తన చిత్రాలలో ఏదో ఒక వైవిధ్యం ప్రదర్శించాలని తపించేవారు ప్రముఖ నిర్మాత, దర్శకుడు యు.విశ్వేశ్వరరావు. ‘విశ్వశాంతి’ పతాకంపై విశ్వేశ్వరరావు నిర్మించిన పలు చిత్రాలు తెలుగువారిని విశేషంగా అలరించాయి. నిర్మాతగా, దర్శకునిగా, రచయితగా విశ్వేశ్వరరావు తనదైన బాణీ పలికించారు. ఆయన తెరకెక్కించిన చిత్రాలు దేశవిదేశాలలో ప్రదర్శితమయ్యాయి. ప్రభుత్వ అవార్డులనూ, ప్రేక్షకుల రివార్డులనూ పొందాయి. నేటికీ ఆ నాటి సినీజనం ‘విశ్వశాంతి’ విశ్వేశ్వరరావు అనే ఆయనను గుర్తు చేసుకుంటారు. మహానటుడు యన్టీఆర్ కు విశ్వేశ్వరరావు వియ్యంకుడు. యన్టీఆర్ తనయుడు, ప్రముఖ…
ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకుడు, నటుడు అమ్మ రాజశేఖర్ మరోసారి వెండితెరపైకి ఆర్టిస్ట్ గా వస్తున్నాడు. అతనితో పాటు కట్ల ఇమ్మార్టెల్, అలీషా, షాలినీ ప్రధాన తారాగణంగా ‘ఎస్.ఎస్.డి’ (స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్) అనే సినిమా గురువారం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో మొదలైంది. ఈ చిత్రాన్ని కట్ల రాజేంద్ర ప్రసాద్ దర్శకత్వంలో ఈడీ ప్రసాద్ నిర్మిస్తున్నారు. సినిమా ప్రారంభోత్సవానికి రాజశేఖర్, జీవిత, యస్.వి. కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి, రామ సత్యనారాయణ, సాయివెంకట్, పారిశ్రామికవేత్త ప్రశాంత్ కుమార్ తదితరులు హాజరయ్యారు.…
నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన `అఖండ` చిత్రం సంచలన విజయం సాధించి, పలు రికార్డులను నమోదు చేసుకుంది. ఈ సినిమా విడుదలయ్యాక పలు క్రేజీ ప్రాజెక్ట్స్ జనం ముందు నిలచినా, `అఖండ` మాత్రం ఇంకా థియేటర్లలో ప్రదర్శితమవుతూ ఉండడం మరింత విశేషం. ఈ చిత్రంతో వరుసగా బాలయ్యతో మూడు సినిమాలు తీసి ఘనవిజయం సాధించి, డైరెక్టర్ బోయపాటి శ్రీను `హ్యాట్రిక్` సొంతం చేసుకున్నారు. ఇక ఈ మూడు చిత్రాలలోనూ బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేయడం తెలిసిందే! ఈ కోణంలోనూ…
”అత్తారింటికి దారేది” ఫేమ్, నటి ప్రణీత సుభాష్ తీపి కబురు చెప్పారు. త్వరలో ఆమె తల్లి కానున్నట్లు సోమవారం ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ”నా భర్త 34వ పుట్టినరోజు నాడు.. దేవతలు మాకు అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చారు” అని పోస్ట్ చేశారు. 2021లో బెంగళూరుకి చెందిన వ్యాపారవేత్త నితిన్ రాజును పెళ్లి చేసుకున్నారు ప్రణీత. టాలీవుడ్ ప్రముఖ హీరోల సరసన నటించి గుర్తింపు పొందారామె. సిద్ధార్థ్‌తో నటించిన బావ చిత్రంలో తెలుగులో ఎంట్రీ ఇచ్చారు ఈ కన్నడ…
