ఇటీవల సోషల్ మీడియాలో టీడీపీ పొలిటికల్ వింగ్ పెట్టిన పోస్ట్ వివాదానికి కారణమైంది. ఆర్టీసీ బస్సుపై టార్పాలిన్ కవర్ వేసి తరలిస్తుండగా టీడీపీ ఫోటో తీసి ట్రోల్ చేసింది. ప్రభుత్వానికి బయట అప్పు పుట్టడం లేదని ఆర్టీసీ బస్సులను ఇసుక లారీల్లాగా గానీ వాడేస్తున్నారేంట్రా..? అంటూ బ్రహ్మానందం పిక్‌తో మీమ్‌ను టీడీపీ పొలిటికల్ వింగ్ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. అంతేకాకుండా ఆర్టీసీ బస్సు రూఫ్ ధ్వంసం కావడంతో బాగుచేయించే స్తోమత లేక ఇలా వాడుతున్నారా అనే…
అమరావతిపై హైకోర్టు తీర్పు తర్వాత అక్కడ అభివృద్ధి పనుల కోసమంటూ భూములను ఎకరా రూ.10 కోట్ల చొప్పున అమ్మేందుకు వైసీపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మరోసారి విమర్శలు చేశారు. రాజధాని అమరావతిని ఆనాడు స్మశానం అని ప్రచారం చేసి ఈరోజు ఎకరం భూమి రూ.10 కోట్లకు ఎలా అమ్మకానికి పెట్టారని వైసీపీ నేతలను లోకేష్ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతికి…
ఆత్మకూరు ఉపఎన్నికలో వైసీపీకి భారీ మెజారిటీ రావడంపై మంత్రి అంబటి రాంబాబు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడుతూ.. ఆత్మకూరులో టీడీపీ పోటీలో లేకున్నా కుట్రలు చేసిందని ఆరోపించారు. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో చంద్రబాబు, లోకేష్ బ్లాక్ మెయిల్ చేసే ప్రయత్నం చేశారని.. బద్వేలులో జరిగిన ఉప ఎన్నికలో టీడీపీ నేతలే బీజేపీ ఏజెంట్లుగా ఉన్నారని అంబటి రాంబాబు విమర్శలు చేశారు. గత మూడేళ్లలో జరిగిన ఉప ఎన్నికల…
టీడీపీపై మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఆర్ధికపరమైన అంశాల్లో మాజీ మంత్రి యనమల తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ఆర్ధిక నిర్వహణ చక్కగా చేశారంటూ ఏపీ ప్రభుత్వాన్ని కాగ్ ప్రశంసించిందని బుగ్గన గుర్తుచేశారు. బడ్జెట్ అంచనాలకంటే తక్కువగానే అప్పులు చేశారని ఏపీని ఉద్దేశించి కాగ్ ప్రస్తావించిందన్నారు. దేశంలోనే ఆర్ధిక నిర్వహణ చక్కగా చేస్తోన్న రాష్ట్రాల్లో ఏపీ అగ్రభాగంలో ఉందన్నారు. వాస్తవాలు ఇలా ఉంటే యనమల రాంగ్…
పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గంలో గురువారం సాయంత్రం టీడీపీ నేత నారా లోకేష్ పర్యటించారు. బొల్లాపల్లి మండలం రావులాపురంలో హత్యకు గురైన టీడీపీ కార్యకర్త జల్లయ్య కుటుంబాన్ని లోకేష్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన టీడీపీ శ్రేణులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. కారు ముందు భాగంలో కూర్చుని అభిమానులకు లోకేష్ అభివాదాలు చేశారు. అనంతరం లోకేష్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చారు. తమ కార్యకర్తలను హత్య చేస్తే భయపడతామని జగన్ మాఫియా రెడ్డి భ్రమపడుతున్నారని ఆరోపించారు.…
వైసీపీ ప్రభుత్వంపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఇంటిని కూల్చడం బలహీనవర్గాలపై దాడేనని ఆరోపించారు. ఈ అంశంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన అధికారులను వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు. జగన్ అవినీతిని ప్రశ్నించిన వారిపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. అసలు జగన్‌కు అయ్యన్న కుటుంబం చరిత్ర తెలుసా అని ప్రశ్నించారు. అయ్యన్నపాత్రుడి కుటుంబం సొంత భూములను ప్రభుత్వాలకు దానం చేసి…
రాజకీయాలకు తాను దూరంగా ఉన్నా తనకు ఇంకా అనుచర వర్గం ఉందని గల్లా అరుణకుమారి వెల్లడించారు. అయితే వాళ్లకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చానని.. వాళ్లకు ఎక్కడ బాగుంటే అక్కడ ఉండాలని చెప్పానని తెలిపారు.
సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి.. వరుస ట్వీట్లతో చెలరేగిపోతున్నారు.. టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ నేతలను టార్గెట్ చేస్తూ.. సెటైర్లు వేస్తూ ట్విట్టర్లో మంట పెడుతున్నారు. మరోవైపు, అదే స్థాయిలో టీడీపీ నుంచి సాయిరెడ్డి ట్వీట్లకు కౌంటర్లు కూడా పడుతున్నా.. ఆయన ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు.. ఇక, తన తాజా ట్వీట్లో.. టీడీపీ అంటే తెలుగు దున్నపోతుల పార్టీ అంటూ కొత్త అర్థం చెప్పారు…
వైసీపీ సర్కారుపై టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తీవ్ర విమర్శలు చేశారు. గృహనిర్మాణంపై మంత్రి జోగి రమేష్ రోగి రమేష్లా అసత్యాలు మొరుగుతున్నారని మండిపడ్డారు. గృహనిర్మాణం, ఇళ్ల పట్టాల విషయంలో జగన్ రెడ్డి అండ్ కో కోట్లాది రూపాయలను స్వాహా చేశారని ఆయన ఆరోపించారు. ఐదేళ్ల టీడీపీ పాలనలో 7.82 లక్షలకు పైగా పేదలకు పక్కా గృహ నిర్మాణం జరిగిందని అసెంబ్లీలో గత మంత్రి రంగనాథరాజు స్వయంగా వెల్లడించారని గుర్తుచేశారు. గత మూడేళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్…