ఏపీలో పరిశ్రమలు పెట్టుబడులు పెట్టేందుకు అనువైన పరిస్థితులు ఉన్నాయని ఐటీశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన టీడీపీపై ఆరోపణలు చేశారు. టీడీపీకి రాష్ట్రం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బిజినెస్ ర్యాంకులపై టీడీపీ విమర్శలు చేస్తోందని.. మళ్లీ అధికారంలోకి రావాలన్న తాపత్రయం మినహా టీడీపీకి మరో ఆలోచన లేదని మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. నాలుగు పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్లు పెట్టి 20 లక్షల కోట్ల పెట్టుబడులు…
పేదపిల్లలకు ప్రభుత్వ విద్యను దూరం చేయవద్దని కోరుతూ సీఎం జగన్‌కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ రాశారు. జాతీయ విద్యావిధానం, పాఠశాలల విలీనంతో పేదపిల్లలకు ప్రభుత్వ విద్య దూరం చేయవద్దని ఆయన లేఖలో కోరారు. పాఠశాలల ప్రారంభం రోజునే లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ప్రభుత్వ నిర్ణయం శరాఘాతంగా మారిందని లోకేష్ ఆరోపించారు. ఆగమేఘాలపై జాతీయ విద్యా విధానం అమలు, పాఠశాలల విలీనంపై తీసుకున్న నిర్ణయం పేద విద్యార్థులను ప్రభుత్వ విద్యకు…
రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతు ఇస్తున్నట్లు వైసీపీ బహిరంగంగానే ప్రకటించింది. అయితే ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీ మాత్రం తమ వైఖరిని ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో టీడీపీ వైఖరిని ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. తమకు ఎర్రకోట మీద జెండా ఎగరేయాలని, ఢిల్లీలో చక్రం తిప్పాలన్న ఆలోచన లేదని ఆయన స్పష్టం చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టి రాష్ట్ర ప్రయోజనాల మీదే ఉన్నాయని తెలిపారు.…
గుంటూరు టీడీపీ లోక్‌సభ ఎంపీ గల్లా జయదేవ్ కుటుంబ ఆధ్వర్యంలోని అమరరాజా గ్రూప్ అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటింది. ఈ కంపెనీ తాజాగా ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కించుకుంది. ఈ సందర్భంగా 500 బెస్ట్ ఎంప్లాయర్స్ జాబితాలో అమరరాజా కంపెనీ నిలిచింది. ఈ విషయాన్ని అమరరాజ గ్రూప్ మంగళవారం స్వయంగా వెల్లడించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ట్వీట్ చేసింది. ప్రజల విలువ తెలిస్తే పోటీలో ముందుంటామన్న విషయాన్ని తాము నమ్ముతామని.. విశ్వాసం, గౌరవం అన్నవే ఆ…
సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వారిపై సీఐడీ వేధింపులు సరికాదని డీజీపీ కసిరెడ్డి వెంకట రాజేంద్రనాథ్‌రెడ్డికి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. ఈ సందర్భంగా గార్లపాటి వెంకటేశ్వరరావు, మోకర్ల సాంబశివరావులను అక్రమంగా అదుపులోకి తీసుకుని సీఐడీ పోలీసులు వేధించారని లేఖలో ఆరోపించారు. అర్ధరాత్రి గోడలు దూకి తలుపులు పగలగొట్టి నోటీసుల పేరుతో వేధింపులకు గురిచేశారని మండిపడ్డారు. ఇంట్లో ఆడవాళ్లు ఉన్న సమయంలో అక్రమంగా ఇంట్లోకి చొరబడి కుటుంబసభ్యులను భయబ్రాంతులకు గురిచేశారన్నారు. అక్రమంగా కస్టడీలోకి తీసుకుని సీఐడీ…
ఏపీ సీఐడీ అడినషల్ డీజీపికి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య లేఖ రాశారు. టీడీపీ ఏపీ చీఫ్ అచెన్నాయుడు సంతకం ఫోర్జరీ చేసి తప్పుడు సమాచారం ప్రచారం చేస్తున్నారంటూ ఆయన ఫిర్యాదు చేశారు. రెండు రాజకీయ వర్గాల మధ్య గొడవలు పెట్టేందుకు ఈ ఫోర్జరీ జరిగిందని వర్ల రామయ్య ఆరోపించారు. దొంగ సంతకాలతో సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్న వారిపై అనేక ఫిర్యాదులిచ్చినా చర్యలు ఎందుకు తీసుకోలేదని లేఖలో ప్రశ్నించారు. వైసీపీ మద్దతుదారులు జూన్…
కుప్పంలో ఓడిపోయినా టీడీపీ అక్కడ గెలిచి రికార్డు సృష్టించింది. అధినేత కూడా అన్ని వేదికలపైనా ఆ గెలుపు గురించే మాట్లాడుతున్న సమయంలో ఒక్కసారిగా దుబాయ్ గోల వచ్చిపడింది. దీంతో జెట్ స్పీడులో దూసుకుపోతున్న పార్టీ కాస్తా ఇప్పుడు సైలెంటైంది. దీంతో తమ్ముళ్లలో ఎక్కడలేని అయోమయం ఏర్పడిందట. ఇంతకీ దర్శి టీడీపీలో దుబాయ్ గోల తీరేదెపుడు? ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్లు గందరగోళంలో పడిపోయారట. నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఓడినా ఆ తర్వాత తొలిసారిగా జరిగిన…
చాలా కాలం తర్వాత ఉమ్మడి కృష్ణా జిల్లా పార్టీ నేతలతో కలిసి టీడీడీ ఎంపీ కేశినేని నాని ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అగ్ని కుల క్షత్రియుల భవన నిర్మాణానికి ఎంపీ ల్యాడ్స్ నుంచి ఎంపీ కేశినేని నాని రూ. 65 లక్షలు కేటాయించారు. విజయవాడ ఆటో నగర్లో తమకున్న స్థలంలో అగ్నికుల క్షత్రియులు భవన నిర్మాణం చేపట్టనున్నారు. ఈ మేరకు ఎంపీ ల్యాడ్స్ నిధులను కేటాయించినందుకు ఎంపీ కేశినేని నానికి అగ్నికుల క్షత్రియులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ…
ఏపీ ప్రభుత్వంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ తీవ్ర విమర్శలు చేశారు. జగన్ మోసపు రెడ్డి బాదుడే బాదుడుకి కులం, మతం, ప్రాంతం లేదన్నారు. రెండు నెలలు కాకముందే డీజిల్ సెస్ పేరుతో మరోసారి ఆర్టీసీ ఛార్జీలు పెంచడం సామాన్యుడిపై పెను భారం మోపడమేనని లోకేష్ ఆరోపించారు. పల్లెవెలుగు సర్వీసుల్లో గరిష్టంగా రూ.25, ఎక్స్ ప్రెస్ బస్సుల్లో రూ.90 పెంచారని.. అల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ బస్సుల్లో రూ.120, ఏసీ సర్వీసుల్లో…