్వామిని దర్శించుకోవడానికి పుష్యమాస శుక్లపక్ష ఏకాదశి నాడు ముక్కోటి దేవతలూ వైకుంఠానికి చేరుకుంటారు.. అందుకే దీనికి ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు. దక్షిణాయణంలో చనిపోయిన పుణ్యాత్ములకు ఈ రోజునే స్వర్గంలోకి ప్రవేశించే ఛాన్స్ కల్పిస్తారు కాబట్టి స్వర్గద్వార ఏకాదశి అని కూడా పిలుస్తారు.
కృతయుగంలో ముర అనే రాక్షసుడు దేవతలను, బుుషులను, ప్రజలను పట్టిపీడిస్తూ క్రూరంగా హింసించేవాడు. ముర అకృత్యాలను భరించలేని దేవతలు శ్రీహరికి తమ గోడు చెప్పుకోవడంతో.. మురాసురుని సంహరించడానికి శ్రీమహావిష్ణువు వెళ్తాడు.. అయితే, తనను చంపేందుకు శ్రీవారు వస్తున్న విషయం తెలిసిన మురాసురుడు సుముద్రంగర్భంలోకి వెళ్లి దాక్కుంటాడు. అతడిని బయటికి రప్పించేందుకు శ్రీనివాసుడు ఓ గుహలోకి వెళ్లి నిద్రపోతున్నట్లు నటిస్తాడు. దీంతో శ్రీహరిపై దాడికి ఇదే మంచి సమయంగా భావించిన మురాసురుడు గుహలోకి ప్రవేశించి స్వామిని వధించేందుకు కత్తి దూయగానే ఒక శక్తి ఉద్భవించి మురను సంహరిస్తుంది. ఈ విధంగా దేవతలను సంరక్షించిన ఆ శక్తికే ఏకాదశి అని నామకరణం చేశారు అనే నానుడి కూడా ఉంది.
వైష్ణవ ఆళ్వారులలో ప్రసిద్ధి చెందిన శ్రీనమ్మాళ్వారు కూడా ముక్కోటి ఏకాదశినాడే శివైక్యం చెందాడని చెబుతుంటారు. శ్రీ నమ్మాళ్వారులకు ఈ రోజునే విష్ణులోకం ప్రాప్తించడంతో శ్రీ వైష్ణవులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఏకాదశ వ్రతమాచరిస్తారు. ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రాలతో పాటు తిరుమల శ్రీవారి ఆలయంలోనూ ప్రాత:కాలం నుంచే ప్రత్యేక ఉత్తర ద్వారం తెరుచుకున్నాయి. దీనికి వైకుంఠ ద్వారమని ప్రతీతి. సూర్యుడు ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశానికి ఉత్తర ద్వారం శుభ సంకేతం. ముక్కోటి ఏకాదశి నాడు తెల్లవారుజాము నుంచే వైష్ణవ ఆలయాల్లో ఉత్తర ద్వారం గుండా స్వామి దర్శనం కోసం భక్తులు వేచి ఉంటారు.
అసలు ఉత్తర ద్వారం నుంచి ఎందుకు దర్శించుకోవాలంటే.. పురాణాల ప్రకారం.. మధుకైటభులు అనే ఇద్దరు రాక్షసులతో విష్ణువు యుద్ధం చేస్తారు. కానీ గెలవలేని పరిస్థితి వస్తుంది. అప్పుడు మీకు ఏం వరం కావాలో కోరుకోమని స్వామి వారిని కోరతారు. వారు గర్వంతో.. మాకు నువ్వు వరం ఇచ్చేదేంటి.. మేమే నీకు ఇస్తాం, కోరుకో అంటారు. దాంతో స్వామి వారిద్దరినీ తన చేతిలో చనిపోవాల్సిందిగా వరం కోరతారు. అందుకు ఆ రాక్షసులు ఒప్పుకొని చనిపోతారు. అలా మాట నిలబెట్టుకున్నందుకు వారిని స్వామి.. ఉత్తర ద్వారం ద్వారా వైకుంఠధామంలోకి పంపిస్తారు. అలా లోపలికి వెళ్లిన వారు మంచివారిగా మారిపోతారు. దాంతో తమకు కలిగిన భాగ్యాన్ని అందరికీ కల్పించాలని ఆ రాక్షసులు కోరతారు. అందుకు స్వామి ఒప్పుకుంటారు. ఉత్తర ద్వారం నుంచి విష్ణులోకానికి వెళ్లి మధుకైటభులు ఎలాగైతే మారిపోయారో అలా ఉత్తర ద్వారం ద్వారా ఇవాళ శ్రీమన్నారాయనుణ్ని దర్శించుకున్న వారికి కూడా ఇహలోకంలో సర్వ సంపదలు, పరలోక మోక్షప్రాప్తి లభిస్తుందని పండితులు వెల్లడించారు.
తాజావార్తలు
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Jio AI Glasses: కళ్లజోడుతోనే UPI పేమెంట్స్.. లైవ్ క్రికెట్ కామెంటరీ కూడా!
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Trump vs Zelenskyy: జెలెన్స్కీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. ఉక్రెయిన్ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటూ సూచన!
-
PM Modi Chennai Visit Today: నేడు చెన్నైలో ప్రధాని మోడీ పర్యటన.. రూ.13,000 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం!
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!