TFIEF: ఎంప్లాయిస్ ఫెడరేషన్ లో అనిల్ కుమార్ ప్యానెల్ విజయం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telugu Cinema: తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షులు అనిల్ కుమార్ వల్లభనేని ప్యానెల్ విజయాన్ని సాధించింది. 24 కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు పాల్గొన్న ఈ ఎన్నికల్లో 2023-2025 సంవత్సరానికి గాను ఫెడరేషన్ అధ్యక్షుడిగా అనిల్ కుమార్ వల్లభనేని, సెక్రటరీ గా పీఎస్ఎన్ దొర ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. కోశాధికారిగా పోటీ చేసిన సురేష్ 28 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
ఈ సందర్భంగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ అధ్యక్షులు అనిల్ కుమార్ వల్లభనేని మాట్లాడుతూ, “మరోసారి మా ప్యానెల్ పై నమ్మకం ఉంచి ఘన విజయాన్ని అందించిన కార్మిక సోదర సోదరీమణులకు, 24 కార్మిక సంఘాల నాయకులకు, తోటి కౌన్సిల్ సభ్యులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు. సినిమా ఇండస్ట్రీ లో ఉన్న 25 వేల మంది సినిమా కార్మికుల కష్టనష్టాలు తెలిసిన నాయకులుగా మరొకమారు మమ్మల్ని కార్మికులు గుర్తించినందుకు సంతోషంగా ఉంది. ఫెడరేషన్ కు, సినిమా కార్మికులకు తగు న్యాయం చేసే విధంగా మా మీద ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా అందరిని కలుపుకొని ముందుకు సాగుతాం” అని తెలిపారు. ఈ గెలుపు 24 సంఘాల సినిమా కార్మికులదేనని, దీన్ని ఫెడరేషన్ మాజీ అధ్యక్షులు స్వర్గీయ కొమర వెంకటేష్, వికాస్ ( విక్కీ ) లకు అంకితం చేస్తున్నామని అన్నారు.
Also Read
- Dasara movies : దసరా రేసులో 4 సినిమాలు.. ఏ సినిమాకు క్రేజ్ ఎక్కువ?
- Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
- Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
- Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
తాజావార్తలు
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
-
Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
-
Dasara movies : దసరా రేసులో 4 సినిమాలు.. ఏ సినిమాకు క్రేజ్ ఎక్కువ?
-
BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
-
CM Vijay: తమిళనాడు రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. ఇండియా కూటమిలోకి విజయ్ పార్టీ TVK!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!