సినిమారంగాన్ని నమ్ముకుంటే ఏ నాడూ మన నమ్మకాన్ని వమ్ము చేయదని అంటారు. అలా సక్సెస్ చూసిన వారెందరో ఉన్నారు. ప్రముఖ నిర్మాత, దర్శకుడు ఏ.యమ్.రత్నం సినిమా తల్లి వంటిది. బిడ్డలను ఎప్పుడూ కాపాడుతుంది అంటూ ఉంటారు. మేకప్ మేన్ గా, నిర్మాతగా, దర్శకునిగా తనదైన బాణీ పలికించిన ఏ.యమ్.రత్నం ఇప్పటికీ జనానికి వైవిధ్యం అందించాలనే తపనతోనే ఉన్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు చిత్రం నిర్మిస్తున్నారాయన. గతంలో తన భారీ చిత్రాల…
రోజురోజుకు కరోనా విజృభిస్తుంది. కరోనా థర్డ్ వేవ్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఇక ఈ మహమ్మారి వలన చిత్ర పరిశ్రమ కుదేలు అవుతోంది. ఇటీవల థర్డ్ వేవ్ విజృంభిస్తుండడంతో సినిమాలను వాయిదా వేయడం తప్ప మేకర్స్ కి వేరే గత్యంతరం కనిపించడం లేదు. ఇప్పటికే పాన్ ఇండియా సినిమాల నుంచి సాధారణ సినిమాల వరకు చాలా సినిమాలు తమ రిలీజ్ డేట్ ని మార్చుకున్నాయి. తాజాగా అదే కోవలోకి చేరింది అడవి శేష్ ” మేజర్” శశి కిరణ్…
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కరోనా బారిన పడిన సగంతి తెలిసిందే ఈ మహమ్మారి వలన అన్న రమేష్ బాబు మృతదేహాన్ని కడసారి కూడా చూడలేకపోయాడు మహేష్. గత కొంతకాలంగా కాలేయ సమస్యతో బాధపడుతున్న రమేష్ బాబు జనవరి 8 న కన్నుమూసిన సంగతి తెలిసిందే. అన్న మరణం మహేష్ ని తీవ్రంగా కలిచివేసింది. చివరిచూపు కూడా నోచుకోలేకపోవడం మహేష్ ని ఇంకా కృంగదీసింది. కరోనా నుంచి కోలుకున్న మరుక్షణం మహేష్.. అన్న రమేష్ పెద్ద…
మహేష్ బాబు ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు రమేష్. పలు సినిమాల్లో నటించిన రమేష్ బాబు మృతిచెందడంతో ఆయన అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. రమేష్ హఠాన్మరణం పట్ల పలువురు సంతాపం తెలిపారు.
తమిళనాడు లో జరిగిన సైనిక హెలికాప్టర్ దుర్ఘటనలో త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్, ఆయన భార్య తో పాటు 13 మంది సైనిక అధికారులు కన్నుమూసిన విషయం తెలిసింది. వారికి తెలుగు చలన చిత్ర పరిశ్రమ శుక్రవారం రోజున తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ హాల్ లో ఘనంగా నివాళులు అర్పించింది. బాంబే రవి స్వరకల్పనలో వెలువడిన జయహో భారత్ అనే దేశభక్తి గీతాన్ని సైనిక అమర వీరులకు అంకితం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా…
తెలుగు చిత్రసీమలో చాలా అంశాలు చరిత్రకు అందక దూరంగా నిలిచాయి. అసలు మన తొలి తెలుగు చిత్రం ‘భక్త ప్రహ్లాద’ ఎప్పుడు విడుదలయిందో మొన్నటి దాకా చాలామందికి తెలియదు. ఈ సినిమా 1931 సెప్టెంబర్ 15న విడుదలయిందని చాలా రోజులు సాగింది. అయితే లభిస్తున్న సాక్ష్యాధారాల ప్రకారం ‘భక్త ప్రహ్లాద’ చిత్రం 1932 ఫిబ్రవరి 6 విడుదలయింది. అలాగే మన తెలుగు సినిమా రంగంలో తొలి నేపథ్యగాయకుడుగా ఎమ్.ఎస్. రామారావును, తొలి నేపథ్యగాయనిగా రావు బాలసరస్వతీదేవిని చెప్పుకుంటూ…