ఆయన పాటలు చిరంజీవులు.. బీజేపీ నేతల సంతాపం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ సినీ గేయ రచయిత, పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి హఠాన్ రణంపట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. సీతారామశాస్త్రి మరణం రాష్ట్ర ప్రజలకు, సినీ పరిశ్రమకు తీరని లోటు. సీతారామశాస్త్రి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.దాదాపు 3 వేల పాటలు రచించిన సీతారామశాస్త్రి ఉత్తమ పాటల రచయితగా 11 నంది అవార్డులు, 4 ఫిల్మ్ ఫేర్ అవార్డులు సాధించిన గొప్ప రచయిత. తెల్లారింది లెగండోయ్…. నిగ్గదీసి అడుగు…ఇంటి పేరు కాదుర గాంధీ, ఆదిభిక్షువు వాడిని ఏది అడిగేది, తరలిరాద తనే వసంతం…ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్లు… అంటూ ఆయన రాసిన ఎన్నో పాటలు ప్రజల మనుసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి.
సీతారామశాస్త్రి రాసిన ప్రతి పాట ప్రజల మనసును దోచుకునేలా ఉండటం విశేషం. సీతారామశాస్త్రి మన మధ్య భౌతికంగా లేకపోయినా పాటల రూపంలో చిరస్థాయిగా ప్రజల మనసుల్లో నిలిచిపోయారని తీవ్ర విచారం వ్యక్తం చేశారు బండి సంజయ్.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
- Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
- RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
తెలుగు సామ్రాజ్యం ఒక గొప్ప కవిని కోల్పోయిందని మహారాష్ట్ర మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు విచారం వ్యక్తం చేశారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి తనను తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది . వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని , వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు విద్యాసాగర్ రావు. ఆ భగవంతుడు కుటుంబ సభ్యులకు మనో ధైర్యాన్ని ఇవ్వాలని కోరారు.
కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి ప్రకటన విడుదల చేశారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణించారన్న వార్త తీవ్ర దిగ్భ్రాంతి కి గురిచేసింది. నాకు ఎంతో ఆత్మీయులు. సిరివెన్నెల సినిమా తన ఇంటి పేరుగా మార్చింది. సిరివెన్నెల లోని పాటలు తెలుగు సినిమా చరిత్రలో తెలుగు ప్రజలకు గుర్తుండిపోయే పాటలు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను తన గేయాల ద్వారా దేశ విదేశాల్లో ఉన్న తెలుగువారి గొప్పతనాన్ని చాటిచెప్పిన వ్యక్తి. 1997లో బిజెపి జాతీయ యువ మోర్చా ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడు వారికి జాతీయస్థాయిలో యువ మోర్చా ఆధ్వర్యంలో యువ కళాకారుడిగా అవార్డును అటల్ బిహారీ వాజ్ పేయి చేతుల మీదుగా అందించడం జరిగింది. వారితో అనేక సందర్భాల్లో వివిధ అంశాలపై చర్చించడం జరిగింది.
భారతమాత మహా హారతి కార్యక్రమం లో వారు పాల్గొనడం దేశ ఔన్నత్యాన్ని గురించి ప్రజలకు వివరిస్తున్నప్పుడు ప్రజలు ఎంతో శ్రద్ధగా విన్నారు. వారి పాటల ద్వారా తెలుగు సంస్కృతిని సాంప్రదాయాలను వివరించడంతో పాటు దేశభక్తిని,దైవ భక్తి ని ,ప్రబోధించడం ద్వారా ఒక మంచి వ్యక్తులుగా ప్రధానంగా యువత క్రమశిక్షణ కలిగి మంచి పౌరులుగా నడిచే విధంగా ఉండేది. సినీరంగంలో అనేక అవార్డులను, నంది అవార్డులను, పద్మశ్రీ పొందిన వ్యక్తి.ఆయన మృతి పట్ల వారి కుటుంబ సభ్యులకు వారి అభిమానులకు ప్రగాఢ సంతాపాన్ని సానుభూతిని తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నా అన్నారు కిషన్ రెడ్డి.
తాజావార్తలు
-
Komaki MG-Pro+ Electric Scooter: రూ.85,999కే 150+KM రేంజ్.. 4 వేరియంట్లతో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అదిరింది!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
ట్రెండింగ్
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..