మహేష్ బాబు ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు రమేష్. పలు సినిమాల్లో నటించిన రమేష్ బాబు మృతిచెందడంతో ఆయన అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. రమేష్ హఠాన్మరణం పట్ల పలువురు సంతాపం తెలిపారు.
తమిళనాడు లో జరిగిన సైనిక హెలికాప్టర్ దుర్ఘటనలో త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్, ఆయన భార్య తో పాటు 13 మంది సైనిక అధికారులు కన్నుమూసిన విషయం తెలిసింది. వారికి తెలుగు చలన చిత్ర పరిశ్రమ శుక్రవారం రోజున తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ హాల్ లో ఘనంగా నివాళులు అర్పించింది. బాంబే రవి స్వరకల్పనలో వెలువడిన జయహో భారత్ అనే దేశభక్తి గీతాన్ని సైనిక అమర వీరులకు అంకితం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా…
తెలుగు చిత్రసీమలో చాలా అంశాలు చరిత్రకు అందక దూరంగా నిలిచాయి. అసలు మన తొలి తెలుగు చిత్రం ‘భక్త ప్రహ్లాద’ ఎప్పుడు విడుదలయిందో మొన్నటి దాకా చాలామందికి తెలియదు. ఈ సినిమా 1931 సెప్టెంబర్ 15న విడుదలయిందని చాలా రోజులు సాగింది. అయితే లభిస్తున్న సాక్ష్యాధారాల ప్రకారం ‘భక్త ప్రహ్లాద’ చిత్రం 1932 ఫిబ్రవరి 6 విడుదలయింది. అలాగే మన తెలుగు సినిమా రంగంలో తొలి నేపథ్యగాయకుడుగా ఎమ్.ఎస్. రామారావును, తొలి నేపథ్యగాయనిగా రావు బాలసరస్వతీదేవిని చెప్పుకుంటూ…