కొవిడ్ కొత్త వేరియంట్‌పై క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్ జగన్ సమీక్ష నిర్వహించారు. కొవిడ్ కొత్త వేరియంట్ జేఎన్–1 విస్తరిస్తుందన్న సమాచారం నేపథ్యంలో సమీక్షించారు. జేఎన్–1 వేరియంట్‌పై పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు సీఎంకు చెప్పారు.
లోకేష్‌ను అరెస్ట్ చేయటానికి అనుమతి ఇవ్వాలంటూ ఏసీబీ కోర్టులో ఏపీ సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. 41ఏ నోటీసులో ఉన్న నిబంధనలను లోకేష్ ఉల్లంఘించినట్టు పిటిషన్లో సీఐడీ పేర్కొంది. చంద్రబాబు కేసుల్లో దర్యాప్తు అధికారులను రెడ్ బుక్ పేరుతో లోకేష్ బెదిరిస్తున్నారని సీఐడీ తెలిపింది.
మాజీ మంత్రి, కాపు సంక్షే సేన అధ్యక్షుడు హరిరామ జోగయ్య జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌కు బహిరంగ లేఖ రాశారు. చంద్రబాబే కాబోయే ముఖ్యమంత్రి.. ఈ నిర్ణయంలో రెండో మాటలేదు.. "అనుభవస్తుని నాయకత్వమే ఈరాష్ట్రానికి కావాలి" అని పవన్ కళ్యాన్ అనేక సార్లు ప్రకటించారు.. కనుక అందరి మాట ఇదే అంటూ" లోకేష్ ప్రకటించేశారని ఆయన లేఖలో తెలిపారు.
నంద్యాలలో దారుణ హత్య జరిగింది. ఒంటరిగా ఉన్న ఓ రిటైర్డు టీచర్‌ను దోపిడీ దొంగలు దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన నంద్యాలలోని హౌసింగ్ బోర్డు కాలనీలో చోటుచేసుకుంది. గ్లాడిస్ అనే రిటైర్డ్ టీచర్‌ను దోపిడీ దొంగలు పాశవికంగా హత్య చేశారు.
వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమలకు వీఐపీలు క్యూ కడుతున్నారు. సుప్రింకోర్టు నుంచి 7 మంది, ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి 35 మంది న్యాయమూర్తులు వస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే తిరుమలకు ఏపీకి చెందిన ముగ్గురు మంత్రులు, ఏపీ అసెంబ్లీ డిప్యూటి స్పీకర్ చేరుకున్నారు.
క్రిస్మస్, నూతన సంవత్సరానికి ముందు వ్యాపార వినియోగదారులకు గుడ్ న్యూ్స్.. వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల ధరలను కంపెనీలు తగ్గించాయి. ఇవాళ్టి నుంచి కంపెనీలు 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను రూ.39.50 తగ్గించాయి.
ఏపీలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఎమ్మెల్యేలు తమ నియోజక వర్గాల్లో సమీక్షలు నిర్వహిస్తున్నారు. స్థానికంగా ఉన్న సమస్యలపై ఆరా తీస్తున్నారు. టీడీపీ నేత నందమూరి బాలకృష్ణ కూడా తమ నియోజకవర్గంలో పర్యటించనున్నారు.
వచ్చే ఏడాది జనవరి 26న జరిగే రిపబ్లిక్ డే వేడుకలకు ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారని సమాచారం. ఇప్పటికే ఇండియా ఫ్రాన్స్ అధ్యక్షుడికి ఆహ్వానం పంపింది. భారత ప్రభుత్వం అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించగా.. ఆయన కొన్ని కారణాల వల్ల హాజరు కాలేకపోతున్నారు.
భారత్‌లో క్రియాశీల కొవిడ్ కేసులు శుక్రవారం 3 వేల మార్క్‌కు చేరుకున్నాయి. అయితే సబ్-వేరియంట్ JN-1 మొదటి కేసును గుర్తించిన తర్వాత కేసుల ఆకస్మిక పెరుగుదల మధ్య కేరళలో ఒక మరణం నమోదైందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా చూపించింది. మంత్రిత్వ శాఖ ప్రకారం.. క్రియాశీల కేసులు నిన్న 2,669 ఉండగా.. నేటికి 2,997కి పెరిగాయి.
శ్రీశైలం ఆలయంలో అభిషేకాలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. శ్రీశైలం ఆలయంలో రేపటి నుంచి మూడు రోజులపాటు ఆర్జిత అభిషేకాలు నిలిపివేయనున్నట్లు దేవస్థానం ఈవో డి.పెద్దిరాజు వెల్లడించారు.